న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆఖరి బంతి వరకూ ఉత్కంఠ.. ధోనీ పథకం పారలేదు!!

India vs Westindies 2018 2nd Odi : Dhoni Couldnt Plan Well in Vizag 2 nd Odi
MS Dhoni’s plan kept Shai Hope hopeful till the last delivery

హైదరాబాద్: విశాఖపట్నం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియా కొద్దిపాటిలో ఓటమిని తప్పించుకుంది. ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ విజయం కోసం పోరాడిన వెస్టిండీస్ అనూహ్యంగా టైగా ముగిసింది. దీనికి కారణం టీమిండియా పథకాన్ని ముందుగానే పసిగట్టడమే. కెప్టెన్‌గా ఉన్నా లేకున్నా ధోని బుర్రే బుర్ర. అతడి వ్యూహాలతో, సలహాలతో మ్యాచ్‌లు భారత్‌ వైపు తిరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

వ్యూహాన్ని పసిగట్టిన షై హోప్‌

వ్యూహాన్ని పసిగట్టిన షై హోప్‌

ఐతే ఇదే క్రమంలో బుధవారం వెస్టిండీస్‌తో రెండో వన్డేలో మహేంద్ర సింగ్ ధోనీ ఊహించిన పథకం పారలేదు. పైగా అతడి వ్యూహం ప్రత్యర్థికే లాభించింది. వ్యూహాన్ని పసిగట్టిన విండీస్‌ బ్యాట్స్‌మన్‌ షై హోప్‌ ఆఖరి బంతికి బౌండరీతో తన జట్టును ఓటమి నుంచి రక్షించాడు. గెలవాలంటే చివరి ఓవర్లో వెస్టిండీస్‌ 14 పరుగులు చేయాలి. కోహ్లి.. బంతిని ఉమేశ్‌కు ఇచ్చాడు.

ఓవర్‌ను ఆరంభించగా.. హోప్‌ సింగిల్‌ మాత్రమే

ఓవర్‌ను ఆరంభించగా.. హోప్‌ సింగిల్‌ మాత్రమే

ఉమేశ్.. యార్కర్‌తో ఓవర్‌ను ఆరంభించగా.. హోప్‌ సింగిల్‌ మాత్రమే తీయగలిగాడు. హోప్‌ సెంచరీ పూర్తి చేసినా.. అప్పటికి దాదాపుగా మూడు ఓవర్ల నుంచి బౌండరీ కొట్టలేదు. భారత బౌలర్లు పదే పదే స్ట్రెయిట్‌గా ఫుల్‌ డెలివరీలు వేయడమే అందుకు కారణం. నర్స్‌కు కూడా ఉమేశ్‌ ఇదే వ్యూహానికి కట్టుబడి బౌలింగ్‌ చేశాడు. ఓ బంతికి ఫోర్‌ లెగ్‌బైస్‌ రాగా.. లెగ్‌స్టంప్‌ యార్కర్‌ను ఆడి నర్స్‌ రెండు పరుగులు రాబట్టాడు. తర్వాత ఫుల్‌టాస్‌ను స్కూప్‌ చేసి థర్డ్‌మాన్‌లో ఫీల్డర్‌కు దొరికిపోయాడు.

ఓవర్లో 6 సార్లు డైవ్ చేయమన్నా.. సిద్ధమే: కోహ్లీ

బ్యాట్స్‌మన్‌కు అందకుండా ఫుల్‌ డెలివరీని

బ్యాట్స్‌మన్‌కు అందకుండా ఫుల్‌ డెలివరీని

చివరి 2 బంతులకు 7 పరుగులు అవసరం కాగా.. స్టంప్స్‌ పైకి వేసిన మరో ఫుల్‌టాస్‌ను హోప్‌ సరిగా ఆడలేకపోయాడు. బంతిని డీప్‌మిడ్‌వికెట్లోకి పంపి 2 పరుగులు తీశాడు. ఆఖరి బంతికి విండీస్‌కు 5 పరుగులు అవసరమయ్యాయి. ఐతే భారత్‌ వ్యూహం మార్చింది. బ్యాట్స్‌మన్‌కు అందకుండా దూరంగా ఫుల్‌ డెలివరీని వేయాలన్నది ఆలోచన. అందుకు తగినట్లే ఫీల్డర్లను పెట్టింది.

అనుకున్న ప్రకారమే బౌలింగ్‌ చేశా కానీ..

అనుకున్న ప్రకారమే బౌలింగ్‌ చేశా కానీ..

ఉమేశ్‌ అనుకున్న ప్రకారమే బౌలింగ్‌ చేశాడు. కానీ హోప్ ఇంకొంచెం తెలివిగా వ్యవహరించాడు. చివరి బంతిని ఫోర్‌గా మలిచి టై చేశాడు. ఆఖరి బంతిని అలా వేయాలన్న ఆలోచన ధోనీది అంటూ మ్యాచ్‌ అనంతరం కుల్దీప్‌ చెప్పాడు. ఫీల్డర్లను మార్చడంతోనే ఉమేశ్‌ ఎలాంటి బంతి వేయబోతున్నాడో తనకు ముందే అర్థమైందంటూ వెల్లడించాడు.

Story first published: Friday, October 26, 2018, 11:08 [IST]
Other articles published on Oct 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X