న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండో వన్డేలో సెంచరీ.. సచిన్ తర్వాత ఆ రికార్డు కోహ్లీదే

India vs West Indies: Virat Kohli equals another Sachin Tendulkar record

ట్రినిడాడ్‌: టీమిండియా కెప్టెన్‌, పరుగుల మెషీన్‌ విరాట్‌ కోహ్లీ 11 ఇన్నింగ్స్‌లలో ఒక్క సెంచరీ చేయలేదు. ఎట్టకేలకు విండీస్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో కెరీర్‌లో 42వ సెంచరీ (120; 125 బంతుల్లో 14×4, 1×6) అందుకుని ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ క్రమంలోనే భారత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కి చెందిన ఓ అరుదైన రికార్డును కోహ్లీ సమం చేశాడు.

<strong>'వచ్చే ప్రపంచకప్‌ కోసం ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నా'</strong>'వచ్చే ప్రపంచకప్‌ కోసం ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నా'

సచిన్ తర్వాత కోహ్లీ:

సచిన్ తర్వాత కోహ్లీ:

విండీస్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అద్భుతంగా ఆడాడు. ఓపెనర్లు తక్కువ పరుగులకే పెవిలియన్ చేరినా.. తన అనుభవాన్ని ఉపయోగించి యువ ఆటగాళ్లతో కలిసి పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలో కోహ్లీ సెంచరీ చేయడంతో.. విండీస్‌పై 34 ఇన్నింగ్స్‌ల్లోనే 2024 పరుగులు పూర్తి చేశాడు. దీంతో వన్డేల్లో రెండు జట్లపై రెండు వేలకు పైగా పరుగులు సాధించిన భారత రెండో క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు కోహ్లీ శ్రీలంకపై 46 ఇన్నింగ్స్‌ల్లో 2220 పరుగులు చేశాడు.

నాలుగు జట్లపై రెండు వేలకు పైగా పరుగులు:

నాలుగు జట్లపై రెండు వేలకు పైగా పరుగులు:

విరాట్ కోహ్లీ కన్నా ముందు సచిన్‌ ఉన్నాడు. సచిన్ శ్రీలంక (3113), ఆస్ట్రేలియా (3077), పాకిస్థాన్‌ (2526), దక్షిణాఫ్రికా (2001) జట్లపై రెండు వేలకు పైగా పరుగులు చేసాడు. సచిన్‌ నాలుగు జట్లపై రెండు వేలకు పైగా పరుగులు చేయగా.. కోహ్లీ రెండు జట్లపై చేసాడు. సచిన్, కోహ్లీల తర్వాత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ లంకపై 53 ఇన్నింగ్స్‌లో 2383 పరుగులు చేయగా.. ఓపెనర్ రోహిత్‌ శర్మ ఆస్ట్రేలియా జట్టుపైన 37 ఇన్నింగ్స్‌ల్లో 2037 పరుగులు చేశాడు.

విండీస్‌పై 8వ సెంచరీ:

విండీస్‌పై 8వ సెంచరీ:

వన్డేల్లో కోహ్లీకి ఇది 42వ సెంచరీ. మొత్తంగా విండిస్ జట్టుపై కోహ్లీకి ఇది 8వ సెంచరీ. అంతకముందు ఆస్ట్రేలియా, శ్రీలంకపై కూడా కోహ్లీ ఎనిమిదేసి సెంచరీలు చేశాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు జట్లపై 8 సెంచరీలు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఒకే ప్రత్యర్థిపై సచిన్ టెండూల్కర్ (9, ఆస్ట్రేలియాపై) తర్వాత ఎక్కువ సెంచరీలు చేసిన రెండవ బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ నిలిచాడు.

కోహ్లీ సంబరాలు చూస్తే.. ఈ సెంచరీ ఎంత అవసరమో అర్థమవుతుంది

గంగూలీని వెనక్కి నెట్టి:

గంగూలీని వెనక్కి నెట్టి:

వన్డేల్లో 42 శతకాలు బాదిన కోహ్లీ.. ఇంకో 8 సాధిస్తే ఈ ఫార్మాట్‌లో సచిన్‌ (49)ని అధిగమించి ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం కోహ్లీ ఆటతీరును చూస్తే భవిష్యత్‌లో సచిన్ రికార్డును కచ్చితంగా అధిగమించే అవకాశం ఉంది. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాట్స్‌మెన్‌లో కోహ్లీ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీ (11,363)ని వెనక్కి నెట్టి ద్వితీయ స్థానానికి చేరాడు. సచిన్‌ 18,426 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు.

Story first published: Monday, August 12, 2019, 16:20 [IST]
Other articles published on Aug 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X