న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరోసారి విరుద్ధ ప్రయోజనాల సెగ.. ద్రవిడ్‌కు అంబుడ్స్‌మన్‌ నోటీసులు

Rahul Dravid gets Conflict of Interest notice from BCCI Ethics Officer DK Jain

న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్, జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు మరోసారి పరస్పర విరుద్ధ ప్రయోజనాల సెగ తగిలింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల విషయమై ద్రవిడ్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) నోటీసులు జారీ చేసింది. బోర్డు అంబుడ్స్‌మన్‌ ఎథిక్స్‌ ఆఫీసర్‌ రిటైర్డ్‌ జస్టిస్‌ డి.కె.జైన్‌ మంగళవారం నోటీసులు జారీ చేశారు.

<strong>చివరి టీ20లో భారత్‌ ఘన విజయం.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌</strong>చివరి టీ20లో భారత్‌ ఘన విజయం.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

సంజీవ్‌ గుప్తా ఫిర్యాదు:

సంజీవ్‌ గుప్తా ఫిర్యాదు:

రాహుల్‌ ద్రవిడ్‌ ప్రస్తుతం ఎన్‌సీఏ (బెంగళూరు) డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. అలాగే బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్‌.శ్రీనివాసన్‌కు చెందిన ఇండియా సిమెంట్స్‌ గ్రూప్‌కు వైస్‌ ఛైర్మన్‌గా కూడా ఉన్నాడు. ఇండియా సిమెంట్స్‌ గ్రూప్‌కు వైస్‌ ఛైర్మన్‌గా ఉండడంతో ద్రవిడ్‌ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నారని మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం (ఎంపీసీఏ) సభ్యుడు సంజీవ్‌ గుప్తా బీసీసీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేశారు.

ద్రవిడ్‌కు నోటీసులు:

ద్రవిడ్‌కు నోటీసులు:

ఫిర్యాదు స్వీకరించిన బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌.. ద్రవిడ్‌కు నోటీసులు ఇచ్చాడు. రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని కూడా ఆదేశించాడు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం కారణంగానే ఐపీఎల్‌ మెంటార్‌ పదవి వదులుకుని భారత జూనియర్‌ కోచ్‌ పదవి చేపట్టాడు ద్రవిడ్‌. మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. మరి ద్రవిడ్‌ ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి.

భారత్‌తో జరిగిన ఆ మ్యాచే నా కెరీర్‌లో ఓ చేదు జ్ఞాపకం

సచిన్, లక్ష్మణ్‌లపై కూడా:

సచిన్, లక్ష్మణ్‌లపై కూడా:

ఇంతకుముందు క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) సభ్యులైన భారత దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, వీవీఎస్‌ లక్ష్మణ్‌లపై కూడా పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నారని సంజీవ్‌ గుప్తా ఫిర్యాదు చేశారు. చాలా రోజులు చర్చలు, అంబుడ్స్‌మన్‌ ముందు హాజరయిన అనంతరం ఇద్దరు సీఏసీ నుంచి వైదొలిగారు. అనంతరం కపిల్‌దేవ్, శాంత రంగస్వామి, అన్షుమన్‌ గైక్వాడ్‌లు ఆ పదవిలోకి వచ్చారు. ఇప్పుడు ఈ ముగ్గురే టీమిండియా హెడ్ కోచ్‌ను సెలెక్ట్ చేయనున్నారు.

Story first published: Wednesday, August 7, 2019, 9:07 [IST]
Other articles published on Aug 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X