న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోట్లాలో ఢిల్లీపై విజయం: ఫ్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా హైదరాబాద్

By Nageshwara Rao
 SRH

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. గత విజయంతో దాదాపు ప్లే ఆఫ్‌ బెర్తును ఖాయం చేసుకున్న సన్‌రైజర్స్‌.. తాజాగా గురువారం రాత్రి ఫిరోజ్ షా కోట్ల వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

తద్వారా ఈ సీజన్‌లో ప్లే ఆప్స్‌కు చేరుకున్న తొలి జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ 15 పరుగుల వద్ద అలెక్స్‌ హేల్స్‌(14) వికెట్‌ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్‌ విలియమ‍్సన్‌, ఓపెనర్ ధావన్‌తో కలిసి హైదరాబాద్‌కు విజయాన్నందించాడు.

శిఖర్ ధావన్‌(92 నాటౌట్‌; 50 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు), విలియమ్సన్‌(80 నాటౌట్‌; 53 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు)లు హైదరాబాద్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 173 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో సన్‌రైజర్స్‌ 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది.

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు మొత్తంగా తొమ్మిదో విజయం కాగా, వరుసగా ఆరో విజయం కావడం విశేషం. ఇదిలా ఉంటే తాజా ఓటమితో ఢిల్లీ ప్లే ఆఫ్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది.


15 ఓవర్లకు హైదరాబాద్ 152/1
ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ సునాయాసంగా ఛేదిస్తోంది. ఓపెనర్ శిఖర్ ధావన్‌, కెప్టెన్ విలియమ్సన్ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. నిలకడగా ఆడుూ వీలుచిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లతో మ్యాచ్‌ను లక్ష్యం దిశగా సాగుతున్నారు. దీంతో 15 ఓవర్లకు గాను సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ నష్టానికి 152 పరుగులు చేసింది. ఈ ఇద్దరూ కలిసి 79 బంతుల్లో 137 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో కేన్ విలియమ్సన్ (61), శిఖర్ ధావన్ (75) పరుగులతో ఉన్నారు. విజయానికి 30 బంతుల్లో 36 పరుగులు చేయాల్సి ఉంది.


10 ఓవర్లకు హైదరాబాద్ 91/1
ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్దేశించిన 188 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ ఆచితూచి ఆడుతున్నారు. ఓపెనర్ అలెక్స్ హేల్స్ (14) ఆరంభంలోనే వికెట్ చేజార్చుకున్నా.. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (32 నాటౌట్)తో కలిసి మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (43 నాటౌట్) దూకుడుగా ఆడుతున్నాడు. దీంతో 10 ఓవర్లకు గాను వికెట్ నష్టానికి హైదరాబాద్ 91 పరుగులు చేసింది. హైదరాబాద్ విజయానికి ఇంకా 72 బంతుల్లో 116 పరుగులు చేయాల్సి ఉంది.


5 ఓవర్లకు హైదరాబాద్ 38/1
ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్దేశించిన 188 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలకడగా ఆడుతోంది. భారీ షాట్లు ఆడే క్రమంలో ఓపెనర్‌ అలెక్స్‌ హేల్స్‌ (14) పరుగుల వద్ద హర్షల్‌ పటేల్‌ బౌలింగ్లో ఔటయ్యాడు. శిఖర్‌ ధావన్‌ (10), కేన్‌ విలియమ్సన్‌ (13) వేగంగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు. 5 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది.


తొలి వికెట్ కోల్పోయిన హైదరాబాద్
ఫిరోజ్ షా కోట్ల వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్దేశించిన 188 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టుకు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. హర్షల్ పటేల్ వేసిన రెండో ఓవర్‌లో ఓపెనర్ హేల్స్(14) ఎల్‌ల్బీగా పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 3 ఓవర్లు ముగిసేసరికి క్రీజ్‌లో ధావన్(3), విలియమ్సన్(3) పరుగులతో ఉన్నారు.


సన్‌రైజర్స్ విజయ లక్ష్యం 188
ఫిరోజ్ షా కోట్ల వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ బ్యాట్స్‌మెన్లలో రిషబ్ పంత్ (106: 59 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సులు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

షకీబ్ వేసిన నాలుగో ఓవర్ ఐదో బంతికి పృథ్వీ(9) భారీ షాట్‌కు ప్రయత్నించి శిఖర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే మరో ఓపెనర్ రాయ్(11) కీపర్ గోస్వామికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన సిద్ధార్థ కౌల్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లతో బాదుడు ప్రారంభించాడు.

అయితే సందీప్ శర్మ వేసిన ఏడవ ఓవర్‌లో అయ్యర్(3) అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. ఆ తర్వాత హర్షల్ పటేల్(24) కూడా రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరినా, రిషబ్ పంత్ మాత్రం మైదానంలో బౌండరీ వర్షం కురిపించాడు. చివరి ఓవర్ వరకూ ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు.

63 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్సులతో 128 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు భారీ స్కోర్‌ను అందించాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో రిషబ్ పంత్ వరుసగా 4, 4, 6, 6, 6 బాదాడు. ఐపీఎల్ కెరీర్‌లో రిషబ్ పంత్‌కి ఇదే తొలి శతకం కాగా ఈ సీజన్‌లో నమోదైన మూడో సెంచరీ.

