జీవితాంతం ఇదే నా బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పుకుంటా: బ్రావో

Posted By:
IPL 2018: My best-ever innings, says Bravo

హైదరాబాద్: అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి 30బంతులలో 68 పరుగులు చేసిన బ్రావో తన ఆనందాన్ని ఇలా వెల్లడించాడు.
ఆల్‌రౌండర్ డ్వేన్‌ బ్రావో వీరోచిత ఇన్నింగ్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్‌కు తొలి పోరులో అద్భుత విజయాన్ని అందించింది. అప్పటి వరకూ మ్యాచ్‌ తమదే అనుకుంటున్న ముంబై ఆటగాళ్ల అంచనాల్ని తలకిందులు చేస్తూ ఆల్‌రౌండర్‌ బ్రావో 68 (3 ఫోర్లు, 7 సిక్సులు) పరుగులతో చెన్నైను దాదాపు విజయతీరాలకు చేర్చాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

ఒక ఓవర్ మిగిలి ఉండగానే.. గాయం కారణంగా తప్పుకున్న కేదార్‌ జాదవ్‌ బ్యాటింగ్‌కు దిగి మరో బంతి మిగిలి ఉండగానే లాంఛనాన్ని పూర్తి చేసి చెన్నైకు ఉత్కంఠభరితమైన విజయాన్ని అందించాడు. ఈ సందర్భంగా బ్రావో మాట్లాడుతూ..'నా కెరీర్‌లో ఎప్పటికైనా ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్‌. మరోసారి ఏ ఫార్మెట్‌లోనైనా ఇలాంటి అద్భుత పోరాటం చేస్తానని అనుకోవట్లేదు. ఈ ఇన్నింగ్స్‌ నాకెంతో ప్రత్యేకం. అర్ధశతకం చేరుకున్నాక కూడా నేను నా బ్యాట్‌ ఎత్తలేదు. కారణం నేను పూర్తి చేయాల్సిన పని ఇంకా ఉందని నాకు తెలుసు. కేవలం జట్టుకు విజయాన్ని అందించాలనే ఆలోచనతోనే నా బ్యాటింగ్‌ కొనసాగించానని' చెప్పుకొచ్చాడు.

'చివరి ఓవర్‌లో అవుట్‌ కావడం కాస్త నిరుత్సాహాపరిచింది. అయితే అప్పటికే జట్టును దాదాపు విజయతీరాలకు చేర్చాననే అనుకున్నాను. గాయం కారణంగా బ్యాటింగ్‌ ఆపేసి వెళ్లి మళ్లీ‌ చివరి ఓవర్‌లో ఎంతో ధైర్యంగా సిక్సర్‌, ఫోర్‌ బాది జట్టుకు అద్భుత విజయాన్ని అందించిన కేదార్‌ జాదవ్‌ను ఎప్పటికీ మర్చిపోమని' బ్రావో పేర్కొన్నాడు.

మ్యాచ్‌లో గొప్ప ప్రదర్శన చేసిన బ్రావో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తరువాత మాట్లాడాడు. ఇది జట్టు గొప్ప ప్రయత్నం. ఈ విజయాన్ని చెన్నై అభిమానులకు అంకితం చేయాలనుకుంటున్నా. ఇలాంటి మధుర క్షణాల కోసం వారు ఎన్నో రోజులుగా వేచి చూశారు... 'నా మీద పూర్తి నమ్మకాన్ని ఉంచిన కెప్టెన్‌ ధోనీ బాగా ఆడావని అభినందించాడు. ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే అవుట్ అవడం పట్ల చాలా నిరుత్సాహానికి గురైయ్యాను. కానీ, నా స్కోరు ఆధారంగా మ్యాచ్ గెలవడం చాలా ఆనందంగా ఉందని' ఈ ఆల్‌రౌండర్‌ చెప్పాడు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Sunday, April 8, 2018, 16:29 [IST]
Other articles published on Apr 8, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి