న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: చెన్నై చేరుకున్న రోహిత్, రహానే, శార్దూల్

India vs England: Rohit Sharma, Ajinkya Rahane and Shardul Thakur reach Chennai

చెన్నై: ఇంగ్లండ్‌తో జరగనున్న నాలుగు టెస్ట్ సిరీస్ కోసం భారత క్రికెటర్లు వరుసగా చెన్నైకి చేరుకుంటున్నాడు. చెన్నైలోని హోటల్‌లో టీమిండియా మేనేజ్‌మెంట్‌కు బుధవారం రిపోర్ట్ చేయాల్సిందిగా భారత క్రికెటర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆదేశాలు జారీచేయగా.. ఇప్పటికే ముంబైకి చెందిన రోహిత్ శర్మ, అజింక్య రహానే, శార్ధూల్ ఠాకూర్ అక్కడికి చేరుకున్నారు. శ్రీలంక పర్యటనను సోమవారం విజయంతో ముగించిన ఇంగ్లండ్ టీమ్ కూడా ఈరోజు చెన్నైకి రానుంది.

మూడు సార్లు కరోనా టెస్ట్

మూడు సార్లు కరోనా టెస్ట్

ఫిబ్రవరి 5 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుండగా.. చెన్నైకి చేరుకున్న తర్వాత ఆరు రోజులు ఇంగ్లండ్ టీమ్ క్వారంటైన్‌లో ఉండనుంది. ఆ తర్వాత మూడు రోజులు మాత్రమే ఆ జట్టుకు ప్రాక్టీస్ చేసుకునే వెసులబాటు ఉంది. మరోవైపు భారత్ జట్టును కూడా క్వారంటైన్‌లో ఉంచనున్నారు. బయో-సెక్యూర్ బబుల్‌లోకి చేర్చే ముందు ఇరు జట్ల ఆటగాళ్లకు కనీసం మూడు సార్లు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించనున్నారు.

సాయంత్రానికి అందరూ..

సాయంత్రానికి అందరూ..

ఆస్ట్రేలియా పర్యటన నుంచి పెటర్నటీ లీవ్‌పై మధ్యలోనే భారత్‌కు తిరిగొచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ.. బుధవారం మధ్యాహ్నానికి చెన్నైకి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా.. టెస్టు టీమ్‌లోకి ఎంపికైన భారత క్రికెటర్లు అందరూ ఈరోజు సాయంత్రానికి టీమ్‌తో కలుస్తారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు శ్రీలంక పర్యటనకు దూరంగా ఉన్న ఇంగ్లండ్ క్రికెటర్లు బెన్‌ స్టోక్స్, జోప్రా ఆర్చర్, రోరీ బర్న్స్ ఇప్పటికే చెన్నైకి చేరుకుని.. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు. రెండు జట్ల ఆటగాళ్లకు చెన్నైలోని హోటల్ లీలా ఫ్యాలస్‌లో తమిళనాడు క్రికెట్ అసోషియేషన్ సౌకర్యాలు కల్పించింది.

సిబ్బంది కూడా క్వారంటైన్..

సిబ్బంది కూడా క్వారంటైన్..

ఫిబ్రవరి 5 నుంచి తొలి టెస్ట్, 13 నుంచి రెండో టెస్ట్ ఇక్కడి చిదంబరం స్టేడియంలో జరగనున్నాయి. క్రికెటర్లకు సహకారం అందించేందుకు తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేస్తున్న లైజన్‌ మేనేజర్లు, గ్రౌండ్స్‌మన్, డ్రైవర్‌ తదితరులు కలిసి సుమారు 15 మంది బయో బబుల్‌లో ఉంటారు. కొందరు అసోసియేషన్‌ అధికారులను కూడా బయో బబుల్‌లో ఉంచాలని ముందుగా భావించినా... నిర్వహణ ఏర్పాట్లకు సమస్య రావచ్చని భావించి ఆ ఆలోచనను పక్కన పెట్టారు. వీరెవరూ మ్యాచ్‌ రోజుల్లో ఆటగాళ్లు డ్రెస్సింగ్‌ రూమ్‌లకు సమీపంలోకి రాకూడదని గట్టి ఆంక్షలు విధించారు.

నాలుగు టెస్ట్‌ల షెడ్యూల్..

నాలుగు టెస్ట్‌ల షెడ్యూల్..

తొలి టెస్టు: ఫిబ్రవరి 5-9, చిందంబరం స్టేడియం, చెన్నై (ఉదయం 9:30 గంటలకు ప్రారంభం)

రెండో టెస్టు: ఫిబ్రవరి 13-17, చిందంబరం స్టేడియం, చెన్నై(ఉదయం 9.30 గంటలకు)

మూడో టెస్టు(డే/నైట్‌): ఫిబ్రవరి 24-28, సర్దార్ పటేల్ స్టేడియం, అహ్మదాబాద్‌(మధ్యాహ్నం 2.30 గంటలకు)

నాలుగో టెస్టు: మార్చి 4-8, సర్దార్ పటేల్ స్టేడియం, అహ్మదాబాద్‌(ఉదయం 9.30 గంటలకు)

Story first published: Wednesday, January 27, 2021, 12:39 [IST]
Other articles published on Jan 27, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X