Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇన్నింగ్స్ మధ్యలో సంజూ బ్యాట్ ఎత్తికెళ్లిన రింకూ సింగ్(వీడియో)

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన సూపర్-8 పోరులో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. భారత ఇన్నింగ్స్ మధ్యలో సంజూ శాంసన్ బ్యాట్‌ను సంకలో పెట్టుకొని రింకూ సింగ్ ముందుకు కదిలాడు.

ఉద్దేశపూర్వకంగా ఇలా చేయకపోయినా.. ఈ ఘటనతో అక్కడ నవ్వులు పూసాయి. తన బ్యాట్ లేదని గ్రహించిన సంజూ శాంసన్.. మైదానం బయటకు వెళ్తున్న రింకూ సింగ్‌ను పిలిచి బ్యాట్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే..?

సంజూ శాంసన్ రాకతో తుది జట్టులో చోటు కోల్పోయిన రింకూ సింగ్.. వాటర్ బాయ్‌గా మారాడు. వెస్టిండీస్‌తో డూ ఆర్ డై మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్‌తో కలిసి భారత ఆటగాళ్లకు డ్రింక్స్ అందించాడు. భారత బ్యాటింగ్ సందర్భంగా సంజూ శాంసన్‌కు కూడా రింకూ డ్రింక్స్ ఇచ్చాడు. ఈ సమయంలో సంజూ బ్యాట్‌ను సంకలో పెట్టుకున్న రింకూ సింగ్.. టవల్‌తో పాటు డ్రింక్స్ ఇచ్చాడు.

టవల్‌తో చెమటను తుడుచుకున్న సంజూ శాంసన్... కుల్దీప్ ఇచ్చిన డ్రింక్స్ తాగి బ్యాటింగ్‌కు సిద్దమయ్యాడు. కుల్దీప్, రింకూ సింగ్ ముందుకు కదలగా.. బ్యాట్ లేదని గ్రహించిన సంజూ.. రింకూను పిలిచి బ్యాట్ తీసుకున్నాడు. సంజూ చెప్పేవరకు రింకూ సింగ్ కూడా ఈ విషయాన్ని గ్రహించలేదు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి.

IND vs WI Rinku Singh Accidentally Walks Off With Sanju Samson s Bat Mid-Innings Video Goes Viral
Photo Credit: screen grab for JioHotstar

ఒంటి చేత్తో గెలిపించిన సంజూ

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. రోస్టన్ ఛేజ్(25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 40), రోవ్‌మన్ పోవెల్(19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34 నాటౌట్), జాసన్ హోల్డర్(22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(2/36) రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు.

అనంతరం భారత్19.2 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేసి గెలుపొందింది. సంజూ శాంసన్ (50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 97 నాటౌట్) ఒక్కడే అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. తిలక్ వర్మ(15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 27) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వెస్టిండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్(2/38), షమార్ జోషెఫ్(2/42) రెండేసి వికెట్లు తీయగా.. అకీల్ హోస్సేన్ ఒక వికెట్ తీసాడు.

Story first published: Monday, March 2, 2026, 10:38 [IST]
Other articles published on Mar 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+