న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెహ్వాగ్ అనుకుందొకటి.. పృథ్వీ షాకు జరిగిందొకటి..!!

India Vs Australia XI 2018 : Virender Sehwag Picks Openers For Test Series | Oneindia Telugu
India vs Australia: Virender Sehwag picks openers for Test series

హైదరాబాద్: ఎన్నేళ్లుగానో ఎదురుచూస్తోన్న టెస్టు సిరీస్‌లో విజయం దక్కించుకోవాలని టీమిండియా కాంక్షిస్తోంది. ఈ క్రమంలో అసలైన ఫార్మాట్‌కు ఆసీస్ గడ్డపై భారత్ జట్టు సిద్ధమవుతోంది. డిసెంబరు 6 నుంచి ఆడిలైడ్ వేదికగా జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్‌ని ఆడనున్న టీమిండియాకి.. ఇప్పుడు ఓపెనింగ్ అనేది పెను సమస్యగా మారింది. యువ క్రికెటర్లు తొలి సారి ఆడుతున్న జట్టుతో ఓపెనింగ్ చేయించాలని భావిస్తోంది టీమిండియా మేనేజ్‌మెంట్. అందులో పృథ్వీ షా ఉండగా సీనియర్లుగా మురళీ విజయ్, కేఎల్ రాహుల్ ఉన్నారు. వీరి ముగ్గురిలో ఇద్దరినీ ఓపెనర్లుగా పంపాలన్నది టీమిండియా వ్యూహం.

మొదటిది సెంచరీ, రెండోది హాఫ్ సెంచరీ

మొదటిది సెంచరీ, రెండోది హాఫ్ సెంచరీ

వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌తో భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన ఓపెనర్ పృథ్వీ షా.. తొలి మ్యాచ్‌లోనే సెంచరీ, రెండో మ్యాచ్ హాఫ్ సెంచరీలతో మెరిపించాడు. తన దూకుడుకు టీమిండియాలో స్థానం దాదాపు పక్కా అయిపోయింది. అతనితో పాటు మరో ఓపెనర్‌గా ఆడుతున్న కేఎల్ రాహుల్ మాత్రం పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్నాడు. మరోవైపు మురళీ విజయ్ ఫామ్‌ కూడా ఆందోళనకరంగానే ఉంది.

ప్రాక్టీస్ మ్యాచ్‌లో పృథ్వీ షా కాలికి గాయం, తొలి టెస్టుకు డౌటే!!

పేలవ ఫామ్‌తో మురళీ విజయ్

పేలవ ఫామ్‌తో మురళీ విజయ్

ఇంగ్లాండ్ గడ్డపై ఆగస్టులో ముగిసిన టెస్టు సిరీస్‌లో మురళీ విజయ్ అవకాశం దొరికిన రెండు టెస్టుల్లోనూ పట్టుమని 10 ఓవర్లు కూడా క్రీజులో నిలవలేకపోయాడు. దీంతో.. రాహుల్, మురళీ విజయ్‌లో ఎవరికి అవకాశం ఇవ్వాలి..? అనే చర్చ జరుగుతున్న సమయంలోనే పృథ్వీ ప్రమాదం కొనితెచ్చుకున్నాడు. ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో భాగంగా మూడో రోజు ఫీల్డింగ్‌లో క్యాచ్ అందుకోబోయి కాలి చీలమండ మడత పడింది. దీంతో తొలి టెస్టుకు ఆడడంపైనే సందేహాలు నెలకొన్నాయి.

మీరైతే ఎవరెవరిని ఓపెనర్లుగా ఎంపిక

మీరైతే ఎవరెవరిని ఓపెనర్లుగా ఎంపిక

ఓ మీడియా సమావేశంలో ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌లో మీరైతే ఎవరెవరిని ఓపెనర్లుగా ఎంపిక చేస్తారు..? అని అడిగిన ప్రశ్నకు వీరేంద్ర సెహ్వాగ్‌ ఇలా బదులిచ్చాడు. ‘ఒకవేళ నేనే కెప్టెన్‌గా ఉండి ఉంటే..? కేఎల్ రాహుల్, పృథ్వీ షా‌లను సిరీస్ మొత్తం ఓపెనర్లుగా కొనసాగిస్తా. ఎందుకంటే.. మురళీ విజయ్ ఇటీవల భారత్ జట్టులోకి పునరాగమం చేశాడు. కాబట్టి.. అతను ఛాన్స్‌ కోసం వేచి ఉండాలి. '

కచ్చితంగా ఛాన్స్ దొరికినప్పుడు తమ ఫామ్‌ని

కచ్చితంగా ఛాన్స్ దొరికినప్పుడు తమ ఫామ్‌ని

ఒకవేళ ఈ నాలుగు టెస్టుల సిరీస్‌లో ఎవరైనా ఒకరు విఫలమైతే మాత్రం ఆ అవకాశాన్ని మురళీ విజయ్‌కి అప్పగించాలి. నా అంచనా ప్రకారం క్రికెటర్లు ఎవరైతే.. ఇలా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారో..? వారు కచ్చితంగా ఛాన్స్ దొరికినప్పుడు తమ ఫామ్‌ని నిరూపించుకుంటారు' అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

Story first published: Friday, November 30, 2018, 15:07 [IST]
Other articles published on Nov 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X