న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దులీప్ ట్రోఫీలో పలు మార్పులు చేసిన బీసీసీఐ

BCCI Changes: Duleep Trophy back to red ball and no broadcast till final Match

న్యూఢిల్లీ: దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో బీసీసీఐ మార్పులు చేసింది. గత మూడు సీజన్లుగా గులాబీ బంతితో డే అండ్ నైట్ ఫార్మాట్‌లో దులీప్ ట్రోఫీ జరిగింది. ఈసారి మాత్రం అన్ని మ్యాచ్‌లు ఎరుపు బంతితో, పగటి పూటే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఒక్క ఫైనల్ మ్యాచ్ మాత్రమే డే అండ్ నైట్‌గా జరగనుంది. ఆగష్టు 17 నుంచి సెప్టెంబర్ 9 వరకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు జరుగనున్నాయి.

ఎందరు దరఖాస్తు చేసుకున్నా స్వదేశీ కోచ్‌కే ప్రాధాన్యం.. రవిశాస్త్రి కొనసాగింపు?

ఈ సీజన్‌లో మూడు జట్లు తలపడుతున్నాయి. శుభ్‌మన్ గిల్ ఇండియా-బ్లూ జట్టుకు, ప్రియాంక్ పంచల్ ఇండియా-రెడ్‌ జట్టుకు, ఫయాజ్ ఫజల్ ఇండియా-గ్రీన్ జట్టుకు కెప్టెన్‌లుగా వ్యవహరించనున్నారు. సెప్టెంబర్ 5 నుండి 9 వరకు జరిగే ఫైనల్ మ్యాచ్ మాత్రం స్టార్‌ స్పోర్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇండియా-గ్రీన్ జట్టుకు హైదరాబాదీ బ్యాట్స్‌మన్ అక్షత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

<strong>ఇక నోబాల్‌ నిర్ణయం థర్డ్ అంపైర్‌దే!!?<br><br></strong>ఇక నోబాల్‌ నిర్ణయం థర్డ్ అంపైర్‌దే!!?

'ఫైనల్ మ్యాచ్ మాత్రమే డై అండ్ నైట్‌గా నిర్వహిస్తున్నాం. ఈ మ్యాచ్ ఒక్కటే ప్రత్యక్ష ప్రసారమవుతుంది. భవిష్యత్తులో గులాబీ బంతితో టీమిండియా ఆడే అవకాశాలు లేవు. టెస్టు చాంపియన్‌షిప్‌లోనూ డే అండ్ నైట్ మ్యాచ్‌లు లేవు. అందుకే ఎరుపు బంతితో టోర్నీ నిర్వహిస్తున్నాన్నాం. ఎరుపు బంతితో అయితేనే జాతీయ జట్టుకు ఎంపికయ్యే ఆటగాళ్లు సరైన విధంగా సిద్ధమవుతారని భావిస్తున్నా. భారత్-ఏ సహా రంజీల్లో మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లను దులీప్ ట్రోఫీకి ఎంపిక చేసాం' అని బీసీసీఐ క్రికెట్ వ్యవహారాల జీఎం సాబా కరీమ్ తెలిపారు.

Story first published: Wednesday, August 7, 2019, 11:06 [IST]
Other articles published on Aug 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X