న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs SRH: ఫేవ‌రేట్‌గా చెన్నై, సన్‌రైజర్స్‌ సత్తా చాటేనా?

By Nageshwara Rao
 IPL 2018: CSK vs SRH: These three key battles can be crucial for Super Kings, Sunrisers

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్ లీగ్ దశ ముగియడంతో మరో అంకం సిద్ధమైంది. ప్లేఆఫ్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు సిద్ధమయ్యాయి. ప్లేఆఫ్‌లో భాగంగా క్వాలిఫయర్‌-1లో చెన్నై జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌‌కి ముంబైలోని వాంఖడే మైదానం ఆతిథ్యమిస్తోంది.

ఇరు జట్ల మధ్య మంగళవారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్‌ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌ బెర్తును ఖాయం చేసుకుంటుంది. దీంతో ఇరు జట్లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడంతో పాటు తమ తమ వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. లీగ్ దశలో ఈ జట్లు తలపడిన రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందిన చెన్నై ఫేవరేట్‌గా బరిలో దిగుతోంది.

బ్యాటింగ్‌లో రాయుడు, రైనా ధోనీ, వాట్సన్ మెరుస్తున్నారు. బౌలర్లు కూడా తమ వంతుగా రాణిస్తున్నారు. మరోవైపు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న సన్‌రైజర్స్ బ్యాటింగ్ భారమంతా కెప్టెన్ విలియమ్సన్, శిఖర్ ధావన్‌లపైనే ఉంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కేన్ (661 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

| సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్

ఇక, లీగ్ దశలో హైదరాబాద్ విజయాల్లో బౌలర్లు కీలక పాత్ర పోషించినప్పటికీ, చివరి మ్యాచ్‌ల్లో బౌలర్లు ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయారు. దీంతో క్వాలిఫయిర్-1లో భాగంగా జరిగే చెన్నై-హైదరాబాద్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.

చెన్నై విజయాల్లో అంబటి రాయుడు కీలకపాత్ర

చెన్నై విజయాల్లో అంబటి రాయుడు కీలకపాత్ర

లీగ్ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ అంబటి రాయుడు చెలరేగి ఆడాడు. తొలి మ్యాచ్‌లో 37 బంతుల్లోనే 79 పరుగులు చేసిన రాయుడు.. రెండో మ్యాచ్‌లో 62 బంతుల్లో 100 పరుగులు చేశాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ చెన్నై విజయం సాధించడంలో రాయుడు కీలకంగా వ్యవహారించాడు. దీంతో ఈ మ్యాచ్‌లో అంబటి రాయుడుని సాధ్యమైనంత త్వరగా పెవిలియన్ చేరిస్తే సన్‌రైజర్స్‌కి విజయావకాశాలు మెండుగా ఉంటాయి.

రెండు మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలిచిన ధోని

రెండు మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలిచిన ధోని

లీగ్ దశలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ధోని నాటౌట్‌గా నిలిచాడు. తొలి మ్యాచ్‌లో 25 పరుగులు చేయగా, రెండో మ్యాచ్‌లో 20 పరుగులతో నాటౌ‌ట్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో భువీ బౌలింగ్‌ను ధోని సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు రాబట్టాడు. భువీ బౌలింగ్‌లో 47 బంతుల్ని ఎదుర్కొన్న ధోని 87 పరుగులు నమోదు చేశాడు. అంతేకాదు ఈ సీజన్‌లో ధోని రెండు మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా పెవిలియన్‌కు చేరలేదు.

వాంఖడే స్టేడియంలో మెరుగైన రికార్డుని కలిగి ఉన్న చెన్నై

వాంఖడే స్టేడియంలో మెరుగైన రికార్డుని కలిగి ఉన్న చెన్నై

క్వాలిఫయిర్-1 మ్యాచ్ జరుగుతున్న ముంబైలోని వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ మెరుగైన రికార్డుని కలిగి ఉంది. సన్‌రైజర్స్ చివరి ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ మాత్రమే విజయం సాధించింది. చెన్నై విషయానికి వస్తే 11 మ్యాచ్‌లు ఆడి ఐదింట్లో విజయం సాధించింది. చెన్నై జట్టులోని అంబటి రాయుడు, హర్భజన్ సింగ్ గతంలో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.

చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో ధావన్ ఆడలేదు

చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో ధావన్ ఆడలేదు

లీగ్ దశలో చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో గాయం కారణంగా ధావన్ ఆడలేదు. ఆ తర్వాతి మ్యాచ్‌లో 79 పరుగులతో సత్తా చాటాడు. మొదటి మ్యాచ్‌లో 51 బంతుల్లో 84 పరుగులు చేసిన విలియమ్సన్.. యూసుఫ్ పఠాన్‌ (27 బంతుల్లో 45) కలిసి గెలిపించే ప్రయత్నం చేశాడు. కానీ 183 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో సన్‌రైజర్స్ 178 పరుగులకే పరిమితమైంది. ఇక, రెండో మ్యాచ్‌లోనూ విలియమ్సన్ 39 బంతుల్లో 51 పరుగులతో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. క్వాలిఫయిర్-1లో ఈ ఇద్దరూ రాణిస్తే సన్‌రైజర్స్‌కు తిరుగుండదు.

Story first published: Tuesday, May 22, 2018, 15:05 [IST]
Other articles published on May 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X