న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ 2018 ట్రాక్ రికార్డు ఇదే.. అన్నింటిలోనూ విరాటే బెస్ట్!!

India Vs West Indies 2018, 2nd ODI : Virat Kohli's Track Record In 2018
India vs West Indies: Virat Kohli in 2018 - Numbers show Indian skipper’s superhuman side

న్యూ ఢిల్లీ: టీమిండియా కెప్టెన్ దినదినాభివృద్ధి చెందుతోన్న విషయం అతను నమోదు చేసిన గణాంకాలే చెబుతున్నాయి. వన్డే ఫార్మాట్‌లో కోహ్లీ తొలి 1000 పరుగులు చేసేందుకు 24 ఇన్నింగ్‌ల సమయం తీసుకున్నాడు. అదే 9వేల నుంచి 10వేల పరుగుల మైలురాయిని చేరుకోవడానికి మాత్రం కేవలం 11 ఇన్నింగ్స్‌లలో మాత్రమే ముగించాడు.

2018లో వన్డేల్లో అత్యధిక పరుగులతో:

2018లో వన్డేల్లో అత్యధిక పరుగులతో:

జనవరిలో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి విశాఖ వన్డే వరకూ కోహ్లీ ఆడింది కేవలం 11వన్డే మ్యాచ్‌లే. అయినా.. ఇప్పటికే వెయ్యి పరుగులు పూర్తి చేసుకొని ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2017లో మొత్తం 26వన్డేలాడిన ఈ కుడి చేతి వాటం బ్యాట్స్‌మెన్‌... మొత్తం 1460పరుగులు చేయగా, ఈ ఏడాదిలో ఇప్పటికే 11వన్డేల్లో తన బ్యాట్ ద్వారా 1046 పరుగులు రాబట్టాడు. ఇందులో 5 సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలున్నాయి.

ఆఖరి బంతి వరకూ ఉత్కంఠ.. ధోనీ పథకం పారలేదు!!

కోహ్లీ తర్వాతి రెండు స్థానాల్లో:

కోహ్లీ తర్వాతి రెండు స్థానాల్లో:

కోహ్లీ తర్వాత ఈ ఏడాది వన్డేల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఆటగాడిగా ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ బెయిర్‌స్టో(22మ్యాచ్‌ల్లో 1025పరుగులు) ఉన్నాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ మరో బ్యాట్స్‌మెన్‌ జో రూట్‌(24మ్యాచ్‌ల్లో 946పరుగులతో) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

వెయ్యి పరుగులు సాధించడంలోనూ నెం.1

వెయ్యి పరుగులు సాధించడంలోనూ నెం.1

ఇప్పటివరకు కోహ్లీ వన్డేల్లో ఇప్పటికే వెయ్యి పరుగులు ఐదు సార్లు 2011లో.. 12,13,14,17లలో సాధించాడు. కానీ, ఈ ఏడాది(2018) మాత్రం అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే(11) అత్యంత వేగవంతంగా వెయ్యి పరుగులు పూర్తి చేసి మరో నూతన రికార్డుకు శ్రీకారం చుట్టాడు. ఇప్పటివరకూ ఒక ఏడాదిలో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో వెయ్యి పరుగులు పూర్తి చేసిన రికార్డు దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్‌ ఆమ్లా(15ఇన్నింగ్‌లలో) ఉంది.

సెంచరీలలోనూ కోహ్లీనే..

సెంచరీలలోనూ కోహ్లీనే..

2018లో ఇప్పటివరకూ అత్యధిక సెంచరీలు బాదిన బ్యాట్స్‌మెన్‌ కూడా విరాట్‌ కోహ్లీనే.. ఆడిన 11మ్యాచ్‌లలో 5 సెంచరీలున్నాయి. రెండో స్థానంలో ఉన్న బెయిర్‌స్టో ఇప్పటివరకూ 22మ్యాచ్‌లలో నాలుగు సెంచరీలు నమోదు చేయగా... అతని తర్వాత మూడో స్థానంలో మన భారత బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ(16మ్యాచ్‌లలో 4సెంచరీలతో) ఉన్నాడు.

సగటు విషయంలోనూ ఏ ఏడాదిలోనైనా:

సగటు విషయంలోనూ ఏ ఏడాదిలోనైనా:

వన్డేల్లో ఒక ఏడాదిలో బ్యాటింగ్‌ సగటులోనూ ఇప్పటి వరకూ కోహ్లీదే అత్యుత్తమం. ఈ ఏడాదిలో 11మ్యాచ్‌లలో కోహ్లీ బ్యాటింగ్‌ సగటు 146.57కాగా, ఇప్పటివరకూ ఆ రికార్డు ఐపీఎల్‌లో తన సహచర బ్యాట్స్‌మెన్‌, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. డివిలియర్స్‌ 2015లో మొత్తం 20మ్యాచ్‌లలో 1193పరుగులు సాధించి 79.53సగటుతో ఉన్నాడు. మూడో స్థానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్‌(2007లో 27మ్యాచ్‌లలో 1424పరుగులు సాధించి 79.11 సగటుతో ఉన్నాడు).

Story first published: Friday, October 26, 2018, 11:54 [IST]
Other articles published on Oct 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X