న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఆసీస్‌తో మ్యాచ్ అంటే కోహ్లీలో ఇంకా భయంపోలేదు'

India vs Australia: Virat Kohli and Co need to avoid clean sweep to retain top spot in ICC rankings

న్యూ ఢిల్లీ: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఓడిపోతుందని మరోసారి ఆసీస్ మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాదు.. కంగారూలతో వారి సొంతగడ్డపై ఆడేందుకు భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటికీ వణికిపోతున్నాడని ఆసీస్ మాజీ కెప్టెన్ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. అడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య గురువారం నుంచి తొలి టెస్టు ప్రారంభంకానుండగా.. సిరీస్‌లో మొత్తం 4 టెస్టులు జరగనున్నాయి.

హిట్టింగ్ చేసే వారిదే పైచేయి

హిట్టింగ్ చేసే వారిదే పైచేయి

ఈ సిరీస్‌ని కోహ్లి, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ల మధ్య జరుగుతున్న పోరుగా అందరూ అభివర్ణిస్తుండగా.. పాంటింగ్ వాటిని కొట్టి పారేశాడు. 2014లోనే కోహ్లీని ఆస్ట్రేలియా బౌలర్లు వణికించారని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే అతనిలో ఆ భయం పోలేదని కవ్వింపు తరహాలో పాంటింగ్ వ్యాఖ్యానించాడు. ఈ టెస్టు సిరీస్‌లలో ఇరు జట్లు బౌలింగ్ విభాగంలో సమంగా ఉండడంతో ఎవరు బాగా హిట్టింగ్ చేస్తే వారిదే పైచేయి అనే తరహాలో మాట్లాడాడు.

తొలి టెస్టుకు ముందే ఆస్ట్రేలియా క్రికెటర్‌కు షాక్

జాన్సన్‌ని దీటుగా ఎదుర్కొన్న కోహ్లి

జాన్సన్‌ని దీటుగా ఎదుర్కొన్న కోహ్లి

2014-15 పర్యటనలో విరాట్ కోహ్లి, ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ మధ్య ఆధిపత్య పోరు జరిగింది. ఆ సమయంలో కోహ్లీని మాటలతో కవ్వించిన జాన్సన్.. వరుస బౌన్సర్లు విసిరి.. ఒకానొక సమయంలో ఫీల్డింగ్ ముసుగులో కోహ్లీని కొట్టే ప్రయత్నం కూడా చేశాడు. కానీ, సిరీస్‌లో జాన్సన్‌ని దీటుగా ఎదుర్కొన్న కోహ్లి.. సెంచరీల మోత మోగించాడు. 4 టెస్టుల ఆ సిరీస్‌లో ఏకంగా 4 సెంచరీలు బాదేసి.. 692 పరుగులు చేశాడు. అయినప్పటికీ భారత్ ఒక్క టెస్టు మ్యాచ్‌లోనూ గెలవలేక సిరీస్‌ని 0-2తో చేజార్చుకుంది.

కోహ్లీని ఇబ్బంది పెట్టిన జేమ్స్ అండర్సన్

కోహ్లీని ఇబ్బంది పెట్టిన జేమ్స్ అండర్సన్

పదునైన బౌన్సర్ తరహా బంతులతో ఇబ్బంది పెట్టాలి. థర్డ్ మ్యాన్ దిశగా బంతిని నెట్టి పరుగులు రాబట్టేందుకు కోహ్లీ ఎక్కువగా ప్రయత్నిస్తాడు. కాబట్టి.. కీపర్ పక్కనే మంచి ఫీల్డర్‌ని మొహరించాలి. కోహ్లీపై విజయం సాధించిన ఆటగాళ్లు ఎవరెలా..? అని విశ్లేషిస్తే.. తొలుత స్ఫురించిన పేరు ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్. అతను చాలా సందర్భాల్లో కోహ్లీని తన బౌలింగ్‌లో ఇబ్బంది పెట్టడంలో సఫలమయ్యాడు. ఆ టెక్నిక్స్‌ని సిరీస్‌లో అనుసరించాలి.

ఆస్ట్రేలియాపై ఆధిపత్యం చెలాయించాలనుకుంటే

ఆస్ట్రేలియాపై ఆధిపత్యం చెలాయించాలనుకుంటే

2014 పర్యటనలో విరాట్ కోహ్లీని పదునైన బౌలింగ్‌లో మిచెల్ జాన్సన్ వణికించాడు. అతనే కాదు.. ఆసీస్ జట్టు మొత్తం.. కోహ్లీనే టార్గెట్ చేస్తూ... బాడీ లాంగ్వేజ్‌తో ఒత్తిడిలోకి నెట్టింది. టీమిండియా ఆస్ట్రేలియాపై ఆధిపత్యం చెలాయించాలనుకుంటే చూస్తూ ఊరుకోలేను. సొంతగడ్డపై ఆడుతుండటంతో.. కచ్చితంగా ఆసీస్ బాడీ లాంగ్వేజ్‌లో దూకుడు ఉంటుంది. సిరీస్‌లో కోహ్లీని ఆరంభంలోనే పరుగులు చేయనీయకుండా కట్టడి చేయాలి.

Story first published: Tuesday, December 4, 2018, 17:12 [IST]
Other articles published on Dec 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X