న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సన్‌రైజర్స్ చేతిలో ఓటమి: రహానే ఆవేదన, ఓటమికి కారణం ఇదీ

By Nageshwara Rao
IPL 2018: Rahane rues lack of partnership after loss to Sunrisers Hyderabad

హైదరాబాద్: 'భారీ భాగస్వామ్యాలను నెలకొల్పలేకపోయాం' సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి అనంతరం రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ రహానే అన్న మాటలివి. ఐపీఎల్‌లో భాగంగా సోమవారం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలవడంపై రహానే ఆవేదన వ్యక్తం చేశాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసి సాధారణ స్కోరుకే పరిమతమైంది. అనంతరం 126 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 15.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది.

శిఖర్‌ ధావన్‌ 13 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో 77 పరుగులతో హాఫ్ సెంచరీ నమోదు చేయగా.... కేన్‌ విలియ‍మ్సన్‌ (36 నాటౌట్‌) అతడికి మద్దతుగా నిలవడంతో సన్ రైజర్స్ అలవోక విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ అనంతరం రహానే మాట్లాడుతూ 'ఈ వికెట్‌ మీద 150-160 పరుగులు చేస్తే నిలబెట్టుకోవచ్చని అనుకున్నాం' అని అన్నాడు.

'మీడియం పేస్‌కు అనుకూలంగా బంతిని పడుతుండటంతో ఆ స్కోరు సరిపోతుందని అనుకున్నాం. కానీ మేం భారీ భాగస్వామ్యాలను నెలకొల్పలేకపోయాం. వరుసగా వికెట్లు పడ్డాయి. ఇన్నింగ్స్‌ను నిలబెట్టే కీలక భాగస్వామ్యం కుదరలేదు' అని రహానే తెలిపాడు. ఐపీఎల్‌లో తమకు ఇది తొలి మ్యాచ్‌ మాత్రమేనని, రానున్న మ్యాచ్‌ల్లో తమ జట్టు సత్తా చాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

జట్టుకు అందుబాటులో ఉన్న విదేశీ ఆటగాళ్లైన బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, డీ ఆర్సీ షార్ట్‌, బెన్‌ లాఫ్‌లిన్‌ మంచి సమర్థులైన క్రీడాకారులని, అద్భుతంగా ఆడే సత్తా వారికి ఉందని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. 'విదేశీ ఆటగాళ్లు చాలా చక్కగా ఆడతారు. బిగ్ బాష్ లీగ్‌లో డీ ఆర్సీ షార్ట్‌ ప్రదర్శన చూశాం. ఆసీస్ తరుపున కూడా రాణించాడు. ఇక, జోస్ బట్లర్ స్టోక్స్ గురించి చెప్పాల్సిన పని లేదు. వాళ్లు ఎంత డేంజరస్ ఆటగాళ్లో అందరికీ తెలిసిందే' అని రహానే అన్నాడు.

బాల్ టాంపరింగ్‌కు పాల్పడి ఏడాది పాటు నిషేధానికి గురైన స్టీవ్ స్మిత్‌పై కూడా రహానే స్పందించాడు. స్టీవ్‌ స్మిత్‌ అద్భుతమైన ఆటగాడని, అతను లేకపోయినా అతని గురించి తాము ఆలోచిస్తున్నామని, మ్యాచ్‌లో ప్రతి ఒక్కరూ మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు కెప్టెన్‌గా తీసుకున్న స్టీవ్‌ స్మిత్‌ బాల్‌ ట్యాపంరింగ్‌ వివాదం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, April 10, 2018, 15:34 [IST]
Other articles published on Apr 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X