
వైద్య పరీక్షలు నిమిత్తం ఆస్పత్రికి..
అప్రమత్తమైన సిబ్బంది ప్రథమ చికిత్స అందించినా ప్రయోజనం లేకపోవడంతో.. వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ వేస్తుండగా మ్యాక్స్ బ్రియాంట్ బ్యాటింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా కొట్టిన షాట్‌ను పృథ్వీ అందుకునేందుకు యత్నించి గాయానికి గురైయ్యాడు. ముందుగా గాయం తీవ్రత ఊహించని సిబ్బందికి ఆ తర్వాత విషయం తెలిసి షాక్‌కు గురైయ్యారు.
సెల్ఫీ కోసం ఎగబడ్డ అభిమానులు
పృథ్వీ షా షాట్ సెలక్షన్ ఆట తీరు అచ్చం క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ని తలపించింది. కాగా, ఈ మ్యాచ్‌కి ముందు కాసేపు ప్రాక్టీస్ చేసిన పృథ్వీ షా అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్తుండగా అతడితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.

పృథ్వీ షా ఆడతాడనే విషయంపై సందేహం
టీమిండియా తొలి టెస్టుకు పృథ్వీ షా ఆడతాడనే విషయంపై సందేహం నెలకొంది. టెస్టు మ్యాచ్‌లతోనే అరంగ్రేటం చేసిన పృథ్వీ తొలి మ్యాచ్ నుంచి చక్కటి ఫామ్‌లో కొనసాగుతున్నాడు. సొంతగడ్డపై వెస్టిండీస్‌తో ఆడిన తొలి టెస్టులో సెంచరీ, హాఫ్ సెంచరీలతో మెరిపించాడు. ఇదే మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌తో పాటు ఓపెనర్‌గా బరిలోకి దిగి 69బంతులకు 66 పరుగులు (11ఫోర్లు) చేశాడు. రాహుల్ 3 పరుగులకే అవుట్ అయ్యాడు.

96 పరుగుల వద్ద పెవిలియన్‌కు
ఆ తర్వాత పుజారాతో కలిసి ఇన్నింగ్స్ కొనసాగించిన పృథ్వీ షా వరుస బౌండరీలతో చెలరేగాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన పృథ్వీ షా జట్టు స్కోరు 96 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 92 ఓవర్లలో 358 పరుగులకి ఆలౌటైంది. ఈ నేపథ్యంలో రాహుల్ ఇంకా ఫామ్ అందుకోకపోవడంతో పృథ్వీపైనే ఆశలు పెట్టుకున్న టీమిండియాకు మరో ప్రత్యామ్నాయంగా మురళీ విజయ్ మాత్రమే కనిపిస్తున్నాడు.

షా కోలుకుంటే తొలి టెస్టు ఆడే అవకాశం
నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌లో వర్షం కారణంగా బుధవారం తొలిరోజు ఆట రద్దైన సంగతి తెలిసిందే. గురువారం ఆరంభమైన మ్యాచ్‌లో భారత్ టాపార్డర్ పరుగుల మోత మోగించారు. డిసెంబర్ 6 అడిలైడ్ వేదికగా జరగనున్న మ్యాచ్‌కు షా కోలుకుంటే తొలి టెస్టు ఆడే అవకాశముంది. ఇప్పటికే ఈ పర్యటనలో ముగిసిన మూడు టీ20ల సిరిస్‌ను కోహ్లీసేన 1-1తో సమం చేసింది.


Click it and Unblock the Notifications













