న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండో వన్డే: వైజాగ్ స్టేడియం అంత ప్రత్యేకమా..?

India vs Windies 2018 : Why Vizag Stadium Is Very Special To Team India ?
India Vs West Indies 24th October 2018 ~2nd ODI Tickets Vizag Stadium

న్యూ ఢిల్లీ: నగరంలో క్రికెట్‌ సందడి మొదలైంది. మరో 2 రోజుల్లో పీఎంపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా భారత్‌, వెస్టిండీస్‌ మధ్య అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఇరు జట్ల ఆటగాళ్లు సోమవారం నగరానికి చేరుకుంటున్న నేపథ్యంలో క్రీడాభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఇరు జట్లు ఇప్పటివరకు రెండుసార్లు తలపడగా... విజయం సాధించి సమవుజ్జీలుగా నిలిచారు.

అన్ని ఫార్మట్లకు ఆతిథ్యమిచ్చిన ఘనత

అన్ని ఫార్మట్లకు ఆతిథ్యమిచ్చిన ఘనత

దీంతో భారత్‌తో పాటు వెస్టిండీస్‌కు కూడా ఇక్కడి పిచ్‌ కలిసొచ్చిందనే సెంటిమెంట్‌ నెలకొన్న నేపథ్యంలో బుధవారం జరిగే వన్డే మ్యాచ్‌ పట్ల క్రీడాభిమానుల్లో ఆసక్తి పెరిగింది. కాగా, అంతర్జాతీయ క్రికెట్‌ రంగంలో టెస్టు, వన్డే, టీ20 వంటి అన్ని ఫార్మట్ల మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన ఘనతను సొంతం చేసుకున్న విశాఖ... అక్టోబరు 24న భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగే అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌తో మరో అడుగు ముందుకేయనుంది.

'గాలె స్టేడియంలో మ్యాచ్ అనంతరం రిటైర్ అయిపోతా'

తొలి వన్డేలో భారత్‌కు గట్టి పోటీనిచ్చి

తొలి వన్డేలో భారత్‌కు గట్టి పోటీనిచ్చి

భారత్‌లో పర్యటిస్తున్న వెస్టిండీస్‌ ఆటగాళ్లు టెస్టు సిరీస్‌ను కోల్పోయినా వన్డే సిరీస్‌ను నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఆదివారం గౌహతిలో జరిగిన తొలి వన్డేలో భారత్‌కు గట్టి పోటీనిచ్చారు. దీంతో బుధవారం విశాఖలో జరిగే రెండో వన్డే మ్యాచ్‌పై క్రీడాభిమానుల్లో ఆసక్తి పెరిగింది. కాగా బుధవారం ఇక్కడ జరిగే వన్డే మ్యాచ్‌తో విశాఖ ఆతిథ్యమిచ్చిన అంతర్జాతీయ వన్డేల సంఖ్య 14కు చేరనుండగా... ఏసీఏ-వీడీసీఏ స్టేడియం తొమ్మిదోసారి వేదికగా నిలవడం విశేషం.

జట్టులో స్థానాన్ని పదిలం చేసిన సందర్భాలు

జట్టులో స్థానాన్ని పదిలం చేసిన సందర్భాలు

ఫామ్‌ను కోల్పోయి పట్టుమని పది పరుగులు చేయడానికి నానాతంటాలు పడే ఆటగాడికి సెంచరీ కానుకగా ఇచ్చి జట్టులో అతని స్థానాన్ని పదిలం చేసిన సందర్భాలు అనేకం. ధోనీ, కోహ్లి వంటి ఆటగాళ్ల క్రీడా భవిష్యత్‌ను అత్యున్నత స్థాయికి చేర్చిందనడంలో అతిశయోక్తి లేదు. దీంతో విశాఖలోని ఈ స్టేడియంలో రాణిస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు తిరుగుండదనే నమ్మకం, విశ్వాసాన్ని ఆటగాళ్లలో కలిగించిందనడంలో సందేహం లేదు.

రూ.4 వేలు, 5 వేల ధరలు టిక్కెట్లు మినహా

రూ.4 వేలు, 5 వేల ధరలు టిక్కెట్లు మినహా

ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా ఈ నెల 24న భారత్‌, వెస్టిండీస్‌ మధ్య జరిగే వన్డే మ్యాచ్‌ టిక్కెట్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో రూ.500 ధర టిక్కెట్లు పూర్తిగా అమ్ముడైపోయాయి. కాగా ఆన్‌లైన్‌లో రూ.1,200, 1,800, 2,000, 2,500, 4,000, 5,000 రేట్ల టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. కాగా మ్యాచ్‌కు మరో రెండు రోజుల సమయం వున్న నేపథ్యంలో రూ.4 వేలు, 5 వేల ధరలు టిక్కెట్లు మినహా మిగిలినవి అమ్ముడైపోతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Story first published: Monday, October 22, 2018, 12:35 [IST]
Other articles published on Oct 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X