న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SL 2nd ODI: మనీశ్ పాండేపై వేటు పడేనా? గబ్బర్ సేన జోరు కొనసాగేనా? తుది జట్లు ఇవే!

India vs Sri Lanka 2nd ODI: Playing 11, Match Timings, Weather & Pitch Report And Live Streaming Info
India vs Sri Lanka 2nd ODI: Predicted Playing XI | Oneindia Telugu

కొలంబో: ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగినా.. ఊహించినట్టుగానే భారత జట్టు ఆధిపత్యం చెలాయించింది. అగ్రశ్రేణి ఆటగాళ్ల గైర్హాజరీలో డీలాపడ్డ శ్రీలంకపై తొలి వన్డేలో ఘనవిజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌లో బోణీ కొట్టింది. ఇప్పుడు అదే జోరు కొనసాగించేందుకు సిద్దమవుతుంది. మంగళవారం జరిగే రెండో వన్డేలోనూ శ్రీలంకను చిత్తు చేసి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకోని, చివరి మ్యాచ్‌లో రిజర్వ్ ఆటగాళ్ల సత్తాను పరిశీలించాలని భావిస్తోంది. మరోవైపు తమ వరుస పరాజయాలకు అడ్డుకట్ట వేయాలని శ్రీలంక పట్టుదలతో ఉంది. సొంతగడ్డపై ఎలాగైన మ్యాచ్‌ గెలిచి సిరీస్‌లో నిలవాలనే ధీమాతో బరిలోకి దిగుతోంది. మరీ తొలి వన్డే మాదిరి గబ్బర్ సేన గర్జిస్తుందా? లంక పై చేయి సాధిస్తుందా? అనేది చూడాలి!

పటిష్టంగా ధావన్ సేన..

పటిష్టంగా ధావన్ సేన..

విజయం ఉత్సాహంలో ఉన్న శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత జట్టు పటిష్టంగా ఉంది. ఓపెనర్ పృథ్వీ షా తన ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగించడం టీమ్‌కు ప్లస్ అయ్యింది. అతనికి తోడుగా వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్, కెప్టెన్ ధావన్ రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు. అయితే మనీష్ పాండేనే తన మార్క్ పెర్ఫామెన్స్ చూపించాల్సిన అవసరం ఉంది. టీ20 ప్రపంచకప్ ముందు అతను రిథమ్ అందుకోవడం అతనికి జట్టుకు చాలా ముఖ్యం. సూర్యకుమార్ యాదవ్ ఫుల్ ఫామ్‌లోనే ఉన్నాడు. హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలతో లోయరార్డర్ కూడా బలంగానే ఉంది. అయితే వైస్ కెప్టెన్, స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పేలవ ఫామ్ కలవరపెడుతోంది.

తొలి వన్డేలో అతను దారుణంగా విఫలమయ్యాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా రిథమ్ అందుకోవడం చాలా ముఖ్యం. మరో పేసర్ దీపక్ చాహర్ పర్వాలేదనిపించాడు. వీరికి అండగా హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయడం కలిసొచ్చే అంశం. కుల్చా జోడీ ఇరగదీసింది. కృనాల్ సైతం కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. మనీశ్ పాండే, భువీకి మరో చాన్స్ ఇవ్వనున్నారు. భువీకి రెస్ట్ ఇవ్వాలని భావిస్తే మాత్రం సైనీకి చోటు దక్కవచ్చు.

లంక చెలరేగాల్సిందే..

లంక చెలరేగాల్సిందే..

భారత్‌పై విజయం సాధించాలంటే ఫస్ట్ వన్డేలో చేసిన తప్పిదాలను శ్రీలంక సరిదిద్దుకోవాల్సిందే. స్పిన్నర్లను ఆడలేని బ్యాటింగ్ బలహీనతను అధిగమించాల్సిందే. పేసర్లను ధీటుగా ఆడిన లంక బ్యాట్స్‌మెన్.. స్పిన్‌కు తలవొంచారు. అలాగే ఫీల్డింగ్‌లో కూడా మెరుగవ్వాల్సిందే. అవిష్కా ఫెర్నాండో, మినోద్ భానుక, భానుక రాజపక్స‌లతో టీమ్ బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉంది. చివర్లో ధాటిగా ఆడగలిగే చిమిక కరుణ రత్నేఉన్నాడు. బౌలింగ్‌లో దుష్మంత చమీరా అద్భుతంగా రాణించాడు. కానీ అతనికి అండగా ఇసురు ఉడానా సహకారం అందించలేకపోయాడు. అవసరమైతే ఇసురు ఉడానా ప్లేస్‌లో శ్రీలంక మరో పేసర్‌ను తీసుకోవచ్చు. అదే జరిగితే లాహిరు కుమారా, కసున్ రజితాలో ఒకరికి అవకాశం దక్కవచ్చు.

తుది జట్లు (అంచనా)..

తుది జట్లు (అంచనా)..

భారత్: శిఖర్ ధావన్(కెప్టెన్), పృథ్వీ షా, ఇషాన్ కిషన్(కీపర్), మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్

శ్రీలంక: అవిష్కా ఫెర్నాండో, మినోద్ భానుక(కీపర్), భానుక రాజపక్స, ధనుంజయ డిసిల్వా, చరిత్ అసలంక, డసన్ షనక(కెప్టెన్), వానిందు హసరంగ, చమిక కరుణరత్నే,లాహిరు కుమారా, దుష్మంత చమీరా, లక్షన్ సందకన్

పిచ్/వెదర్ రిపోర్ట్..

పిచ్/వెదర్ రిపోర్ట్..

ఫస్ట్ వన్డే జరిగినే మైదానంలోనే ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ఉపయోగించే వికెట్‌ స్పిన్‌కు అనుకూలించనుంది. అలాగే బ్యాటింగ్‌కు సహకారంగా ఉండనుంది. మరోసారి భారీ స్కోర్లు నమోదయ్యే చాన్స్ ఉంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ వైపు మొగ్గు చూపవచ్చు. ఇక ప్రతీ ఏడాది ఈ టైమ్‌లో అక్కడ వర్షాలు పడటం సాధారణం. కానీ మంగళవారం వాతావరణం బాగానే ఉంటుందని, వర్ష సూచన లేదని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. 28-30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

లైవ్ టెలికాస్ట్..

లైవ్ టెలికాస్ట్..

మధ్యాహ్నం మూడు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. సోనీ టెన్ 1, 3, 4 తెలుగు/తమిళం చానెల్స్‌లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఆన్‌లైన్ వేదిక సోనీ లివ్‌లో కూడా మ్యాచ్ రానుంది. జియో యాప్ ద్వారా ఈ మ్యాచ్‌ను ఉచితంగా వీక్షించవచ్చు.

Story first published: Monday, July 19, 2021, 19:17 [IST]
Other articles published on Jul 19, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X