ఎందరు దరఖాస్తు చేసుకున్నా స్వదేశీ కోచ్‌కే ప్రాధాన్యం.. రవిశాస్త్రి కొనసాగింపు?

న్యూఢిల్లీ: ఎందరు దరఖాస్తు చేసుకున్నా స్వదేశీ కోచ్‌కే మొదటి ప్రాధాన్యం. టీమిండియా హెడ్ కొచ్‌గా రవిశాస్త్రి కాంట్రాక్టు పునరుద్ధరిస్తేనే బాగుంటుందని క్రికెట్ సలహా సంఘం (సీఏసీ) సభ్యులు ఒకరు పేర్కొన్నారు. దీంతో దాదాపుగా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి కొనసాగడంపై అనిశ్చితి తొలగినట్లే అని అందరూ భావిస్తున్నారు. ఇక హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి పేరును ప్రకటించడమే మిగిలింది.

అలా ఆలోచించడం సరికాదు:
సీవోఏ చీఫ్ వినోద్ రాయ్ ఇప్పటికే హెడ్ కోచ్ ఎంపిక విషయంలో పూర్తి క్లారిటీ ఇచ్చారు. సీఏసీ తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని ఆయన తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో సీఏసీ కమిటీ సభ్యుడే రవిశాస్త్రిపై మొగ్గుచూపడంతో అతని నియామకంలాంఛనమే కానుంది. సీఏసీ సభ్యులు ఒకరు మీడియాతో మాట్లాడుతూ... 'ప్రస్తుతం హెడ్ కొచ్ రవిశాస్త్రి కోచింగ్‌లో టీమిండియా మెరుగ్గా రాణిస్తోంది. అలాంటప్పుడు వేరే వారి గురించి ఆలోచించడం సరికాదు' అని అన్నారట.

స్వదేశీ కోచ్‌కే ప్రాధాన్యం:
'విదేశీ కోచ్‌పై పెద్దగా ఆసక్తి లేదు. విదేశీ కోచ్‌ను తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. గ్యారీ కిర్‌స్టెన్ లాంటి స్థాయి ఉన్న వాళ్లు దరఖాస్తు చేసుకుని ఉంటే.. మేం ఆలోచించేవాళ్లం. అయినా అప్పుడు కూడా మా ప్రథమ ప్రాధాన్యం స్వదేశీ కోచ్‌కే. రవిశాస్త్రి కోచింగ్‌లో టీమిండియా నిలకడగా రాణిస్తున్న నేపథ్యంలో మార్పు అవసరం లేదు. కాంట్రాక్టును తిరిగి శాస్త్రికి పునరుద్ధరిస్తే బాగుంటుంది' అని ఆ సీఏసీ సభ్యుడు పేర్కొన్నదని సమాచారం.

కపిల్ కమిటీదే తుది నిర్ణయం:
టీమిండియా కొత్త కోచ్‌ను నియమించే అధికారం సీఏసీకి ఉందా అని అడిగిన ప్రశ్నకు వినోద్ రాయ్ మాట్లాడుతూ... 'అందరి డిక్లరేషన్ పత్రాలను పరిశీలించాం. అంతా బాగానే ఉంది. టీమిండియా కోచ్ ఎంపికలో కపిల్ కమిటీదే తుది నిర్ణయం. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఆగస్టు మూడో వారంలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఆ తరువాత కోచ్ నియామకం జరుగుతుంది' అని వినోద్ రాయ్ తెలిపారు.
ఇక నోబాల్ నిర్ణయం థర్డ్ అంపైర్‌దే!!?

బౌలింగ్ కోచ్ రేసులో జోషి:
మాజీ స్పిన్నర్ సునీల్ జోషి టీమిండియా బౌలింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో జోషి మాట్లాడుతూ... 'బౌలింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేశాను. బంగ్లాదేశ్ జట్టుతో అద్భుతమైన రెండున్నర ఏళ్ల కోచింగ్ అనుభవం ఉంది. దీంతో నా తదుపరి ఛాలెంజ్‌కు సిద్ధంగా ఉన్నాను. టీమిండియాకు సరైన స్పెషలిస్ట్ స్పిన్ కోచ్ అంటూ ఎవరూ లేరు. నా అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటారని భావిస్తున్నా' అని అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications