న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విండీస్‌తో రెండో టెస్టు: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. అశ్విన్‌కు చోటు కష్టమే

India vs West Indies: India Predicted XI for 2nd Test, Ashwin or extra batsman? Pitch and Weather repotr


కింగ్‌స్టన్‌: కరీబియన్‌ పర్యటన చివరి అంకానికి చేరుకుంది. కింగ్‌స్టన్‌ వేదికగా ఈ రోజు నుంచే చివరిదైన రెండో టెస్ట్‌ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో ఇప్పటికే టీ20లు, వన్డే సిరీస్‌లను గెలుచుకున్న టీమిండియా.. తొలి టెస్టులోనూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక రెండో టెస్టులోనూ విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని బరిలో దిగుతోంది. మరోవైపు వెస్టిండీస్‌ మాత్రం సొంతగడ్డపై ఆపసోపాలు పడుతోంది. కనీసం ఒక్క మ్యాచైనా నెగ్గి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. ఈ పర్యటనలో టీమిండియాను అరుదైన 'సిరీస్‌ క్లీన్‌స్వీప్‌' అవకాశం ఊరిస్తోంది. పేలవ ప్రదర్శనతో ఆతిథ్య జట్టు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోతున్న నేపథ్యంలో కోహ్లీసేనే ఫేవరెట్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

<strong>శ్రీవారిని దర్శించుకున్న 'వరల్డ్‌ చాంపియన్‌' పీవీ సింధు</strong>శ్రీవారిని దర్శించుకున్న 'వరల్డ్‌ చాంపియన్‌' పీవీ సింధు

రోహిత్‌కు నిరీక్ష తప్పదు:

రోహిత్‌కు నిరీక్ష తప్పదు:

భారత్‌ జట్టులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. ఓపెనర్లలో కేఎల్‌ రాహుల్‌ ఫర్వాలేదనిపించాడు. మరో ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌ మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో అతడు మంచి స్కోరు చేయాల్సిన అవసరం ఉంది. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ పుజారా వైఫల్యం కూడా జట్టును వేధిస్తోంది. అయితే అతను పుంజుకోవడం పెద్ద పనేం కాదు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ కొనసాగిస్తున్నాడు. అర్ధసెంచరీ, సెంచరీతో రహానే ఫామ్‌ను అందుకోవడం.. విహారి చక్కటి బ్యాటింగ్‌తో అలరించడంతో అవకాశం కోసం రోహిత్‌ శర్మ నిరీక్షించక తప్పదు.

పంత్‌కు పరీక్ష:

పంత్‌కు పరీక్ష:

వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ బ్యాటింగ్‌ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. కీలక సమయంలో అతడు క్రీజులో నిలవలేకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఫామ్‌ పక్కనబెడితే అతడు వికెట్లను సమర్పించుకుంటున్న తీరు దారుణంగా ఉంటోంది. 0, 4, 65, 20, 0, 24, 7 ఇవి ఈ పర్యటనలో పంత్‌ స్కోర్లు. వృద్ధిమాన్‌ సాహా జట్టులో ఉన్న నేపథ్యంలో గాడిన పడకపోతే పంత్‌కు ఇబ్బందులు తప్పవు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి పంత్‌పై పడింది.

అశ్విన్‌కు చోటు కష్టమే:

అశ్విన్‌కు చోటు కష్టమే:

పేస్ త్రయం జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, ఇషాంత్ శర్మలు అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో విండీస్ బ్యాట్స్‌మన్‌ను బెంబేలెత్తించాడు. స్పిన్‌ ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా పరుగులు చేస్తూ.. వికెట్లు తీస్తుండటం బౌలింగ్‌ బలంగా కనిపిస్తోంది. అయితే విమర్శల నేపథ్యంలో షమీని తప్పించి స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఆడించాలని టీమిండియా భావిస్తోంది.

 బ్యాటింగే బెంగ:

బ్యాటింగే బెంగ:

బౌలింగ్‌ అంత బలహీనంగా ఏమీ లేకున్నా.. బ్యాటింగ్‌లో టాపార్డర్‌ పేలవ ఫామ్‌ వెస్టిండీస్‌ను దెబ్బతీస్తోంది. మొదటి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క విండీస్‌ బ్యాట్స్‌మన్‌ కూడా అర్ధసెంచరీ చేయలేకపోయాడంటేనే ఆ జట్టు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓపెనర్‌ బ్రాత్‌వైట్‌ నిలిస్తేనే ఈ టెస్టులోనైనా వారి పరువు దక్కుతుంది. హోప్, చేజ్, హెట్‌మైర్‌లు రాణించాల్సిన అవసరం ఉంది. షమారా బ్రూక్స్‌ను పక్కనపెట్టి రకీమ్‌ కార్న్‌వాల్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. గాబ్రియల్‌, కీమర్‌ రోచ్‌లు రాణిస్తుండడం ఒక్కటే వెస్టిండీస్‌కు సంతోషాన్నిచ్చే విషయం. కీమో పాల్, హోల్డర్‌ తలో చేయి వేస్తే కోహ్లీ సేనను కట్టడి చేయొచ్చు.

మనసు మార్చుకున్న అంబటి రాయుడు.. రిటైర్మెంట్‌ వెనక్కి

పిచ్‌, వాతావరణం:

పిచ్‌, వాతావరణం:

మ్యాచ్‌ జరిగే రోజుల్లో వాతావరణం మేఘావృతమై ఉన్నా.. వర్షానికి అవకాశం తక్కువే. పిచ్‌ పచ్చికతో ఉంది. పేస్‌కు అనుకూలంగా తయారు చేశారు. ఇక ఇక్కడ జరిగిన చివరి ఏడు టెస్టుల్లో ఆరింట ఫలితాలు వచ్చాయి. మ్యాచ్‌ సాగిన కొద్దీ పిచ్‌ స్పిన్నర్లకు సహకరించనుంది. టాస్‌ నెగ్గిన జట్టు బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది.

తుది జట్లు (అంచనా):

తుది జట్లు (అంచనా):

భారత్‌: మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, పుజార, కోహ్లీ (కెప్టెన్‌), రహానే, విహారి, పంత్‌ (వికెట్‌ కీపర్‌), జడేజా, ఇషాంత్‌, షమీ / అశ్విన్‌, బుమ్రా.

వెస్టిండీస్‌: బ్రాత్‌వైట్, క్యాంప్‌బెల్, బ్రూక్స్‌/కార్న్‌వాల్, హోప్, బ్రేవో, చేజ్, హెట్‌మైర్, హోల్డర్‌ (కెప్టెన్‌), కీమో పాల్, రోచ్, గాబ్రియెల్‌.

Story first published: Friday, August 30, 2019, 12:34 [IST]
Other articles published on Aug 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X