న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

8 పరుగులకే ఆలౌట్.. 9 మంది డకౌట్!!

Maldives women cricket team dismissed for 8 runs, 9 players out for zero


ఖాట్మండు: మాల్దీవుల మహిళా క్రికెట్ జట్టు మరోసారి చెత్త ప్రదర్శనను నమోదు చేసింది. 13వ దక్షిణాసియా క్రీడల్లో భాగంగా నేపాల్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో మాల్దీవులు కేవలం ఎనిమిది పరుగులకే ఆలౌటైంది. మహిళల అంతర్జాతీయ టీ20ల్లో ఇది రెండో అత్యల్ప స్కోరు. గత జూన్ నెలలో రువాండాపై ఆరు పరుగులు మాత్రమే చేసిన మాలి అత్యల్ప స్కోరును నమోదు చేసింది.
ఒక పరుగులు.. ఏడు ఎక్స్‌ట్రాలు:

ఒక పరుగులు.. ఏడు ఎక్స్‌ట్రాలు:

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మాల్దీవుల జట్టు 11.3 ఓవర్లు ఆడి ఎనిమిది పరుగులు చేసింది. అందులో ఏడు ఎక్స్‌ట్రాల ద్వారానే రావడం విశేషం. ఓపెనర్ ఐమా ఐషత్ మాత్రమే ఒక్క పరుగు చేయగలిగింది. మాల్దీవుల కెప్టెన్ జూనా మరియమ్ 16 బంతులు ఆడినా.. ఖాతా తెరువలేకపోయింది. నేపాల్ బౌలర్లలో అంజలి చంద్ ఓ పరుగిచ్చి నాలుగు వికెట్లు తీసింది.

గతంలో 6 పరుగులకే:

గతంలో 6 పరుగులకే:

అనంతరం నేపాల్ కేవలం ఏడు బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. నేపాల్ ఓపెనర్లు కాజల్ శ్రేష్ట, రోమా థాపాలు విజయాన్ని అందించారు. మహిళల టీ20 క్రికెట్‌లో మాలి జట్టు అత్యంత స్వల్ప స్కోరుతో చెత్త రికార్డును మూటగట్టుకుంది. క్విబుకా మహిళల టోర్నీలో రువాండాతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన మాలి జట్టు 9 ఓవర్లలో 6 పరుగులకే కుప్పకూలింది.

చైనా రికార్డు బద్దలు:

చైనా రికార్డు బద్దలు:

మాలి ఓపెనర్‌ మరిమ సమకే ఒక్క పరుగు చేయగా.. మిగిలినవి ఎక్స్‌ట్రాల ద్వారా వచ్చాయి. సింగిల్‌ డిజిట్‌ లక్ష్యాన్ని రువాండా నాలుగు బంతుల్లోనే ఛేదించింది. యూఏఈతో మ్యాచ్‌లో చైనా చేసిన 14 పరుగులే మహిళల టీ20లో ఇప్పటి వరకు అత్యల్ప స్కోరు. మాలి ఆ రికార్డును బద్దలుకొట్టింది.

భారత్‌ జోరు:

భారత్‌ జోరు:

దక్షిణాసియా క్రీడల పతకాల వేటలో భారత్‌ జోరు కొనసాగుతోంది. ఆరో రోజైన శనివారం భారత ప్లేయర్లు 29 స్వర్ణాలు సహా మొత్తం 49 పతకాలు కైవసం చేసుకున్నారు. దీంతో భారత్ పతకాల సంఖ్య 214కు చేరింది. ఇందులో 110 స్వర్ణాలు, 69 రజతాలు, 35 కాంస్యాలు ఉన్నాయి. ఈ క్రీడల చరిత్రలో భారత్ ఆరోసారి స్వర్ణ పతకాల సెంచరీని పూర్తి చేసుకుంది. ఇక 214 పతకాలతో టాప్‌లో కొనసాగుతోంది.

Story first published: Sunday, December 8, 2019, 11:54 [IST]
Other articles published on Dec 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X