న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: శ్రేయస్ అయ్యర్‌కు తగిలిన గాయం చాలా తీవ్రమైంది.. కోలుకోవడానికి 5 నెలలు!!

IPL 2021: Delhi Capitals captain Shreyas Iyer to undergo surgery on April 8

న్యూఢిల్లీ: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈ నెల 26న ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో బౌండరీని ఆపే క్రమంలో భారత మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్ ఎడమ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. గాయం కారణంగా సిరీస్ నుంచి అతడు తప్పుకున్నాడు. అయితే అయ్యర్‌కు తగిలిన గాయం చాలా తీవ్రమైందని డాక్టర్లు తాజాగా తెలిపారు. ఏప్రిల్‌ 8న అయ్యర్‌ భుజానికి శస్త్ర చికిత్స చేయనున్నారు. సర్జరీ తర్వాత అతడు పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఐదు నెలల పట్టే అవకాశం ఉందని డాక్టర్లు వెల్లడించారు.

షాట్‌ను అడ్డుకునే క్రమంలో

షాట్‌ను అడ్డుకునే క్రమంలో

గత మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఏనిమిదో ఓవర్‌లో శ్రేయస్ అయ్యర్‌కు గాయం అయింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టో కొట్టిన షాట్‌ను అడ్డుకునే క్రమంలో డైవ్ చేసిన అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే టీమ్ ఫీజియోలు వచ్చి గాయాన్ని పరీక్షించగా.. దాని తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారి సూచనల మేరకు మైదానం వీడాడు. ఆ వెంటనే స్కానింగ్ కోసం హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ అయ్యర్ ఎడమ భుజం డిస్‌లోకేట్ అయ్యిందని తెలిసింది.

కోలుకోవడానికి 5 నెలలు:

కోలుకోవడానికి 5 నెలలు:

ఏప్రిల్‌ 8న శ్రేయస్ అయ్యర్‌కు భుజానికి శస్త్ర చికిత్స చేయనున్నారు. సర్జరీ తర్వాత అతడు పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఐదు నెలల పట్టే అవకాశం ఉంది. గాయం కారణంగా అయ్యర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. అలాగే ఆగస్టులో ఇంగ్లండ్ పర్యటనకు దూరం కానున్నాడు. ఇక సొంతగడ్డపై సెప్టెంబర్‌లో న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లకు మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత భారత్ వేదికగా టీ20 ప్రపంచకప్‌ ఉంది. అయ్యర్ వేగంగా కోలుకుంటేనే.. మెగా టోర్నీలో ఆడే అవకాశం దక్కుతుంది.

కొత్త సారథి రేసులో ఐదుగురు

కొత్త సారథి రేసులో ఐదుగురు

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శ్రేయస్ అయ్యర్‌ స్థానంలో యాజమాన్యం కొత్త సారథిని ప్రకటించాల్సి ఉంది. కెప్టెన్సీ కోసం ఐదుగురు ఆటగాళ్లు పోటీలో ఉన్నారు. స్టీవ్‌ స్మిత్‌, పృథ్వీ షా, రిషబ్ పంత్, రవిచంద్రన్‌ అశ్విన్‌, అజింక్య రహానేలు పోటీలో ఉన్నారు. గత సీజన్‌లో పరుగుల వరద పారించిన ఢిల్లీ సీనియర్ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ కూడా కెప్టెన్సీ రేసులో ఉండే అవకాశం ఉంది. అయితే ధావన్‌కు జట్టును ముందుండి నడిపించే సత్తా ఉన్నా.. గతంలో ఎప్పుడూ సారథ్యం చేసిన దాఖలు లేవు. కాబట్టి ధావన్‌కు కెప్టెన్సీ ఇవ్వకపోవచ్చు.

అవకాశం ఎవరికి:

అవకాశం ఎవరికి:

రాజస్థాన్‌ రాయల్స్‌కు చాలా ఏళ్లుగా కెప్టెన్‌గా వ్యవహరించిన ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ను ఇటీవల వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకున్నది. శ్రేయస్‌ అయ్యర్‌ దూరమయితే స్మిత్‌కు పగ్గాలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఐపీఎల్ టోర్నీతో పాటు ఆస్ట్రేలియాకు సారథ్యం వహించిన అనుభవం అతని సొంతం. స్మిత్ తర్వాత పృథ్వీ షా ఢిల్లీ కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. ఇటీవల ముగిసిన విజయ్‌ హజారే ట్రోఫీ 2021లో ముంబైని ఛాంపియన్‌గా నిలిపాడు. భారత అండర్19 జట్టును నడిపించిన అనుభవం కూడా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ వైస్‌ కెప్టెన్‌ పంత్‌కు తాత్కాలిక సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. పంత్ ఇప్పటివరకు కెప్టెన్‌గా వ్యవహరించకపోయినా.. ఢిల్లీ యాజమాన్యం అతనికి ఓ అవకాశం ఇవ్వనుంది.

మరో టీమిండియా మాజీ క్రికెటర్‌కు కరోనా పాజిటివ్.. ఆందోళనలో మిగతావారు!!

Story first published: Tuesday, March 30, 2021, 10:52 [IST]
Other articles published on Mar 30, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X