న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

31 ఏళ్ల తర్వాత కపిల్ రికార్డుని సమం చేసిన హార్దిక్ పాండ్యా

By Nageshwara Rao
Hardik Pandya repeats Kapil Dev feat after 31 years

హైదరాబాద్: విశాఖపట్నం వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. ఈ ఏడాది జులైలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ ద్వారా టెస్టుల్లో భారత్‌ తరుపున అరంగేట్రం చేసిన పాండ్యా... కపిల్‌ దేవ్‌ తర్వాత అత్యుత్తమ ఆల్‌‌రౌండర్‌గా మన్ననలు అందుకున్న సంగతి తెలిసిందే.

పాండ్యా ఈ సైతం ఈ ఏడాది అద్భుత ప్రదర్శనను కనబర్చాడు. ఈ నేపథ్యంలో 31 ఏళ్ల క్రితం కపిల్‌ దేవ్‌ సాధించిన రికార్డును పాండ్యా సమం చేశాడు. అంతర్జాతీయ వన్డేల్లో ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో 500కు పైగా పరుగులు 30కు పైగా వికెట్లు సాధించాడు. 1986లో కపిల్‌ దేవ్‌ తర్వాత ఈ ఘనత సాధించిన ఆల్ రౌండర్‌గా పాండ్యా నిలిచాడు.

ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో హార్దిక్‌ 27 అంతర్జాతీయ వన్డేలాడగా, 517 పరుగులు సాధించడంతో పాటు 30వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో హార్దిక్‌ పాండ్యా ఈ ఘనతను సాధించాడు. మూడో వన్డేలో 10 ఓవర్లు వేసిన పాండ్యా 49 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, December 17, 2017, 19:41 [IST]
Other articles published on Dec 17, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X