న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PinkBall Test: పంత్ గొప్ప బ్యాట్స్‌మన్‌.. కానీ ఓ అవకాశం ఇస్తాడు: రూట్

India vs England: Joe Root says Rishabh Pant has great game but will give you a chance for out

అహ్మదాబాద్: టీమిండియా వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్, సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ను ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ కొనియాడాడు. పంత్‌కు ఎంతో నైపుణ్యం ఉందని, అయితే అతడు ఓ అవకాశం ఇస్తాడన్నాడు. అశ్విన్‌ వరల్డ్‌ క్లాస్ ప్లేయరని, సొంత మైదానంలో ఎంతో విలువైన ఆటగాడని రూట్ పేర్కొన్నాడు. మొతెరా అద్భుతమైన స్టేడియం అని ప్రశంసించాడు. మొతేరా మైదానంలో మరికాసేపట్లో ప్రారంభం కానున్న డే/నైట్ టెస్టులో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి.

పంత్‌ ఒక ఛాన్స్‌ ఇస్తాడు

పంత్‌ ఒక ఛాన్స్‌ ఇస్తాడు

'రిషబ్ పంత్ గొప్ప బ్యాట్స్‌మన్. కొన్ని అసాధారణమైన షాట్లు ఆడతాడు. మ్యాచ్ గమనాన్ని ఒక్కసారిగా మారుస్తాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఇది చూశాం. కొంతమంది బౌలర్లు అతనికి బౌలింగ్ చేయడం చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు. ఏదేమైనా మేము మాత్రం అతడిని అడ్డుకుంటాం. ఇది కొంచెం కష్టతరమే. స్ట్రైక్ రొటేట్ చేయకుండా చూడడం లేదా త్వరగా ఔట్ చేసేందుకు ప్రయత్నిస్తాం. పంత్‌కు ఎంతో నైపుణ్యం ఉంది. అయితే అతడు ఔట్ అవ్వడానికి ఓ అవకాశం ఇస్తాడు. దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి' అని జో రూట్ తెలిపాడు.

అశ్విన్‌ వరల్డ్‌ క్లాస్ ప్లేయర్

అశ్విన్‌ వరల్డ్‌ క్లాస్ ప్లేయర్

'రవిచంద్రన్ అశ్విన్‌ వరల్డ్‌ క్లాస్ ప్లేయర్‌. ఎడమచేతి వాటం ఆటగాళ్లపై అతడికి ఉన్న రికార్డు ఎవరికైనా కాస్త గమ్మత్తుగా అనిపిస్తుంది. తన నైపుణ్యంతో అంత గొప్ప రికార్డు సాధించాడు. సొంత మైదానంలో అతడు ఎంతో విలువైన ఆటగాడు. గత మ్యాచ్‌లో సెంచరీ చేయడం అద్భుతం. జాక్ లీచ్‌ బౌలింగ్‌లో అశ్విన్ ఆడిన తీరుని గమనించా. అతడు క్రీజును చక్కగా ఉపయోగించుకుంటున్నాడు' అని ఇంగ్లీష్ కెప్టెన్ రూట్‌ తెలిపాడు. చెపాక్‌ వేదికగా జరిగిన రెండు టెస్టులో అశ్విన్‌ శతకంతో పాటు ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.

మొతెరా అద్భుతమైన స్టేడియం

మొతెరా అద్భుతమైన స్టేడియం

'మొతెరా అద్భుతమైన స్టేడియం. ఇది గొప్ప క్రికెట్‌కు వేదికగా నిలుస్తుందని, ఇరు జట్లకు సమాన అవకాశాలు ఇస్తుందని ఆశిస్తున్నా. ఇక్కడ ఉత్తేజకరమైన భావన కలుగుతుంది. గత మ్యాచ్‌లో అభిమానులు స్టేడియానికి వచ్చారు. కానీ ఇక్కడ స్టేడియం సామర్థ్యంతో అభిమానులు చేసే కేరింతలు గొప్ప అనుభూతిని కలిగిస్తాయి' అని జో రూట్ చెప్పుకొచ్చాడు. మూడో టెస్ట్ మ్యాచ్‌తోనే మొతెరా స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్‌ ప్రారంభం కానుంది. లక్షా పది వేల మంది వీక్షించే సామర్థ్యం స్టేడియం సొంతం. కొండల మధ్య అద్భుతంగా ఉంది.

ఫైనల్‌కు అర్హత సాధించాలంటే

ఫైనల్‌కు అర్హత సాధించాలంటే

నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ చెరో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో నిలవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ ఎంతో కీలకం. లార్డ్స్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరగనున్న ఫైనల్‌కు టీమిండియా అర్హత సాధించాలంటే సిరీస్‌ను కనీసం 2-1 తేడాతో విజయం సాధించాలి.

India vs England: డే/నైట్ టెస్టులో అతడికి చోటు దక్కదు: గంభీర్

Story first published: Wednesday, February 24, 2021, 13:37 [IST]
Other articles published on Feb 24, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X