టోర్నీ ఆరంభంలోనే క్రిస్‌గేల్ (పంజాబ్), షేన్ వాట్సన్ (చెన్నై) సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 188 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. సన్‌రైజర్స్ బౌలర్లలో షకీబ్ ఉల్ హాస్ రెండు వికెట్లు తీశాడు.


14 ఓవర్లకు ఢిల్లీ 98/4
ఫిరోజ్ షా కోట్లా వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 14 ఓవర్లకు గాను 4 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. హర్షల్ పటేల్(24) పరుగుల వద్ద రనౌటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్(49) పరుగులతో ఉన్నాడు.


9 ఓవర్లకు ఢిల్లీ 48/3
ఫిరోజ్ షా కోట్లా వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ మూడో వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ 8వ ఓవర్ నాలుగో బంతికి ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(3) పరుగుల వద్ద వికెట్ కీపర్ శ్రీవాత్సవ్ గోస్వామి రనౌట్ చేశాడు. ప్రస్తుతం 10 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్(24), హర్షల్ పటేల్(4) పరుగులతో ఉన్నారు.


ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ
ఫిరోజ్ షా కోట్లా వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఒకే ఓవర్‌లో ఓపెనర్ల వికెట్లను చేజార్చుకుంది. ఓపెనర్లు పృథ్వీషా, జేసన్ రాయ్‌లో పవర్‌ప్లేలో భారీ స్కోరు సాధనగా దూకుడుగా ఆడుతున్నారు. ఈ క్రమంలో సన్‌రైజర్స్ బౌలర్లు కట్టడి చేశారు.

ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన స్పిన్నర్ షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో బౌండరీ కొట్టి మంచి ఊపు మీద కనిపించిన పృథ్వీ షా (9) భారీ షాట్ ఆడబోయి ఫీల్డర్ ధావన్ చేతికి చిక్కగా.. ఆ ఓవర్‌లోనే చివరి బంతిని క్రీజు వెలుపలికి వచ్చి షాట్ కొట్టేందుకు ప్రయత్నించి మరో ఓపెనర్ జేసన్ రాయ్ (11) కీపర్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు ఐదు ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 23 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(1), రిషబ్ పంత్(1) ఉన్నారు.


3 ఓవర్లకు హైదరాబాద్ 16/0
ఫిరోజ్ షా కోట్లా వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 3 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జేసన్ రాయ్(10), పృథ్వీ షా(5) పరుగులతో ఉన్నారు.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ
ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం ఢిల్లీ డేర్‌డెవిల్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు స్వల్ప మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో ఒక మార్పు జరిగింది. గాయపడిన వికెట్ కీపర్ సాహా స్థానంలో.. గోస్వామి తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మూడు మార్పులు చేశాడు.

నమాన్ ఓజా, డెనియల్ క్రిస్టెయిన్, అవేశ్ ఖాన్‌లను తప్పించి వాళ్ల స్థానంలో షాబాజ్ నదీమ్, జేసన్ రాయ్, హర్షల్ పటేల్‌ని జట్టులోకి తీసుకున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్లే ఆఫ్ రేసులో నిలవాలని గట్టి పట్టుదలతో ఉంది.

మరోవైపు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న సన్‌రైజర్స్.. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా ప్లేఆఫ్స్‌కు చేరాలని భావిస్తోంది. ఈ సీజన్‌లో వరుస విజయాలను నమోదు చేస్తోన్న సన్‌రైజర్స్ ఢిల్లీపై గెలిచి ముందుగా ప్లేఆఫ్ చేరిన జట్టుగా నిలవాలని అనుకుంటోంది. సన్‌రైజర్స్ ప్రధాన బలం బౌలింగ్ కాగా, ఢిల్లీ బలం బ్యాటింగ్ కావడంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్ | సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్

1
43452

ఇదిలా ఉంటే ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ ఇరు జట్లు 11 సార్లు ముఖాముఖి తలపడగా.. ఏడు మ్యాచ్‌ల్లో హైదరాబాద్, 4 మ్యాచ్‌ల్లో ఢిల్లీ గెలుపొందాయి. ఫిరోజ్ షా కోట్లలో మూడు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు తలపడగా.. రెండింటిలో సన్‌రైజర్స్ గెలుపొందగా.. ఒక దాంట్లో డేర్‌డెవిల్స్ విజయం సాధించింది.

జట్ల వివరాలు:
ఢిల్లీ డేర్ డెవిల్స్:

పృథ్వీ షా, జేసన్ రాయ్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రిషబ్ పంత్(కీపర్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, విజయ్ శంకర్, లైమ్ ప్లంకెట్, హర్షల్ పటేల్‌, అమిత్ మిశ్రా, షాబాజ్ నదీమ్, ట్రెంట్ బౌల్ట్.

సన్‌రైజర్స్ హైదరాబాద్:
అలెక్స్ హేల్స్, శిఖర్ ధవన్, కేన్ విలియమ్‌సన్(కెప్టెన్), మనీశ్ పాండే, యూసుఫ్ పఠాన్, షకీబ్ అల్ హసన్, శ్రీవత్స్ గోస్వామి(కీపర్), భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, సిద్ధార్త్ కౌల్, సందీప్ శర్మ.

Story first published: Thursday, May 10, 2018, 23:40 [IST]
Other articles published on May 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X