న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనిని మరిపించాడు: దినేశ్ కార్తీక్ అద్భుత స్టంపౌట్ చూశారా? (వీడియో)

By Nageshwara Rao
IPL 2018, RR vs KKR: Dinesh Karthiks MS Dhoni-esque wicketkeeping produces a brilliant stumping - Watch

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌ కెప్టెన్ అజ్యింకె రహానే తడబాటు జట్టులోని సహచర ఆటగాళ్లను కూడా ఇబ్బందులుపాలు చేస్తోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓపెనర్ డీఆర్క్ షాట్‌ రనౌటవడానికి పరోక్షంగా కారణమైన రహానే బుధవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన తొందరపాటుతో రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

ఐపీఎల్ 11వ సీజన్ ఆరంభం నుంచీ రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగుతోన్న రహనే ప్రతి పరుగు తీసే ముందు నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉంటే.. కొద్దిగా ముందుకు వెళ్లి.. తర్వాత ఆగి.. మళ్లీ పరుగుని కొనసాగించడం జరుగుతోంది. దీంతో స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌‌కి పరుగు కోసం వెళ్లాలా వద్దా అనే తికమకలో పడుతున్నాడు.

గత రెండు మ్యాచ్‌ల్లో కూడా ఇలాగే

గత రెండు మ్యాచ్‌ల్లో కూడా ఇలాగే

గత రెండు మ్యాచ్‌ల్లో రహానేతో పాటు ఓపెనర్‌గా క్రీజులోకి వస్తోన్న డీఆర్క్ షాట్‌ సరిగ్గా ఇలానే రనౌట్‌గా వెనుదిరిగాడు. టోర్నీలో భాగంగా బుధవారం రాజస్థాన్-కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే నిదానంగా సాగింది.

తొలి మూడు ఓవర్ల వరకు ఒక్క బౌండరీ లేదు

తొలి మూడు ఓవర్ల వరకు ఒక్క బౌండరీ లేదు

కోల్‌కతా బౌలింగ్‌కు పరుగులు తీసేందుకు బ్యాట్స్‌మెన్‌ ఇబ్బందిపడ్డారు. తొలి మూడు ఓవర్ల వరకు ఒక్క బౌండరీ కూడా లేదు. అప్పటికి స్కోరు కేవలం 9 పరుగులే. అయితే నాలుగో ఓవర్‌లో కెప్టెన్‌ రహానె వరుసగా నాలుగు ఫోర్లతో చెలరేగి ఒక్కసారిగా స్టేడియంలో ఊపు తెచ్చాడు.

క్రీజు వెలుపలికి వచ్చి బంతిని హిట్ చేసిన రహానే

క్రీజు వెలుపలికి వచ్చి బంతిని హిట్ చేసిన రహానే

అయితే, ఇన్నింగ్స్ ఏడో ఓవర్ వేసిన రానా బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి బంతిని హిట్ చేసేందుకు (36: 19 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సు) ప్రయత్నించాడు. అయితే.. బంతి అతని బ్యాట్‌కి అందకుండా నేరుగా వెళ్లి ఫ్యాడ్స్‌ను తాకి ప్రక్కకు వెళ్లింది. దీంతో బంతి గమనాన్ని పరిశీలించకుండా రహానే రెండు అడుగులు వేశాడు.

డైవ్ చేస్తూ వికెట్లను గిరాటేసిన దినేశ్ కార్తీక్

వెంటనే కోల్‌కతా వికెట్ కీపర్ మెరుపు వేగంతో బంతిని అందుకుని డైవ్ చేస్తూ వికెట్లను గిరాటేశాడు. దీంతో నిరాశగా రహానే పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సీజన్‌లో కోల్‌కతా జట్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న తర్వాత దినేశ్ కార్తీక్ తనదైన శైలిలో రెచ్చిపోతున్నాడు.

7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌పై కోల్‌కతా ఘన విజయం

7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌పై కోల్‌కతా ఘన విజయం

ఇదిలా ఉంటే బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. అనంతరం చేధనకు దిగిన కోల్‌కతా 18.5 ఓవర్లలో మూడు వికెట్లకు 163 పరుగులు చేసి విజయం సాధించింది.

Story first published: Thursday, April 19, 2018, 11:19 [IST]
Other articles published on Apr 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X