న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Sri Lanka Dream11: మూడో వన్డేలో మార్పులు.. కెప్టెన్‌, వైస్ కెప్టెన్‌గా శిఖర్ ధావన్, సూర్యకుమార్ యాదవ్

India vs Sri Lanka Dream11 Prediction For 3rd Match: Captain, Vice-Captain, Fantasy Tips And Playing 11

హైదరాబాద్: పెద్దగా అనుభవంలేని ప్లేయర్లతో కూడిన శ్రీలంక జట్టుపై అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన భారత్‌ తొలి రెండు వన్డేల్లో ఘనవిజయం సాధించి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు క్లీన్ స్వీప్ లక్ష్యంగా శుక్రవారం జరిగే తుదిపోరుకు సిద్దమైంది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకోవడంతో టీమిండియా రిజర్వ్ బెంచ్‌ను పరీక్షించే అవకాశం ఉంది.

మరోవైపు శ్రీలంక పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. రెండో వన్డేలో అద్భుతంగా రాణించినా విజయం ముంగిట ఆ జట్టు బోల్తా పడింది. టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను త్వరగానే పెవిలియన్ చేర్చిన ఆ జట్టు.. టేలండర్ల ముందు చేతులెత్తేసి ఓటమకి తల వంచింది. మరీ ఆఖరి పోరులోనైనా గెలిచి పరువు దక్కించుకుంటుందా? లేక గబ్బర్ సేనకు దాసోహం అంటుందా? అనేది చూడాలి.!

గబ్బర్ సేనలో మార్పులు..

గబ్బర్ సేనలో మార్పులు..

తొలి రెండు వన్డేల్లో గబ్బర్ సేన దుమ్మురేపింది. గెలవాలనే కసితో ప్రత్యర్థి ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకోవడంతో రిజర్వ్ బెంచ్‌ను ఆడించే చాన్సుంది. అయితే ఎవరిని తీసి మరెవరిని ఆడిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. గాయం నుంచి కోలుకున్న సంజూ శాంసన్‌కు చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇషాన్ కిషన్ స్థానంలో అతనికి చోటు దక్కవచ్చు. ఇక రెండో వన్డేలో విఫలమైన కుల్దీప్ స్థానంలో రాహుల్ చాహర్ లేదా వరుణ్ చక్రవర్తిల్లో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది.

నవ్‌దీప్ సైనీ‌కి కూడా అవకాశం ఇవ్వాలని భావిస్తే దీపక్ చాహర్‌కు విశ్రాంతి ఇవ్వచ్చు. గత మ్యాచ్‌లో విరోచిత బ్యాటింగ్ చేసిన అతను తిమ్మిర్లతో బాధపడ్డాడు. టీ20 సిరీస్‌కు సిద్దమయ్యేందుకు రేపటి మ్యాచ్ నుంచి మినహాయింపు లభించవచ్చు. మిగతా జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

భారత తుది జట్టు (అంచనా)

శిఖర్ ధావన్(కెప్టెన్), పృథ్వీ షా, ఇషాన్ కిషన్/ సంజూ శాంసన్(కీపర్), మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్/నవ్‌దీప్ సైనీ, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్/రాహుల్ చాహర్/వరుణ్ చక్రవర్తీ

శ్రీలంక టీమ్ న్యూస్

శ్రీలంక టీమ్ న్యూస్

తొలి వన్డేతో పోలిస్తే రెండో వన్డేలో శ్రీలంక మెరుగైన ప్రదర్శన చేసింది. వాస్తవానికి ఆ జట్టు గెలుపు ముంగిట ఆ జట్టు బోల్తాపడింది. టీమిండియా బ్యాట్స్‌మన్‌కు తగ్గట్లు ప్లాన్ చేసిన ఆ టీమ్.. చివర్లో అనుభవలేమి ఆటతో చేజేతులా విజయాన్ని దూరం చేసుకుంది. ఔటౌఫ్ సిలబస్‌లో చెలరేగిన దీపక్ చాహర్‌ను కట్టడి చేయలేకపోయింది. చివర్లో ఆ జట్టు కెప్టెన్ డసన్ షనక చేసిన తప్పిదాలు కూడా ఆ జట్టు కొంపముంచాయి. గత మ్యాచ్‌లో గాయపడ్డ భానుక రాజపక్స్ స్థానంలో పాతుమ్ నిస్సంకను తీసుకోవచ్చు. గత మ్యాచ్‌లో ధారళంగా పరుగలిచ్చిన లక్షన్ సందకన్ స్థానంలో అకిలా ధనంజయకు అవకాశం ఇవ్వచ్చు.

లంక తుది జట్టు (అంచనా)

అవిష్కా ఫెర్నాండో, మినోద్ భానుక(కీపర్), భానుక రాజపక్స, ధనుంజయ డిసిల్వా, చరిత్ అసలంక, డసన్ షనక(కెప్టెన్), వానిందు హసరంగ, చమిక కరుణరత్నే, కసున్ రజితా, దుష్మంత చమీరా, అకిలా ధనుంజయ

డ్రీమ్ 11 ప్రిడిక్షన్

డ్రీమ్ 11 ప్రిడిక్షన్

వికెట్ కీపర్ ఆప్షన్స్: సంజూ శాంసన్, మినోద్ భానుక

బ్యాట్స్‌మన్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, అవిష్కా ఫెర్నాండో, డసన్ షనక

ఆల్‌రౌండర్స్: హసరంగ, హార్దిక్ పాండ్యా

బౌలర్స్: వరుణ్ చక్రవర్తీ, యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్

కెప్టెన్, వైస్ కెప్టెన్ ఆప్షన్స్: శిఖర్ ధావన్, పృథ్వీ షా, డసన్ షనక, సూర్యకుమార్ యాదవ్

మైఖేల్ డ్రీమ్ 11 టీమ్ 1: సంజూ శాంసన్ (కీపర్), శిఖర్ ధావన్ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ధనుంజయ డిసిల్వా, హసరంగ, దీపక్ చాహర్, చమిక కరుణరత్నే, యుజ్వేంద్ర చాహల్, దుష్మంత చమీరా, భువనేశ్వర్ కుమార్

మైఖేల్ డ్రీమ్ 11 టీమ్ 2: శిఖర్ ధావన్, పృథ్వీ షా,డసన్ షనక, ఇషాన్ కిషన్, అవిష్కా ఫెర్నాండో, సూర్యకుమార్ యాదవ్, వానిందు హసరంగ, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, దుష్మంత హసరంగ, చమిక కరుణరత్నే

Story first published: Thursday, July 22, 2021, 18:07 [IST]
Other articles published on Jul 22, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X