న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Asia Cup 2022: టీమ్ పెర్ఫామెన్స్‌పై బీసీసీఐ రివ్యూ.. ద్రవిడ్‌ను మందలించిన గంగూలీ, జైషా!

Indian Coach Rahul Dravid Gets Warned From Ganguly And Jay Shah For Slow Batting Performance in Asia Cup 2022

న్యూఢిల్లీ: ఆసియాకప్ 2022లో దారుణంగా విఫలమైన టీమిండియా పెర్ఫామెన్స్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సమీక్ష చేసినట్లు తెలుస్తోంది. ఆసియా కప్ వైఫల్యంపై బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది. మిడిల్ ఓవర్లలో స్లో బ్యాటింగే భారత జట్టును దెబ్బతీసిందని తమ సమీక్షలో గుర్తించారని, కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను కూడా మందలించారని తెలిపింది. టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సమస్యను తక్షణమే పరిష్కారించాలని బోర్డు పెద్దలు టీమ్‌మేనేజ్‌మెంట్‌కు సూచించారని ఓ బీసీసీఐ అధికారి తమకు వెల్లడించాడని పేర్కొంది.

స్లో బ్యాటింగ్‌పై బోర్డు అసహనం..

స్లో బ్యాటింగ్‌పై బోర్డు అసహనం..

ఎన్నో అంచనాలతో హాట్ ఫేవరేట్‌గా ఆసియాకప్ 2022 బరిలోకి దిగిన టీమిండియా అనూహ్యంగా కనీసం ఫైనల్ చేరకుండానే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. లీగ్ దశలో రెండింటికి రెండు మ్యాచ్‌లు గెలిచిన రోహిత్ సేన.. కీలక సూపర్ 4లో వరుసగా రెండు మ్యాచ్‌లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అఫ్గానిస్థాన్‌పై భారీ విజయాన్నందుకున్నా ఫలితం లేకుండా పోయింది. ప్రపంచకప్ ముందు ఈ పరాజయం టీమిండియా లోపాలను ఎత్తి చూపింది. ఈ క్రమంలోనే ఈ ఓటమిని సీరియస్‌గా తీసుకున్న బీసీసీఐ పెద్దలు.. సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్‌తో కలిపి సమీక్ష చేశారు. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ అధికారి పీటీఐకి తెలిపారు.

 తక్షణమే పరిష్కరించాలని..

తక్షణమే పరిష్కరించాలని..

'అవును.. ఆసియా కప్ వైఫల్యంపై బోర్డు సమీక్ష చేసింది. అయితే సమస్యల కంటే దాని పరిష్కారాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. టీ20 ప్రపంచకప్‌లో మరింత మెరుగ్గా రాణించడానికి కావాల్సిన విషయాలనే చర్చించింది. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో స్లో బ్యాటింగ్ జట్టును దెబ్బ తీసిందని గుర్తించింది. 7-15 ఓవర్ల మధ్య స్పిన్నర్లను ఎదుర్కొవడంలో మన బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారని, వరల్డ్ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని బోర్డు అభిప్రాయపడింది.

శ్రీలంకపై 78 రన్స్..

శ్రీలంకపై 78 రన్స్..

ఆసియాకప్ 2022 టోర్నీలో భారత్ మిడిల్ ఓవర్లలో నెమ్మదిగా ఆడింది. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో(7-15) మిడిల్ ఓవర్లలో 59 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. హాంగ్‌కాంగ్‌పై 62 పరుగులు చేసిన రోహిత్ సేన.. సూపర్ 4లో పాక్‌తో వికెట్ నష్టానికి 62 రన్స్ చేసింది. శ్రీలంకతో 78 పరుగులు చేసింది. మిడిల్ ఓవర్లలో ఇదే అత్యుత్తమ ప్రదర్శన. అయితే విరాట్ కోహ్లీ క్రీజులో ఉండటంతో ఈ పరుగులు వచ్చాయి. అయితే మిడిలార్డర్‌లో పంత్, హార్దిక్ వైఫల్యం జట్టు కొంపముంచింది.

Story first published: Wednesday, September 14, 2022, 17:37 [IST]
Other articles published on Sep 14, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X