న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: రహానే వికెట్‌తో జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత..!

India vs England: James Anderson becomes 3rd pacer to claim 900 international wickets

అహ్మదాబాద్: ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత్‌తో నరేంద్రమోదీ మైదానం వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానే‌‌ను ఔట్ చేసిన అండర్సన్.. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 900 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనతను అందుకున్న మూడో పేసర్‌గా.. ఆరో బౌలర్‌గా గుర్తింపు పొందాడు.

దిగ్గజాల సరసన..

దిగ్గజాల సరసన..

నాలుగో టెస్ట్‌ తొలి రోజు ఆటలో శుభ్‌మన్ గిల్‌ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చిన అండర్సన్.. రెండో రోజు ఆటలో క్రీజులో కుదురుకుంటున్న అజింక్యా రహానే(27)ను క్యాచ్ ఔట్‌గా వెనక్కిపంపాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీదరణ్(1,347), షేన్ వార్న్(1001), అనిల్ కుంబ్లే(954), గ్లేన్ మెక్‌గ్రాత్(949), వసీం అక్రమ్(916) అండర్సన్ కన్నా ముందున్నారు.

1000 క్లబ్‌కు..

1000 క్లబ్‌కు..

ముత్తయ్య మురళీ దరణ్, షేన్ వార్నర్ 1000 క్లబ్‌లో చేరగా.. 38 ఏళ్ల అండర్సన్ ఈ ఫీట్‌కు 100 వికెట్ల దూరంలో ఉన్నాడు. ఇదే ఫిట్‌నెస్‌తో ఫామ్‌ను కొనసాగిస్తే అతి త్వరలోనే ఆ ఘనతను కూడా జిమ్మీ సొంతం చేసుకుంటాడు. 160 టెస్ట్‌ల్లో ఇప్పటి వరకు 613 వికెట్లు తీసిన అండర్సన్.. 194 వన్డేల్లో 269 వికెట్లు, 19 టీ20ల్లో 18 వికెట్ల పడగొట్టాడు. భారత్‌తో సిరీస్‌లో ఫస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడిన జిమ్మీ.. రొటేషన్ పాలసీలో భాగంగా తర్వాతి రెండు టెస్ట్‌లకు దూరమయ్యాడు.

కష్టాల్లో భారత్..

కష్టాల్లో భారత్..

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. 24/1 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ 121 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది. తొలుత ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా(17)ను జాక్ లీచ్ ఎల్బీగా పెవిలియన్ చేర్చగా.. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీని బెన్ స్టోక్స్ డకౌట్ చేశాడు. అనూహ్యంగా దూసుకొచ్చిన షార్ట్‌పిచ్ బంతిని ఆడ‌లేక కోహ్లీ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ, రహానే కొంత పోరాడినా జిమ్మీ దెబ్బతీశాడు. లంచ్ బ్రేక్ ముందు రహానేను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో భారత్ 80/4తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. బ్రేక్ అనంతరం రోహిత్‌(49)ను స్టోక్స్ వికెట్ల ముందు బోల్తాకొట్టించాడు. ప్రస్తుతం క్రీజులో రిషభ్ పంత్ (22 బ్యాటింగ్), అశ్విన్(2 బ్యాటింగ్) ఉన్నారు.

Story first published: Friday, March 5, 2021, 13:48 [IST]
Other articles published on Mar 5, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X