న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: 'రిషబ్ పంత్‌ లేని టీమిండియాను ఊహించలేను.. అతడు నిజమైన మ్యాచ్‌ విన్నర్'

India vs England: Ian Bell said I cant imagine Team India without Rishabh Pant

లండన్: టీమిండియా యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌కీపర్‌ రిషబ్ పంత్‌‌పై ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్‌మన్‌ ఇయాన్‌ బెల్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇప్పుడు పంత్‌ లేని భారత జట్టును ఊహించలేనన్నాడు. ఇంగ్లండ్‌పై పంత్‌ ఎంతో పరిణతితో ఆడాడని, అలాంటి ప్రతిభావంతులు చాలా తక్కువగా ఉంటారన్నాడు. ఆదివారం పూణేలో జరిగిన 3వ వన్డేలో భారత్‌ విజయం సాధించడంలో పంత్ (78; 62 బంతుల్లో 5×4, 4×6) కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక వన్డే సిరీస్‌లో 329 పరుగులలో దుమ్మురేపాడు.

పంత్‌ లేని టీమిండియాను ఊహించలేను

పంత్‌ లేని టీమిండియాను ఊహించలేను

ఇయాన్‌ బెల్‌ తాజాగా ఈఎస్‌‍పీఎన్-క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ... 'ఇప్పుడిక రిషబ్ పంత్‌ లేని భారత జట్టును ఊహించలేను. ఎందుకో నాకు అలానే అనిపిస్తోంది. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. ఇంగ్లండ్‌పై పంత్ ఎంతో పరిణతితో ఆడాడు. అలాంటి ప్రతిభావంతులు చాలా అరుదుగా ఉంటారు. ఇది అతడికి ఆరంభం మాత్రమే. పంత్‌ నిజమైన మ్యాచ్‌ విన్నర్' అని అన్నాడు. వన్డే సిరీస్‌లో పంత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. మూడు మ్యాచులో అద్భుత ప్రదర్శన చేశాడు. వేగంగా ఆడుతూ జట్టుకు భారీ స్కోర్ అందించాడు.

భారీ షాట్లు కొట్టడమే కాకుండా

భారీ షాట్లు కొట్టడమే కాకుండా

'ఇంగ్లండ్‌పై అన్ని ఫార్మాట్లలోనూ రిషబ్ పంత్‌ విశేషంగా రాణించాడు. అతనికి ఇదో మంచి పర్యటన. పంత్‌ భారీ షాట్లు కొట్టడమే కాకుండా.. స్ట్రైక్‌ కూడా చక్కగా రొటేట్‌ చేస్తున్నాడు. బౌలర్లు చెత్త బంతులు వేస్తే చాలు భారీ షాట్లు ఆడాడు. ఒక్కోసారి ప్రమాదకర రీతిలో షాట్లు ఆడాడు. చాలా పరిణితి సాధించాడు. ఆ టెస్ట్ మ్యాచ్ సెంచరీ అతనికి చాలా విశ్వాసం ఇచ్చింది. అందుకే అంతలా చెలరేగుతున్నాడు' అని ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్‌మన్‌ ఇయాన్‌ బెల్‌ పేర్కొన్నాడు.

ధోనీ, గిల్‌క్రిస్ట్‌లను అధిగమిస్తాడు

ధోనీ, గిల్‌క్రిస్ట్‌లను అధిగమిస్తాడు

పంత్‌‌పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ కూడా తాజాగా ప్రశంసల జల్లు కురిపించాడు. 'టీమిండియాకు లోయర్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌లో దూకుడు తీసుకొచ్చింది పంత్‌. అతని వల్లే టీమిండియా రన్‌రేట్‌ పెరిగింది. పంత్‌ని కొద్దికాలంగా ఫాలో అవుతున్నా. భిన్న స్థానాల్లో బ్యాటింగ్‌ చేస్తూ అద్భుతంగా పరుగులు చేస్తున్న తీరు అమోఘం. అతను ఆడే విధానం, పరుగులు చేసే తీరు.. గత 30 ఏళ్లలో నేను ఇద్దరిలోనే చూశాను. వాళ్లే ఎంఎస్ ధోనీ, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌. ఈ ఇద్దరు వికెట్‌కీపర్లూ మ్యాచ్‌ ఫలితాన్ని మార్చగల సమర్థులు. పంత్‌ ఇలాగే కొనసాగితే వాళ్లిద్దర్నీ అధిగమిస్తాడు' అని అన్నాడు.

అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా

అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా

గతంలో పేలవ ఆటతీరుతో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న రిషబ్ పంత్.. గత మూడు నాలుగు నెలల్లోనే భారత అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగాడు. ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ (97: 118 బంతుల్లో 12x4, 3x6), గబ్బా ‌(89; 138 బంతుల్లో 9x4, 1x6) టెస్టుల్లో రెచ్చిపోయిన పంత్.. టీమిండియాకు చిరస్మరణీయ విజయం అందించిన విషయం తెలిసిందే. ఇటీవల ఇంగ్లండ్‌తోనూ జరిగిన చివరి టెస్టులో శతకం (101; 118 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లు) బాది.. మరోసారి తాను ఎంత విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు. ఆపై టీ20, వన్డే సిరీస్‌లో అదరగొట్టాడు.

‌‌IPL 2021: శ్రేయస్ అయ్యర్‌కు తగిలిన గాయం చాలా తీవ్రమైంది.. కోలుకోవడానికి 5 నెలలు!!

Story first published: Tuesday, March 30, 2021, 9:42 [IST]
Other articles published on Mar 30, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X