న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌లో జై షా.. ఫుట్‌బాల్‌లో ప్రఫుల్ పటేల్.. క్రీడా సంఘాల్లో ఈ రాజకీయ నాయకుల పెత్తనం ఏంది?

Indian Politicians Jay Shah and Praful Patel Unnecessary Involvement In Sports

హైదరాబాద్: క్రీడా మైదానాల్లో సమవుజ్జీలైన రెండు జట్లు నువ్వా- నేనా అన్నట్టు తలపడుతూ అభిమానుల్లో ఉత్కంఠ రేపాలి. తమ ప్రతిభా పాటవాలతో స్టేడియంలోని ప్రేక్షకులను హోరెత్తించాలి. కానీ అందుకు భిన్నంగా ఈ ఆటలు నిర్వహించాల్సిన సంఘాల్లోని పెద్దలే ముఠాలు కట్టి పరస్పరం తలపడుతూ, క్రీడలను గాలికొదిలి దేశం పరువు తీస్తున్నారు. ఆలిండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్(ఏఐఎఫ్‌ఎఫ్‌)పై అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సంఘాల సమాఖ్య(ఫిఫా) నిషేధం విధించిన నేపథ్యంలో మన క్రీడా సంఘాల పనితీరు మరోసారి చర్చనీయంశమైంది. 2012లో భారత్‌ ఒలింపిక్‌ సంఘం(ఐఓఏ) కూడా ఈ మాదిరే వివాదాల్లో చిక్కుకోవడంతో అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం(ఐఓసీ) దాన్ని సస్పెండ్‌ చేయాల్సివచ్చింది.

 బీసీసీఐ రచ్చతోనే..

బీసీసీఐ రచ్చతోనే..

భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డ్‌(బీసీసీఐ) వ్యవహారాలు సైతం గతంలో ఇలాగే బజారుకెక్కడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రక్షాళనకు పూనుకుంది. అయినా మన క్రీడాసంఘాల్లో చెప్పుకోదగ్గ మార్పు రాలేదు. పర్యవసానంగా భారత ఫుట్‌ బాల్‌ సమాఖ్య దోషిగా నిలబడింది. క్రీడలతో పెద్దగా సంబంధం లేని రాజకీయ నాయకులు ఈ సంఘాల్లోకి జొరబడి వాటిని నియంత్రించడం, ఆ రంగంలో సుదీర్ఘానుభవం ఉన్నవారిని తృణీకరించడం మన దేశంలో రివాజుగా మారింది. ఇందువల్ల సంఘాల్లో నిధులు దుర్వినియోగం కావడం, నిబంధనలు గాలికొదిలి ఇష్టానుసారం వ్యవహరించడం పెరిగింది.

 పదే పదే హెచ్చరించినా..

పదే పదే హెచ్చరించినా..

దాంతో అసలైన ఔత్సాహిక క్రీడాకారులకు ప్రోత్సాహం కరువవుతోంది. మహిళా క్రీడాకారిణులకు లైంగిక వేధిం పులు ఎదురవుతున్నాయన్న ఆరోపణలు సరేసరి. అంతర్జాతీయంగా 211 దేశాలకు సభ్యత్వం ఉన్న ఫిఫా కొంతకాలంగా మన సమాఖ్య పనితీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా పట్టించుకునే నాథుడు లేకపోయాడు. ఫిఫా నిబంధనావళిని బేఖాతరు చేస్తున్నారంటూ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వస్తున్నా వినేవారే లేకుండా పోయారు. సమాఖ్యకు కొత్త కార్యవర్గం ఎన్నికై, దాని అధీనంలో రోజువారీ కార్యకలాపాలుండాలని ఫిఫా హెచ్చరిస్తూ వచ్చింది. సాధారణంగా క్రీడాసంఘాలకు అధికారంలో ఉండే పెద్దలవల్ల సమస్యలెదురవు తాయి. కానీ ఫుట్‌బాల్‌ సమాఖ్యకు విపక్ష ఎన్‌సీపీ నేత ప్రఫుల్‌ పటేల్‌ గుదిబండగా మారారు.

ప్రఫుల్ పటేల్ కారణంగానే..

ప్రఫుల్ పటేల్ కారణంగానే..

వరసగా మూడుమార్లు ఎన్నికైన ఆయన పదవీకాలం 2020లోనే ముగిసినా న్యాయస్థానాలను ఆశ్రయించి ఆ పదవి పట్టుకుని వేలాడారు. చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో ఫుట్‌బాల్‌ సమాఖ్యకు ఆయన్నుంచి విముక్తి కలిగినా కొత్త సమస్యలొచ్చి పడ్డాయి. పటేల్‌ను తప్పించినప్పుడే ఫిఫా నిబంధనావళికి అనుగుణంగా చర్యలు తీసుకోమని ఆదేశాలిస్తే వేరుగా ఉండేది. కానీ సమాఖ్య కార్యకలాపాల నిర్వహణకంటూ ఒక పరిపాలక సంఘాన్ని(సీఓఏ) ఏర్పాటుచేయడం, ఆ సంఘం వెనువెంటనే మాజీ ఫుట్‌బాల్‌ క్రీడాకారులతో ఓటర్ల జాబితా తయారుచేసి, ఎన్నికైన 36 సంఘాల ప్రతినిధులను బేఖాతరు చేయడం, ఎన్నికలకు సిద్ధం కావడం వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. సీఓఏను ఫిఫా గుర్తించడానికి నిరాకరించి, మన ఫుట్‌బాల్‌ సమాఖ్యను నిషేధించడంతో కేంద్రం కూడా రంగంలోకి దిగక తప్పలేదు.

 రాజకీయ నాయకుల జోక్యం తగ్గేవరకు..

రాజకీయ నాయకుల జోక్యం తగ్గేవరకు..

నిజానికి బీసీసీఐ కేసు తనముందుకు వచ్చినప్పుడే క్రీడాసంఘాలకు రాజకీయ నాయకులు దూరంగా ఉండాలని సుప్రీంకోర్టు హితవు చెప్పింది. కానీ ఆ తర్వాత కూడా ఏమీ మారనందువల్లే 85 ఏళ్ల మన ఫుట్‌బాల్‌ సమాఖ్య తొలిసారి వీధిన పడాల్సి వచ్చింది. ఫిఫాతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దాలని సుప్రీంకోర్టు కేంద్రానికి చేసిన సూచనవల్ల ఈ భంగపాటు నుంచి సమాఖ్య బయటపడొచ్చు. కానీ ఎన్నాళ్లిలా? క్రీడా సంఘాలు అంకితభావంతో, స్వయంప్రతిపత్తితో పనిచేయలేవా? కొరడా ఝళిపించినప్పుడు మాత్రమే దారికొస్తాయా? అనేవి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. క్రికెట్‌కు ఏమాత్రం సంబంధంలేని జై షా.. బీసీసీఐలో పెత్తనం చెలాయిస్తాడు. ఇతర సంఘాల్లో ప్రఫుల్ పటేల్ వంటి రాజకీయ నాయకులు ప్రెసిడెంట్ పదవులతో చలామణి అవుతూ గబ్బుపట్టిస్తున్నారు. రాజకీయ నాయకుల జోక్యం తగ్గేవరకు దేశానికి ఇలాంటి అవమానాలు తప్పేటట్టు లేదు.

Story first published: Saturday, August 20, 2022, 16:15 [IST]
Other articles published on Aug 20, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X