40 మ్యాచ్‌ల తర్వాత: ఐపీఎల్‌లో టాప్ 10 బ్యాట్స్ మెన్లు వీరే

Posted By:

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్ ప్లేఆఫ్ దశకు చేరువవుతోంది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్తుని ఖరారు చేసుకోగా మిగతా జట్లు ఇంకా మ్యాచ్‌లను ఆడుతున్నాయి.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

ఐపీఎల్‌లో బుధవారం నాటికి 40 మ్యాచ్‌లు ముగిశాయి. క్యాష్ రిచ్ టోర్నీగా పేరుగాంచిన ఐపీఎల్‌లో ఆయా జట్లలోని కొందరు బ్యాట్స్‌మెన్‌ అద్భుత ప్రదర్శనలతో సత్తా చాటుతున్నారు. భారీ సిక్సర్లు, బౌండరీలతో చెలరేగారు. నిలకడగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.

టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లకు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ కోసం 20మందికి పైగా ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. ఈ సీజన్‌లో మే 2, 2017 నాటికి సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అత్యధిక పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ని అందుకున్నాడు.

గత సీజన్‌లో 848 పరుగులు చేసినా విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ నుంచి దాదాపుగా తప్పుకున్నట్లే. ఈ సీజన్‌లో కోహ్లీ విఫలమయ్యాడు. సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచుల్లో 150.46 స్ట్రైకరేట్‌తో 489 పరుగులు సాధించాడు.

కోల్ కతా నైట్ రైడర్స్‌పై సొంతగడ్డపై జరిగిన మ్యాచ్ ‌సెంచరీ (126) నమోదు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. భారీ ఇన్నింగ్స్‌లతో మైదానంలో సిక్సర్ల హోరుతో అభిమానులను అలరిస్తున్నాడు. కాగా పదో సీజన్‌లో ఇప్పటివరకు 4 సెంచరీలు నమోదయ్యాయి.

ఢిల్లీ ఆటగాడు సంజూ శాంసన్ తొలి సెంచరీని నమోదు చేయగా, ఆ తర్వాత పంజాబ్ ఆటగాడు హషీం ఆమ్లా, సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, పూణె ఆటగాడు బెన్ స్టోక్స్ ఇలా సెంచరీలతో అభిమానులను అలరించారు. ఐపీఎల్ పదో సీజన్‌లో 40 మ్యాచ్‌ల తర్వాత టాప్ 10 బ్యాట్స్‌మెన్లు వీరే.

డేవిడ్ వార్నర్

డేవిడ్ వార్నర్

ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 ఇన్నింగ్స్‌ల్లో డేవిడ్ వార్నర్ 489 పరుగులు చేశాడు. ఒక సెంచరీతో పాటు 3 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. ఇందులో మొత్తం 47 ఫోర్లు, 23 సిక్సులు ఉన్నాయి.

గౌతం గంభీర్

గౌతం గంభీర్

కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్. ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్న ఆటగాడు. 10 మ్యాచ్‌ల్లో 387 పరుగులు చేశాడు. ఐదు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు.

రాబిన్ ఊతప్ప

రాబిన్ ఊతప్ప

9 మ్యాచుల్లో 384 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు విలువైన ఇన్నింగ్స్‌లతో చెలరేగుతున్నాడు.

శిఖర్ ధావన్

శిఖర్ ధావన్

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న శిఖర్ ధావన్ ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. కెప్టెన్ వార్నర్‌తో కలిసి ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేస్తున్నాడు. చక్కటి భాగస్వామ్యాలు నెలకొల్పుతున్నాడు. 10 మ్యాచుల్లో 2 అర్ధశతకాలు సహా 369 పరుగులు చేశాడు.

స్టీవ్ స్మిత్

స్టీవ్ స్మిత్

పూణె కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ ఐదో స్థానంలో ఉన్నాడు. 9 మ్యాచుల్లో 324 పరుగులు చేశాడు.

బ్రెండన్ మెక్‌కల్లమ్

బ్రెండన్ మెక్‌కల్లమ్

న్యూజిలాండ్‌కు చెందిన బ్రెండన్ మెక్‌కల్లమ్ గుజరాత్ లయన్స్ జట్టు తరుపున ఆడుతున్నాడు. 10 మ్యాచ్‌ల్లో 319 పరుగులు చేశాడు.

సురేశ్ రైనా

సురేశ్ రైనా

గుజరాత్ లయన్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. 10 మ్యాచ్‌ల్లో 318 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ పోటీలో ఏడో స్ధానంలో ఉన్నాడు.

హషీం ఆమ్లా

హషీం ఆమ్లా

ఐపీఎల్ పదో సీజన్‌లో సెంచరీ నమోదు చేసిన బ్యాట్స్ మెన్లలో దక్షిణాఫ్రికాకు చెందిన హషీం ఆమ్లా ఒకడు. 8 మ్యాచ్‌ల్లో 315 పరుగులు చేశాడు.

సంజూ శాంసన్

సంజూ శాంసన్

ఐపీఎల్ పదో సీజన్‌లో సెంచరీ చేసిన మొట్టమొదటి బ్యాట్స్ మెన్. 9 మ్యాచ్‌ల్లో 313 పరుగులు చేశాడు.

నితీశ్ రాణా

నితీశ్ రాణా

ఐపీఎల్ పదో సీజన్‌లో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్న యువ బ్యాట్స్ మెన్ నితీశ్ రాణా. ముంబై ఇండియన్స్ తరుపున ఆడుతున్నాడు. 10 మ్యాచ్‌ల్లో 312 పరుగులు చేశాడు.

Story first published: Wednesday, May 3, 2017, 15:58 [IST]
Other articles published on May 3, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి