న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

4000 runs in T20 cricket: 4th T20Iలో కేఎల్ రాహుల్ మరో ఘనత

 India vs New Zealand, 4th T20I Live Cricket Score: KL Rahul completes 4000 T20 runs

హైదరాబాద్: వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో ఓపెనర్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో కేఎల్ రాహుల్ నాలుగు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. మిచెల్ శాంట్నర్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సు ద్వారా కేఎల్ రాహుల్ ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. న్యూజిలాండ్‌తో నాలుగో టీ20కి ముందు ఈ మైలురాయిని చేరడానికి 8 పరుగుల దూరంలో ఉన్న రాహుల్‌ ఈ మ్యాచ్‌లో దానిని అధిగమించాడు. దాంతో టీ20 క్రికెట్‌లో నాలుగు వేల పరుగుల మార్కును చేరిన 94వ క్రికెటర్‌గా నిలిచాడు.

టీ20ల్లో నాలుగు వేల పరుగుల మైలురాయిని అందుకునే క్రమంలో కేఎల్ రాహుల్ యావరేజి 42.10గా నమోదు కాగా... స్ట్రయిక్ రేట్ 140కిపైగా ఉంది. దీంతో టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ సగటు కల్గిన క్రికెటర్ల జాబితాలో రాహుల్‌ రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో పాకిస్తాన్‌ క్రికెటర్‌ బాబర్‌ అజామ్‌(42.60) ఉన్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ధోని, సురేష్ రైనా, శిఖర్ ధావన్‌ల తర్వాత టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో కేఎల్ రాహుల్ ఆరో స్థానంలో ఉన్నాడు.

కేఎల్ రాహుల్ తన చివరి ఐదు ఇన్నింగ్స్‌ల్లో చేసిన స్కోర్లు 45, 54, 56, 57నాటౌట్, 39. ఈ ఫార్మాట్‌లో కేఎల్ రాహుల్ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 39 పరుగుల వద్ద శాంట్నర్ బౌలింగ్‌లో ఇష్ సోధీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

ఈ క్రమంలో ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరిస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కేన్ విలియన్స్‌ను కేఎల్ రాహుల్ అధిగమించాడు. ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్ యావరేజి 83గా నమోదు కాగా... స్ట్రైక్ రేట్‌ 145గా ఉంది. రాహుల్ ఇప్పటికే ఈ సిరిస్‌లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. అత్యధిక స్కోరు 57.

వికెట్ తీసిన ఆనందం.. మైదానంలో గొంగళి పురుగు సెలబ్రేషన్స్‌ (వీడియో)వికెట్ తీసిన ఆనందం.. మైదానంలో గొంగళి పురుగు సెలబ్రేషన్స్‌ (వీడియో)

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తోలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఫలితంగా ఆతిథ్య జట్టుకు 166 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. రోహిత్ శర్మ స్థానంలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు.

కుగ్లెయిన్ బౌలింగ్‌లో శాంట్నర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. శాంసన్ ఐదు బంతుల్లో 8 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ(11) బెన్నెట్ బౌలింగ్‌లో శాంట్నర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్స ైతం 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 39 పరుగులు చేసి సోధీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ఇక, మొదటి రెండు టీ20ల్లో ఆకట్టుకున్న శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఏడు బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసి ఇష్ సోధీ బౌలింగ్‌లోనే సీఫర్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన దూబే(12) పరుగులకే ఔట్ కాగా, వాషింగ్టన్ సుందర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

భారత బ్యాట్స్‌మెన్‌లో మనీష్ పాండే(50) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. చివర్లో శార్దూల్ ఠాకూర్(20), నవదీప్ సైనీ(11) రాణించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో ఇష్ సోధీ మూడు, బెన్నెట్‌ రెండు, మిచ్చెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, కుగ్లెయిన్‌లకు తలో వికెట్ దక్కింది.

Story first published: Friday, January 31, 2020, 15:32 [IST]
Other articles published on Jan 31, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X