న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేటి నుంచి విండీస్‌తో తొలి టెస్టు.. భారత జట్టు కూర్పుపై సర్వత్రా ఆసక్తి!!

India vs West Indies 1st Test preview: Where to watch, possible XI, players to watch out for, Weather report, Pitch Report

ఆంటిగ్వా: వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లు కైవసం చేసుకున్న భారత్.. టెస్టు సిరీస్‌ సమరానికి సిద్దమయింది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం సర్ వివ్ రిచర్డ్స్ మైదానంలో భారత్-విండీస్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. టీమిండియా ఫేవరెట్‌ అనడంలో సందేహం లేదు. అయితే కోహ్లీ సేనకు తుది జట్టు కూర్పే పెద్ద సవాల్‌గా మారింది. వెస్టిండీస్‌ అంటే టీ20 జట్టే అయినా.. ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు జట్టులో చేరడంతో ఇప్పుడు బలంగా కనిపిస్తోంది. సొంతగడ్డపై బలమైన ఇంగ్లాండ్‌ను 2-1తో ఓడించి సత్తా చాటిన విండీస్.. టీమిండియాకు ఎంత పోటీ ఇస్తుందో చూడాలి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఆడనున్న తొలి టెస్టు మ్యాచ్‌ ఇదే.

<strong>హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో తలైవాస్‌పై జైపుర్‌ విజయం</strong>హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో తలైవాస్‌పై జైపుర్‌ విజయం

ఐదవ స్థానంలో ఎవరు:

ఐదవ స్థానంలో ఎవరు:

రెగ్యులర్ ఓపెనర్ శిఖర్ ధావన్ లేకపోవడంతో మయాంక్‌ అగర్వాల్‌కు తోడుగా ఎవరు ఎవరు ఓపెనింగ్‌ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అందుకోసం కేఎల్ రాహుల్‌, హనుమ విహారి మధ్య తీవ్ర పోటీ ఉంది. మూడో స్థానంలో డిపెండబుల్ చతేశ్వర్ పుజారా, నాలుగో స్థానంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాయం. ఇక ఐదో స్థానం కోసం ఎవరిని తీసుకోవాలనే విషయంపైనే సందిగ్థత నెలకొంది. ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాల్సి వస్తే రోహిత్ శర్మ, అంజిక్య రహానేల్లో ఒకరిని బెంచ్‌కు పరిమితం చేయాల్సి వస్తుంది. నలుగురు బౌలర్లతో బరిలోకి దిగితే ఇద్దరికీ చోటుంటుంది. టెస్టు స్పెషలిస్టు కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా అందుబాటులో ఉన్న నేపథ్యంలో రిషబ్ పంత్‌కు స్థానం లభిస్తుందో లేదో చూడాలి.

జడేజా అనుమానమే:

జడేజా అనుమానమే:

టెస్టు స్పెషలిస్టులు రవిచంద్రన్ అశ్విన్‌, ఇషాంత్‌ శర్మలు జట్టులోకి రావడంతో భారత్ మరింత బలంగా మారింది. జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ బౌలింగ్‌ను ముందుండి నడిపించనున్నారు. ఉమేశ్ బెంచ్‌కు పరిమితమవ్వొచ్చు. స్పిన్ విభాగంలో సీనియర్ అశ్విన్, కుల్‌దీప్ యాదవ్ ఒకరే ఉండే చాన్స్ ఉంది. బ్యాటింగ్ ఆడగలడం అశ్విన్‌కు అదనపు బలం. జడేజా జట్టులో ఉండడం కూడా అనుమానంగానే ఉంది.

యువకులపైనే ఆశలు:

యువకులపైనే ఆశలు:

యువ ఆటగాళ్లు జట్టులో చేరిన తర్వాత విండీస్ ఆటలో మార్పొచ్చింది. ముఖ్యంగా టెస్టుల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. డారెన్‌ బ్రావో, షై హోప్‌, క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌, హెట్‌మైర్, జాన్‌ క్యాంప్‌బెల్‌, ఛేజ్‌, రోచ్‌ లాంటి ఆటగాళ్లు విండీస్ జట్టులో ఉన్నారు. హోల్డర్, బ్రాత్‌వైట్ బ్యాట్ జిలిపించడానికి సిద్ధంగా ఉంటారు. దీంతో విండీస్ జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదు. విండీస్‌ బాహుబలి రకీమ్‌ కార్న్‌వాల్‌ ఈ మ్యాచ్‌ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశముంది. ఇక రోచ్, గాబ్రియేల్‌తో కూడిన విండీస్ బౌలింగ్ భీకరంగా ఉంది. హోల్డర్, బ్రాత్‌వైట్ కూడా బంతిని పంచుకోనున్నారు.

ట్యాక్లింగ్‌లో సుర్జీత్‌ హవా.. బుల్స్‌కు పల్టాన్‌ షాక్!!

పిచ్‌, వాతావరణం:

పిచ్‌, వాతావరణం:

మ్యాచ్‌కు వేదికైన అంటిగ్వాలో వాతావరణం సాధారణంగా మేఘావృతమై ఉండే అవకాశముంది. మ్యాచ్‌ జరిగే ఐదు రోజులు వర్షం కురిసే అవకాశాలు దాదాపు లేవు. అయితే మూడో రోజు వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. తొలి రెండు రోజులు పిచ్‌ పేసర్లకు సహకరించే అవకాశాలున్నాయి. అయితే మ్యాచ్‌ గడుస్తున్న కొద్దీ స్పిన్నర్లకు సహకారం లభిస్తుంది

జట్ల అంచనా:

జట్ల అంచనా:

భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రాహుల్/విహారి, మయాంక్, పుజార, రహానే/ రోహిత్, జడేజా, రిషబ్ పంత్, అశ్విన్, ఇషాంత్, షమీ, బుమ్రా.

వెస్టిండీస్: హోల్డర్ (కెప్టెన్), బ్రాత్‌వైట్, క్యాంప్‌బెల్, షాయి హోప్, బ్రావో, హిట్మెయర్, రోస్టన్ చేజ్, డౌరిచ్, కార్న్‌వాల్ /కీమో పాల్, కీమర్ రోచ్, గాబ్రియెల్.

Story first published: Thursday, August 22, 2019, 11:11 [IST]
Other articles published on Aug 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X