న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Indian T20 World Cup Squad 2021: హార్దిక్ పాండ్యా X శార్దూల్ ఠాకూర్.. చోటు దక్కేదెవరికో?

Indian T20 World Cup Squad 2021: Hardik Pandya vs Shardul Thakur Who Will Be In India Playing 11
T20 World Cup: Hardik VS Shardul, Warm Up లో టీమిండియా ప్రయోగాలు, టీమ్ కాంబినేషన్‌ | Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్ 2021 సీజన్ దిగ్విజయంగా ముగియడంతో భారత క్రికెర్లంతా టీ20 ప్రపంచకప్ ఆడేందుకు సిద్దమయ్యారు. లీగ్‌లో ఆయా ఫ్రాంఛైజీల తరపున గొప్ప ప్రదర్శనతో అదరగొట్టిన మన క్రికెటర్లు.. ఇప్పుడు జాతీయ జట్టు తరపున అదే జోరు కొనసాగించేందుకు సన్నదమవుతున్నారు.టీ20 ప్రపంచకప్‌ను పట్టేయాలనే పట్టుదలతో ఉన్న కోహ్లీసేన.. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో పోరుకు ముందు రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడుతుంది.

తొలి మ్యాచ్‌లో సోమవారం ఇంగ్లండ్‌తో తలపడనుంది. అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తున్న భారత్‌కు జట్టు కూర్పు ఒక్కటే సమస్యగా మారింది. మరి.. అందుకు పరిష్కారం కనుక్కునే దిశగా ఈ వార్మప్‌ మ్యాచ్‌లను ఉపయోగించుకోనుంది.

హార్దిక్‌కు బ్యాకప్‌గా..

హార్దిక్‌కు బ్యాకప్‌గా..

అయితే మెగా టోర్నీకి ముందు జట్టు ముందున్న ప్రధాన సమస్య హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్. మరోవైపు 2019లో వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత పూర్తి స్థాయిలో బౌలింగ్‌ చేయలేకపోతున్న హార్దిక్‌ పాండ్యా ఈ ప్రపంచకప్‌లో ఏ పాత్ర పోషిస్తాడనేదానిపై సందేహాలు నెలకొన్నాయి. అతను మళ్లీ ఆల్‌రౌండర్‌గా కనిపిస్తాడా? లేదా ఫినిషర్‌గా మారి మ్యాచ్‌లు ముగిస్తాడా? అనే విషయంపై స్పష్టత అవసరం.

అతను బ్యాటింగ్‌ ఆర్డర్లో పంత్‌ కంటే ముందు వస్తాడా లేదా ఆరో స్థానంలో దిగుతాడా? అన్నది కూడా తేలాల్సి ఉంది. ఐపీఎల్‌లో బౌలింగ్‌కు దూరంగా ఉన్న అతను బ్యాటింగ్‌లోనూ విఫలమయ్యాడు. లైనప్‌లో చాలా కీలకమైన హార్దిక్‌ను పక్కన పెట్టాల్సి వస్తే మొత్తం కూర్పు దెబ్బతినే అవకాశముంది.

వామప్ మ్యాచ్‌ల్లోనే సమాధానం..

వామప్ మ్యాచ్‌ల్లోనే సమాధానం..

అందుకే వామప్ మ్యాచ్‌ల్లోనే హార్దిక్ లేకుంటే ఎలా అనే ప్రశ్నకు బదులు వెతికి తీరాలని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తోంది. హార్దిక్‌ను కాదని శార్దూల్ ఠాకూర్‌‌ను ఆడిస్తే ఎలా ఉంటుందనేదానిపై టీమ్‌మేనేజ్‌మెంట్ సమాలోచనలు చేస్తుంది. ఈ క్రమంలోనే నేడు ఇంగ్లండ్‌తో జరిగే వామప్ మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ బరిలోకి దిగే అవకాశాలున్నాయి. పైగా ఐపీఎల్ 2021 సీజన్‌లో అతను అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 16 మ్యాచ్‌ల్లో 21 పరుగులు చేశాడు. బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన శార్దూల్‌కు ఐపీఎల్‌లో పరుగులు చేసే అవకాశం రాలేదు.

మెంటార్‌గా ధోనీ చెప్పడంతో..

మెంటార్‌గా ధోనీ చెప్పడంతో..

ముందుగా స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపికైన శార్దూల్ ఠాకూర్‌ను ఐపీఎల్ ప్రదర్శనతో ప్రధాన జట్టులోకి ప్రమోట్ చేశారు. అతని కోసం అక్షర్ పటేల్‌ను జట్టు నుంచి తప్పించి స్టాండ్‌బై ప్లేయర్ల జాబితాలో చేర్చారు. అయితే శార్దూల్ ఎంపికలో మెంటార్‌గా మహేంద్ర సింగ్ ధోనీది కీలక పాత్రని జట్టు వర్గాలు పేర్కొన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా శార్దూల్ బలాలు, బలహీనతలు అతనికి బాగా తెలుసు. హార్దిక్ లోటును తీర్చే సత్తా శార్దూల్‌కు ఉందని భావించిన ధోనీ.. అతనికి తుది జట్టులో అవకాశం కల్పించినట్లు సమాచారం.

మహీ మార్క్..

మహీ మార్క్..

ఇప్పటికే జట్టుతో కలిసిన మహేంద్ర సింగ్ ధోనీ మెంటార్‌గా తన పనిని మొదలుపెట్టాడు. ఆటగాళ్ల ప్రాక్టీస్ నుంచి అన్ని విషయాలను కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌లతో కలిసి పర్యవేక్షిస్తున్నాడు. సన్నాహక మ్యాచ్‌ల్లో టీమ్ కాంబినేషన్‌పై ఓ స్పష్టతకు రావాలని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తోంది. హార్దిక్ సమస్యతో పాటు ఓపెనర్‌గా రోహిత్ శర్మకు తోడు.. స్పిన్నర్ల విషయంలో ఓ క్లారిటీకి రావాలనుకుంటుంది. ఈ క్రమంలోనే నేడు జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా అనేక ప్రయోగాలకు తెరలేపనుంది.

Story first published: Monday, October 18, 2021, 15:37 [IST]
Other articles published on Oct 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X