న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విండీస్‌పై చివరి వన్డేలో విజయం.. సిరీస్‌ భారత్‌ కైవసం

India vs West Indies, 3rd ODI: Virat Kohli Century Leads India To 2-0 Series Win Against West Indies

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: వెస్టిండీస్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 35 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 35 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. క్రిస్‌ గేల్‌(72; 41బంతుల్లో 8×4, 5×6), లూయిస్‌(43; 29బంతుల్లో 5×4, 3×6) ఇన్నింగ్స్ మొదటిలో మెరుపులు మెరిపించారు. డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం భారత్‌ లక్ష్యాన్ని 255 పరుగులుగా నిర్ధేశించారు. 32.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి భారత్ జయకేతనం ఎగురవేసింది. కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (114; 99 బంతుల్లో 14×4) మరో సెంచరీ చేసాడు. తాజా విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్‌ 2-0తో కైవసం చేసుకుంది. మొదటి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా చివరి రెండు వన్డేలను భారత్ గెలిచింది.

<strong>వికాస్ విజృంభణ.. హరియాణా హ్యాట్రిక్‌</strong>వికాస్ విజృంభణ.. హరియాణా హ్యాట్రిక్‌

రోహిత్ విఫలం:

రోహిత్ విఫలం:

వర్షం కారణంగా భారత్‌ లక్ష్యాన్ని 255 పరుగులుగా నిర్ధేశించారు. లక్ష్య ఛేదనలో ఓపెనర్ రోహిత్‌ శర్మ (10) తొలి ఓవర్‌లో రెండు బౌండరీలు బాదాడు. అయితే మూడో ఓవర్‌లో అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్‌ అయ్యాడు. మరో ఓపెనర్‌ శిఖర్ ధావన్‌ (36; 36బంతుల్లో 5×4)తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. కుదురుకున్నట్లే కనిపించిన ధావన్.. 13వ ఓవర్‌లో అలెన్‌ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అనంతరం పంత్‌ (0) కూడా అదే ఓవర్‌లో ఔట్ అయ్యాడు. దీంతో 92 పరుగులకు మూడు కీలక వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది.

సూపర్ శ్రేయాస్‌:

సూపర్ శ్రేయాస్‌:

ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన యువ ఆటగాడు శ్రేయాస్‌ అయ్యర్ కెప్టెన్ కోహ్లీకి జత కలిసాడు. ఆదిలో ఆచితూచి ఆడిన ఈ జోడి అనంతరం జోరు సాగించారు. కోహ్లీ బౌండరీలు బాడుతుంటే.. శ్రేయస్‌ చెత్త బంతులను సిక్సర్లు బాదుతూ స్కోర్ వేగాన్ని పెంచాడు. ఈ క్రమంలో 26వ ఓవర్‌లో అర్ధ శతకం (65; 41బంతుల్లో 3×4, 5×6) పూర్తి చేసుకున్నాడు. ధాటిగా ఆడే ప్రయత్నంలో రోచ్‌ బౌలింగ్‌లో హోల్డర్‌ చేతికి చిక్కాడు. దీంతో 120 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

కోహ్లీ@43

కోహ్లీ@43

శ్రేయాస్‌ ఔట్‌ అయ్యాక క్రీజులోకి వచ్చిన కేదార్‌ జాదవ్‌ (19; 12బంతుల్లో 1×4, 1×6).. కోహ్లీకి అండగా నిలిచాడు. మరోవైపు కోహ్లీ చక్కటి షాట్లతో అలరించాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు సాధిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తూ సెంచరీ చేసాడు. వన్డేల్లో ఇది 43వ సెంచరీ. జాదవ్‌తో కలిసి మరో వికెట్‌ పడకుండా ఆడైన కోహ్లీ భారత్‌ను విజయ తీరాలకు తేర్చాడు. 32.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ లక్ష్యాన్ని ఛేదించింది.

యాషెస్ రెండో టెస్ట్.. తొలి రోజు వర్షార్పణం

గేల్ సునామి:

గేల్ సునామి:

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న విండీస్‌.. తొలి నాలుగు ఓవర్లలో 13 పరుగులే చేసింది. ఐదో ఓవర్‌ నుంచి ఓపెనర్లు బ్యాట్ జులిపించారు. ఐదో ఓవర్లో లూయిస్ రెండు ఫోర్లు, ఓ భారీ సిక్స్‌ కొట్టాడు. ఆ తర్వాత గేల్‌ ఓ సిక్స్‌, మూడు ఫోర్లు బాదాడు. గేల్‌, లూయిస్‌ ధాటికి ఖలీల్‌ తన తొలి రెండు ఓవర్లలో 33 పరుగులు సమర్పించుకున్నాడు. గేల్‌ కేవలం 30 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. విండీస్‌ 10 ఓవర్లలో 114/0తో నిలిచింది. 11వ ఓవర్లో లూయిస్‌ (43; 29బంతుల్లో 5×4, 3×6)ను చాహల్‌ ఔట్‌ చేయడంతో విండీస్ ఎట్టకేలకు తొలి వికెట్‌ కోల్పోయింది. ఇక తర్వాతి ఓవర్లోనే గేల్‌ (72; 41బంతుల్లో 8×4, 5×6)ను ఖలీల్‌ వెనక్కి పంపాడు.

మ్యాచ్‌కు అంతరాయం :

మ్యాచ్‌కు అంతరాయం :

ఓపెనర్ల నిష్క్రమణ అనంతరం పరుగుల వేగం తగ్గింది. హెట్‌మైయర్‌ (25), షై హోప్‌ (24) నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్‌ నిలబెట్టారు. ఇక 22వ ఓవర్‌లో వరుణుడు రావడంతో సుమారు రెండు గంటల వరకూ మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. దీంతో మ్యాచ్‌ను అంపైర్లు 35 ఓవర్లకు కుదించారు. తర్వాత హెట్‌మైయర్‌, హోప్‌ వెంటవెంటనే పెవిలియన్ చేరారు. పూరన్‌ ( 22), బ్రాత్‌వైట్‌ (16) బ్యాట్‌ ఝళిపించడంతో విండీస్‌ భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లలో ఖలీల్‌ మూడు వికెట్లు పడగొట్టాడు.

Story first published: Thursday, August 15, 2019, 8:31 [IST]
Other articles published on Aug 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X