Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తొలి టెస్టుకు ముందే ఆస్ట్రేలియా క్రికెటర్‌కు షాక్

Brother of Australia cricketer arrested over fake terror ‘hit list’

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు జట్టుకు దూరమైన నేపథ్యంలో హిట్టర్లలో ఒకరైన ఉస్మాన్ ఖవాజాపై జట్టు భారీ స్థాయిలో ఆశలు పెట్టుకుంది. టీమిండియాతో టెస్ట్ సిరీస్‌ ఆడనున్న నేపథ్యంలో భారత హిట్టర్లతో ధీటుగా రాణించేందుకు ఆసీస్ జట్టు కృషి చేస్తోంది. వాళ్లలో ఒకరైన ఖవాజాకు మరో రెండు రోజుల్లో టెస్టు జరగనుండగా ఆ ముందే షాక్ తగిలినట్లు అయింది.

మళ్లీ టీమ్‌లోకి వచ్చిన అతను రాణిస్తే

మళ్లీ టీమ్‌లోకి వచ్చిన అతను రాణిస్తే

ఉస్మాన్ సోదరుడు అర్సకాన్ ఖవాజాను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు డిసెంబరు 6 నుంచి టీమిండియాతో ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ కోసం ఉస్మాన్ ఖవాజా సిద్ధమవుతున్నాడు. గాయం కారణంగా కొన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ సిరీస్‌తో మళ్లీ టీమ్‌లోకి వచ్చిన అతను చక్కగా రాణిస్తే ఇంగ్లాండ్ వేదికగా జరగబోయే వరల్డ్ కప్‌ ఆసీస్ జట్టులో స్థానం దక్కించుకుంటాడు. ప్రస్తుత సిరీస్‌కు వార్నర్, స్మిత్‌లాంటి టాప్ ప్లేయర్స్ లేకపోవడంతో అతనిపైనే ఆస్ట్రేలియా జట్టు ఆశలు పెట్టుకుంది.

కోహ్లీ.. ధోనీని అనుసరించాలి: అఫ్రీది

ఉస్మాన్ సోదరుడు అరెస్టు కావడానికి కారణం:

ఉస్మాన్ సోదరుడు అరెస్టు కావడానికి కారణం:

తన యూనివర్సిటీ మాజీ కొలీగ్ అయిన నిజాముదీన్ అనే వ్యక్తిని అన్యాయంగా ఉగ్రవాదానికి సంబంధించిన కేసులో ఇరికించాడన్న ఆరోపణలపై ఖవాజాను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మాజీ ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ హత్యకు నిజాముదీన్ కుట్ర పన్నాడని ఖవాజా ఆరోపించాడు. అదే తరహాలో పోలీసులను నమ్మించాడు.

వ్యక్తిగత కక్షతోనే కేసులో ఇరికించాడని

వ్యక్తిగత కక్షతోనే కేసులో ఇరికించాడని

దీంతో ఆగస్టులో నిజాముదీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే విచారణలో ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధం లేదని తేలడంతో అతన్ని విడుదల చేశారు. అన్యాయంగా ఓ అమాయకుడిని అరెస్ట్ చేసినందుకు చింతిస్తూ.. అతని కోర్టు ఖర్చులను పోలీసులే చెల్లించారు. వ్యక్తిగత కక్షతోనే అర్సకాన్ ఖవాజా.. నిజాముదీన్‌ను ఈ కేసులో ఇరికించాడని న్యూ సౌత్ వేల్స్ అసిస్టెంట్ కమిషనర్ మిక్ విల్లింగ్ వెల్లడించారు.

అన్యాయంగా నిజాముదీన్‌ను ఇరికించినట్లు

అన్యాయంగా నిజాముదీన్‌ను ఇరికించినట్లు

యువతి విషయంలో ఈ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఖవాజా.. ఇలా అన్యాయంగా నిజాముదీన్‌ను ఇరికించినట్లు తేలింది. దీంతో మంగళవారం సిడ్నీలో ఉన్న అర్సకాన్ ఖవాజాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిజాముదీన్ శ్రీలంకకు చెందిన వ్యక్తి. అతన్ని అరెస్ట్ చేసినందుకు తాము చింతిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతని కోర్టు ఖర్చులు చెల్లించినా.. నిజాముదీన్ మాత్రం మరింత నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాడు.

Story first published: Tuesday, December 4, 2018, 10:39 [IST]
Other articles published on Dec 4, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+