న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కేరళ అభిమానుల ఆందోళన.. రెండో టీ20లో శాంసన్‌కు చోటివ్వరా!!

India vs West Indies: Locals Hope to See Sanju Samson in Action in Second T20I


తిరువనంతపురం: ఆదివారం భారత్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే దేశవాళీ టోర్నీలో యువ బ్యాట్స్‌మన్‌ సంజు శాంసన్‌ రాణించినా టీమిండియా జట్టులో మాత్రం చోటు దక్కట్లేదు. 2015లో జింబాబ్వేతో అరంగేట్రం చేసిన శాంసన్‌కు రెండో అవకాశం రాలేదు. జట్టులో చోటు కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాడు. బంగ్లాదేశ్‌ సిరీస్‌కు ఎంపిక అయినా.. మూడు టీ20ల్లో తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు.

నేడు రెండో టీ20: సిరీస్‌పై భారత్ కన్ను.. కసితో కరీబియన్లు!!నేడు రెండో టీ20: సిరీస్‌పై భారత్ కన్ను.. కసితో కరీబియన్లు!!

మూడో కేరళ ఆటగాడు:

మూడో కేరళ ఆటగాడు:

ఇక విండీస్‌ సిరీస్‌కు మొదటగా అవకాశం రాలేదు. అయితే ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ గాయపడటంతో శాంసన్‌కు భారత సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టీ20లో చోటు దక్కలేదు. ఇక రెండో మ్యాచ్‌ జరుగుతున్న తిరువనంతపురం శాంసన్‌ సొంత మైదానం. అందుకే ఈ మ్యాచులో సంజుకి అవకాశం ఇవ్వాలి ఆందోళనలు చేస్తున్నారు. టిను యోహానన్‌, శ్రీశాంత్‌ తర్వాత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మూడో కేరళ ఆటగాడు సంజు శాంసన్‌.

 శాంసన్‌కు చోటివ్వరా:

శాంసన్‌కు చోటివ్వరా:

'తొలి మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్ బాగా ఆడాడు. అయినా మా యువ ఆటగాడు శాంసన్‌ రెండో టీ20 మ్యాచులో ఆడతాడన్న నమ్మకం ఉంది.

ఎందుకంటే అతడు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేయగలడు. వర్షసూచన ఉండటంతో 20 ఓవర్ల మ్యాచ్‌ జరుగుతుందా లేదా అనే సందేహముంది ' అని కొందరు స్థానిక యువకులు అంటున్నారు. పరోక్షంగా రిషబ్ పంత్ స్థానంలో చోటు ఇవ్వాలని వారు అంటున్నారు.

అరగంటలో సిద్ధం:

అరగంటలో సిద్ధం:

వర్షం పడినా స్టేడియంలో నీరు నిలవదని, అంతగా ఇబ్బందేమీ ఉండదని పిచ్‌ క్యూరేటర్‌ బిజు అంటున్నారు. 'పిచ్‌, మైదానం కింద 3500 పైపులు ఉన్నాయి. మైదానంలోని నీరు బయటకు వెళ్లిపోతుంది. మ్యాచ్‌ ఆడుతున్నప్పుడు వర్షం పడినా.. 30 నిమిషాల్లో మైదానాన్ని సిద్ధం చేయగలం' అని బిజు తెలిపారు.

8 పరుగులకే ఆలౌట్.. 9 మంది డకౌట్!!

సిరీస్‌పై కన్ను:

సిరీస్‌పై కన్ను:

2017లో గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఏకైక టీ20లో న్యూజిలాండ్‌తో భారత్‌ తలపడింది. ఎడతెరపి లేని వర్షం కురిసినా సిబ్బంది మైదానాన్ని అరగంటలో సిద్ధం చేశారు. 8 ఓవర్లు జరిగిన ఆ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. తొలి టీ20లో తమ టీ20 చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన టీమిండియా.. సిరీస్‌పై కన్నేసింది. మరోవైపు భారత్ జోరుకు అడ్డుకట్ట వేసి సిరీస్‌లో నిలవాలని చూస్తోంది.

Story first published: Sunday, December 8, 2019, 12:53 [IST]
Other articles published on Dec 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X