For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సంజూకి సెక్యూరిటీగా సూర్య.. నవ్వులే నవ్వులు!(వీడియో)

టీమిండియా విధ్వంసకర ఓపెనర్ సంజూ శాంసన్ ఒక్క ఇన్నింగ్స్‌తో స్టార్ ప్లేయర్‌గా మారిపోయాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కోల్‌కతా వేదికగా ఆదివారం జరిగిన డూఆర్‌డై సూపర్-8 మ్యాచ్‌లో సంజూ శాంసన్ (50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 97 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇతర తోపులు అభిషేక్, ఇషాన్, తిలక్, హార్దిక్, సూర్యకుమార్ యాదవ్ అందరూ కట్టకట్టుకొని విఫలమైన వేళ.. తానొక్కడే నిలబడి చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ గెలుపుతో టీమిండియా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. మ్యాచ్ అనంతరమే సంజూకి గౌరవ వందనం చేసి తనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్న సూర్య.. తాజాగా అతనికి సెక్యూరిటీ గార్డ్‌గా మారి నవ్వులు పూయించాడు.

ఇన్నింగ్స్ మధ్యలో సంజూ బ్యాట్ ఎత్తికెళ్లిన రింకూ సింగ్(వీడియో)ఇన్నింగ్స్ మధ్యలో సంజూ బ్యాట్ ఎత్తికెళ్లిన రింకూ సింగ్(వీడియో)

సంజూకు సెక్యూరిటీగా సూర్య..

గురువారం ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా ఇంగ్లండ్‌తో టీమిండియా రెండో సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది. అయితే ఎయిర్‌పోర్ట్‌లో సంజూ శాంసన్‌కు సూర్య సెక్యూరిటీ ఆఫిసర్‌గా వ్యవహరించాడు. ఎయిర్‌పోర్టులో సంజూ నడుస్తుండగా.. అతని ముందు వెళ్తూ.. 'చేటను డిస్టర్బ్ చేయవద్దు.. ఫొటోలు వద్దు.. దారి ఇవ్వండి'అని గట్టిగా అరిచాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి. సంజూ శాంసన్ కూడా సూర్య చేష్టలతో నవ్వు ఆపుకోలేకపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Watch Suryakumar Yadav Playfully Acts as Sanju Samson s Security Guard in Viral Throwback After World Cup Heroics

అయితే ఇది పాత వీడియో.. జనవరి 30న బీసీసీఐ షేర్ చేసిన ఈ వీడియోను నెటిజన్లు తాజా ఇన్నింగ్స్‌కు కనెక్ట్ చేసి వైరల్ చేస్తున్నారు. కోల్‌కతా, ముంబై ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకున్న ఘటన అని భ్రమ పడుతున్నారు. పాత వీడియో అయినా సందర్భానికి కలిసి రావడంతో వైరల్‌గా మారింది. తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి టీ20 సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. హోమ్ గ్రౌండ్‌లో సంజూ ఆడటం అదే తొలిసారి కావడంతో సూర్య అతనికి సెక్యూరిటీ‌లా వ్యవహరించాడు. కానీ ఆ మ్యాచ్‌లో సంజూ తీవ్రంగా నిరాశపర్చాడు.

భారత్‌ను గెలిపించిన సంజూ..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. రోస్టన్ ఛేజ్(25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 40), రోవ్‌మన్ పోవెల్(19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34 నాటౌట్), జాసన్ హోల్డర్(22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(2/36) రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు.

అనంతరం భారత్19.2 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేసి గెలుపొందింది. సంజూ శాంసన్ (50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 97 నాటౌట్) ఒక్కడే అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. తిలక్ వర్మ(15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 27) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వెస్టిండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్(2/38), షమార్ జోషెఫ్(2/42) రెండేసి వికెట్లు తీయగా.. అకీల్ హోస్సేన్ ఒక వికెట్ తీసాడు.

చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. కోహ్లీ, రోహిత్ రికార్డ్ బద్దలు!చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. కోహ్లీ, రోహిత్ రికార్డ్ బద్దలు!

Story first published: Monday, March 2, 2026, 13:03 [IST]
Other articles published on Mar 2, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+