'గాలె స్టేడియంలో మ్యాచ్ అనంతరం రిటైర్ అయిపోతా'

న్యూ ఢిల్లీ: టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్టార్మ్ బౌలర్‌గా తన పేరిట రికార్డు లిఖించుకున్న శ్రీలంక స్పిన్నర్ రంగనా హెరాత్ టెస్టు కెరీర్‌కు గుడ్ బై చెప్పనున్నాడు. వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరగబోయే తొలి టెస్టు మ్యాచే హెరాత్‌కు చివరది. ఈ మేరకు గతంలోనే సూత్రప్రాయంగా సంకేతాలిచ్చిన హెరాత్.. తాజాగా తన వీడ్కోలు విషయాన్నివెల్లడించాడు.

కెరీర్ ముగింపు కూడా ఇదే వేదికపై
నవంబర్ 6వ తేదీ నుంచి గాలెలో శ్రీలంక-ఇంగ్లాండ్ జట్ల తొలి టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. అయితే గాలె వేదికను సెంటిమెంట్‌గా భావిస్తున్న హెరాత్.. ఇక్కడే వీడ్కోలు చెబితే బాగుంటుందనే ఉద్దేశంతో తన టెస్టు కెరీర్ ముగింపుపై ప్రకటన చేశాడు. 1999లో గాలెలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హెరాత్.. కెరీర్ ముగింపు కూడా ఇదే వేదికపై పలకడానికి సిద్ధమయ్యాడు.
భారత్ ఆతిథ్యమివ్వనున్న ప్రపంచ కప్‍కు ఐసీసీ సరికొత్త విధానం

హెరాత్ నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని
హెరాత్ తీసుకున్న నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని ఆ జట్టు అధికార ప్రతినిధి మీడియా ముందు వెల్లడించాడు. టెస్టు క్రికెట్‌లో వికెట్లు తీయడంలో అతని శైలి ప్రత్యేకంగా ఉంటుందని వివరించారు. దక్షిణాఫ్రికాతో జరగనున్న సిరీస్‌కు ముందు హెరాత్ మీడియాతో మాట్లాడాడు.

ఇంగ్లాండ్‌తో జరగనున్న సిరీస్ ఫైనల్ అని
ఇదే సంవత్సరం ఇంగ్లాండ్‌తో జరగనున్న సిరీస్ నాకు ఫైనల్ సిరీస్ అని భావిస్తున్నాను. ప్రస్తుతం ఇంకో మూడు నెలల సమయముందంటూ పేర్కొన్నాడు. ఇటీవల మీడియాతో మాట్లాడిన హెరాత్.. నేను అనుకున్నట్లుగానే క్రికెట్ నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చేసింది. ప్రతి క్రికెటర్‌కు ఇది తప్పని సమయం' అని వెల్లడించాడు.

లెఫ్టార్మ్ బౌలర్‌గా హెరాత్ రికార్డు
శ్రీలంక తరపున 92 టెస్టుల్లో 430 వికెట్లు, 71వన్డేల్లో 74 వికెట్లు, 17 టీ20ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్టార్మ్ బౌలర్‌గా హెరాత్ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో పాక్ దిగ్గజ బౌలర్ వసీం ఆక్రమ్ (414) ఉన్నాడు. ముత్తయ్య.. మురళీధరన్ తర్వాత శ్రీలంక తరపున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా హెరాత్ గుర్తింపు సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications