న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబైలో 3rd T20: టాస్ గెలిచిన వెస్టిండిస్, టీమిండియా బ్యాటింగ్

India vs West Indies 3rd T20, Live Score: West Indies have won the toss and have opted to field

హైదరాబాద్: భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య మూడో టీ20 ప్రారంభమైంది. వాంఖెడే పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో పాటు ఛేజింగ్‌కు సులువు అవుతుందనే ఉద్దేశంతో పొలార్డ్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

ఈ మ్యాచ్‌‌లో రెండు కీలక మార్పులు చేసింది. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, మణికట్టు స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ల స్థానంలో మహ్మద్‌ షమీ, కుల్దీప్‌ యాదవ్‌లు జట్టులోకి వచ్చారు. గత రెండు మ్యాచ్‌ల్లో ఫీల్డింగ్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన వాషింగ్టన్‌ సుందర్‌ను కోహ్లీ పక్కకు పెడతాడని అంతా భావించారు.

అయితే, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అతడికి మరోసారి అవకాశం కల్పించింది. మరోవైపు విండీస్‌ జట్టులో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. గత మ్యాచ్‌‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది. ఈ ఏడాది ఆగస్టులో టీమిండియా విండీస్‌ పర్యటన సందర్భంగా కరీబియన్‌ జట్టును వైట్‌వాష్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కోహ్లీసేనపై విజయం సాధించి విండీస్‌ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. వాంఖడె స్టేడియంలో ఇప్పటివరకు జరిగిన 6 టీ20ల్లో తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న జట్టు ఐదు సార్లు విజయం సాధించగా... ఒకసారి మాత్రమే ఓటమిపాలైంది.

మూడు టీ20ల సిరిస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో సిరిస్ 1-1తో సమం అయింది. దీంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరిస్ విజేతగా నిలుస్తుంది. మూడేళ్ల క్రితం టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో విండీస్‌ చేతిలో ఓడాక ఇరు జట్లు తొలిసారి వాంఖడేలో తలపడుతున్నాయి.

ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుకి చేరువయ్యాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మరో 6 పరుగులు చేస్తే టీ20ల్లో సొంతగడ్డపై వెయ్యి పరుగుల మైలురాయిని విరాట్ కోహ్లీ అందుకుంటాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.

మొత్తంగా టీ20ల్లో ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా నిలుస్తాడు. అంతకముందు న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్(1430), కోలిన్ మున్రో(1000) ఈ ఘనత సాధించారు. మరోవైపు చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌ మరొక వికెట్‌ తీస్తే భారత్‌ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.

ప్రస్తుతం అతడు అశ్విన్‌ (52)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

జట్ల వివరాలు:
ఇండియా: రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, శివం దుబే, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, దీపక్ చాహర్, మహ్మద్ షమీ

వెస్టిండీస్: లెండ్ల్ సిమన్స్, ఎవిన్ లూయిస్, బ్రాండన్ కింగ్, షిమ్రాన్ హెట్మియర్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), కీరోన్ పొలార్డ్ (కెప్టెన్), జాసన్ హోల్డర్, ఖారీ పియరీ, హేడెన్ వాల్ష్, షెల్డన్ కాట్రెల్, కెస్రిక్ విలియమ్స్

Story first published: Wednesday, December 11, 2019, 19:13 [IST]
Other articles published on Dec 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X