న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చాహల్‌ను అనకూడని మాటన్న గప్తిల్‌.. నవ్వు ఆపుకోలేకపోయిన రోహిత్!!

IND VS NZ 2020 : Martin Guptill Lets Slip Hindi Swear Word @ Chahal On Live ! || Oneindia Telugu
India vs New Zealand 2nd T20I: Martin Guptill lets slip Hindi swear word at Yuzvendra Chahal on live TV

ఆక్లాండ్‌: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 133 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 17.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. ఓపెనర్ లోకేష్ రాహుల్ (57) హాఫ్ సెంచరీ చేయగా.. యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ (44) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

టీమిండియాకు వరుసగా రెండో ఓటమి.. 1-2తో సిరీస్‌ కివీస్‌ కైవసం!!టీమిండియాకు వరుసగా రెండో ఓటమి.. 1-2తో సిరీస్‌ కివీస్‌ కైవసం!!

హాస్యాస్పద ఘటన:

హాస్యాస్పద ఘటన:

మ్యాచ్ అనంతరం కివీస్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌, టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజువేంద్ర చాహల్‌ మధ్య ఒక హాస్యాస్పద ఘటన చోటుచేసుకుంది. మైదానంలో గప్తిల్‌, రోహిత్‌ శర్మ ఏదో మాట్లాడుకుంటూ ఉండగా.. చహల్‌ వారి దగ్గరికి వెళ్లి ఏం జరుగుతోందని ప్రశ్నించాడు. చాహల్‌ను ఉద్దేశించి గప్తిల్‌ హిందీలో అనకూడని ఓ మాట అన్నాడు. దీంతో పక్కనే ఉన్న రోహిత్‌ నవ్వులు పూయించాడు. ఈ ఘటనంతా లైవ్‌లో రికార్డు అయింది.

టీమిండియా ఆటగాళ్లు పట్టించుకోలేదు:

టీమిండియా ఆటగాళ్లు పట్టించుకోలేదు:

అయితే మార్టిన్‌ గప్తిల్‌ తెలిసీ తెలియని భాషలో అలా అనడంతో అక్కడున్న టీమిండియా ఆటగాళ్లు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. వీడియో చూసిన క్రికెట్ అభిమానులు కూడా నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఈ వీడియోను తెగ షేర్ చేస్తూ.. లైకులు, కామెంట్లు పెడుతున్నారు. షేర్ చేసిన కొద్ది గంటల్లోనే ఎంతోమంది వీక్షించారు. రెండో టీ20లో గప్తిల్‌ 333 పరుగులు చేయగా.. రోహిత్ 8 రన్స్ చేసాడు. ఇక చహల్ 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు.

భారత్ ఘన విజయం:

రెండో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. మార్టిన్ గుప్తిల్ (33), కొలిన్ మన్రో (26), సీఫెర్ట్ (33 నాటౌట్) చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. భారత బౌలర్లలో జడేజా రెండు వికెట్లు సాధించాడు. అనంతరం టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 17.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కేఎల్‌ రాహుల్‌ (57), శ్రేయస్‌ అయ్యర్‌ (44) మ్యాచ్‌ను గెలిపించారు. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా 2-0తో ఆధిక్యంలో ఉంది. మూడో మ్యాచ్‌ ఈ నెల 29న జరగనుంది.

Story first published: Monday, January 27, 2020, 10:24 [IST]
Other articles published on Jan 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X