రాజకీయం చేయకండి: 'ఐపీఎల్‌ను చెన్నై నుంచి తరలించే ప్రసక్తే లేదు'

Posted By:
IPL 2018: CSK matches to be held in Chennai despite Cauvery protests: Rajeev Shukla

హైదరాబాద్: చెన్నైలోనే మ్యాచ్‌లు నిర్వహించి తీరతామని ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా సోమవారం స్పష్టం చేశారు. కావేరీ నది జలాల కోసం తమిళనాడు పెద్ద ఎత్తున్న నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తమకు నీళ్లే ముఖ్యమని, క్రికెట్ తమకు అవసరం లేదని చెన్నైలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లను అడ్డుకుంటామని నిరసనకారులు ప్రకటించిన నేపథ్యంలో రాజీవ్ శుక్లా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

చెన్నై సూపర్ కింగ్స్

చెన్నై మ్యాచ్‌ల్లో మార్పులు చేయలేదు

చెన్నై మ్యాచ్‌ల్లో మార్పులు చేయలేదు

సోమవారం ఓ జాతీయ మీడియాతో రాజీవ్ శుక్లా మాట్లాడుతూ 'చెన్నై మ్యాచ్‌ల్లో మార్పులు చేయలేదు. 10వ తేదీని చెన్నైలో మ్యాచ్ జరుగుతుంది. మేం అక్కడి అధికారుల పూర్తిగా భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. చెన్నై మ్యాచ్‌ల్లో మార్పులు చేయాలని ఇప్పటివరకూ అనుకోవడం లేదు. ఐపీఎల్‌ని రాజకీయాల్లోకి లాగొద్దని అందరిని కోరుతున్నా' అని అన్నారు.

 చెన్నై సూపర్‌ కింగ్స్‌ మేనేజ్‌మెంట్‌ సైతం

చెన్నై సూపర్‌ కింగ్స్‌ మేనేజ్‌మెంట్‌ సైతం

మరోవైపు చెన్నై సూపర్‌ కింగ్స్‌ మేనేజ్‌మెంట్‌ కూడా మ్యాచ్‌ల నిర్వహణపై స్పందించింది. చెన్నై మ్యాచ్‌లను మరో చోట నిర్వహించబోతున్నట్లు వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని సీఎస్‌కే ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథన్‌ సోమవారం వెల్లడించారు. 'మ్యాచ్‌ల తరలింపు విషయంలో బీసీసీఐదే తుది నిర్ణయం. కావేరీ అంశంపై ఎప్పటికప్పుడు మాకు సమాచారం అందుతోంది' అని అన్నారు.

 చెన్నై పోలీసుల దగ్గరి నుంచి అనుమతి తీసుకున్నాం

చెన్నై పోలీసుల దగ్గరి నుంచి అనుమతి తీసుకున్నాం

'చెన్నై పోలీసుల దగ్గరి నుంచి ఇప్పటికే మ్యాచ్‌ నిర్వహణల కోసం అనుమతి తీసుకున్నాం. అన్ని విషయాలను పరిగణనలోకే తీసుకునే మేం ముందుకు వెళ్తున్నాం' అని కాశీ విశ్వనాథ్‌ తెలిపారు. ఐపీఎల్ 11లో భాగంగా ముంబైతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో విజయం సాధించిన చెన్నై జట్టు మంగళవారం సొంతగడ్డపై కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.

ఐపీఎల్ నిర్వహణ సరికాదన్న రజనీకాంత్

ఐపీఎల్ నిర్వహణ సరికాదన్న రజనీకాంత్

కావేరీ మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలలంటూ గతకొన్ని రోజులుగా తమిళనాడులో ఆందోళనలను మిన్నంటుతున్నాయి. ఈ ఆందోళనలకు తమిళ సినీ ప్రముఖులు తమ మద్దతు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నిరసనల్లో పాల్గొని తమ మద్దతు తెలిపారు. ఇలాంటి సమయంలో చెన్నైలో ఐపీఎల్ నిర్వహణ సరికాదని సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్న సంగతి తెలిసిందే.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Monday, April 9, 2018, 19:10 [IST]
Other articles published on Apr 9, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి