న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Year Ender 2020: కంగారూల గడ్డపై భారత ప్రదర్శనలు.. మరచిపోలేని ఐదు జ్ఞాపకాలు ఇవే!!

India vs Australia: Team Indias Five unforgettable memories in Australia soil

హైదరాబాద్: కంగారూల గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవడం అంటే సాధారణ విషయం కాదు. అక్కడి బౌన్సీ పిచ్, పేస్‌కు స్వర్గధామం అయిన మైదానాల్లో ఆసీస్ పేసర్లను ధాటి పరుగులు చేయడం చాలా కష్టం. అలాంటిది విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు తొలిసారి కంగారూల గడ్డపై టెస్ట్ సిరీస్ అందుకుని చరిత్ర సృష్టించింది. భారత జట్టు 2018-19లో తొలిసారి ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే ఓడించి మొదటిసారి సిరీస్‌ సొంతంచేసుకుంది. ఇక సిరీస్‌ తుది ఫలితంతో సంబంధం లేకుండా ఆసీస్‌ గడ్డపై మన అభిమానులు మరచిపోలేని కొన్ని అద్భుత ప్రదర్శనలు భారత ఆటగాళ్ల నుంచి వచ్చాయి. ఆస్ట్రేలియా లాంటి పటిష్ట జట్టును వారి మైదానాల్లో సాధారణ జట్టుగా మార్చేస్తూ సాగిన మన క్రికెటర్ల ఆట చిరస్మరణీయం. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ నేపథ్యంలో ఓ ఐదు జ్ఞాపకాలను నెమరువేసుకుందాం.

లక్ష్మణ్‌ సొగసరి ఇన్నింగ్స్:

లక్ష్మణ్‌ సొగసరి ఇన్నింగ్స్:

2007-08 సిరీస్ అది. పెర్త్‌ వేదికగా మూడో టెస్ట్. ఈ మ్యాచ్‌ ఫలితం భారత జట్టు భావోద్వేగాలతో ముడిపడటం విజయాన్ని మరింత చిరస్మరణీయంగా మార్చింది. సిడ్నీ టెస్టు సందర్భంగా హర్భజన్ సింగ్- ఆండ్రు సైమండ్స్‌ మధ్య జరిగిన మంకీ గేట్‌ వివాదం కారణంగా ఒక దశలో టూర్‌ నుంచి తప్పుకోవాలనుకున్న భారత్‌.. అనిల్ కుంబ్లే నాయకత్వంలోని జట్టు ఒక్కటై గెలుపు కోసం పోరాడింది. రాహుల్ ద్రవిడ్‌ (93), సచిన్‌ టెండూల్కర్ (71)ల బ్యాటింగ్‌తో భారత్‌ 330 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా 212 పరుగులకే ఆలౌటైంది. అనంతరం వీవీఎస్ లక్ష్మణ్‌ (79) ఆటతో టీమిండియా 294 పరుగులు సాధించి ఆసీస్‌ ముందు 413 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆసీస్ 340 పరుగులకు ఆలౌట్ అవ్వడంతో భారత జట్టు సంబరాల్లో మునిగింది.

ద్రవిడ్‌ డబుల్.. ఆరేసిన అగార్కర్‌:

ద్రవిడ్‌ డబుల్.. ఆరేసిన అగార్కర్‌:

2003-04 సిరీస్‌.. అడిలైడ్‌ వేదికగా రెండో టెస్టు అది. సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌కు దక్కిన విజయం అది. రికీ పాంటింగ్‌ (242) డబుల్‌ సెంచరీతో ఆస్ట్రేలియా 556 పరుగులు చేయగా.. రాహుల్ ద్రవిడ్‌ (233), వీవీఎస్‌ లక్ష్మణ్‌ (148)లు ఆదుకోవడంలో భారత్‌ 523 పరుగులు చేసింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో అజిత్ అగార్కర్‌ (6/41) ధాటికి ఆసీస్‌ 196 పరుగులకే కుప్పకూలింది. 233 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆ క్షణాన ద్రవిడ్‌ ఆవేశంగా గాల్లోకి విసిరిన విజయపు పంచ్‌ను ఎవరూ మరచిపోలేరు.

చెలరేగిన చంద్రశేఖర్‌:

చెలరేగిన చంద్రశేఖర్‌:

1977-78 సిరీస్‌.. మెల్‌బోర్న్ మైదానంలో మూడో టెస్టు. ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు సాధించిన తొలి టెస్టు విజయం. రెండు ఇన్నింగ్స్‌లలో లెగ్‌ స్పిన్నర్‌ భగవత్‌ చంద్రశేఖర్‌ 6/52, 6/52 చెలరేగి జట్టును గెలిపించాడు. మొహిందర్‌ అమర్‌నాథ్‌ (72), గుండప్ప విశ్వనాథ్‌ (59) హాఫ్ సెంచరీలతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 256 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా 213 పరుగులకు పరిమితమైంది. సునిల్ గవాస్కర్ (118) సెంచరీ సహాయంతో రెండో ఇన్నింగ్స్‌లో 343 పరుగులు చేసిన భారత్‌ ప్రత్యర్థి ముందు 387 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆసీస్‌ 164 పరుగులకే ఆలౌట్ అయి భారీ ఓటమిని ఎదుర్కొంది.

 కపిల్‌ అత్యుత్తమ ప్రదర్శన:

కపిల్‌ అత్యుత్తమ ప్రదర్శన:

1985-86 సిరీస్‌ అది.. అడిలైడ్‌లో తొలి టెస్టు. టీమిండియాకు తొలి వన్డే ప్రపంచకప్‌ అందించిన కపిల్ ‌దేవ్..‌ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. ఇప్పటికీ ఆస్ట్రేలియా గడ్డపై భారత బౌలర్‌ అత్యుత్తమ ప్రదర్శన అదే(8/106). కపిల్‌ కెప్టెన్‌గా ఉన్న ఈ మ్యాచ్‌లో ముందుగా ఆస్ట్రేలియా గ్రెగ్‌ రిచీ (128), డేవిడ్‌ బూన్‌ (123) సెంచరీలతో 381 పరుగులు చేయగా.. గవాస్కర్ (166 నాటౌట్‌) అజేయ శతకంతో భారత్‌ 520 పరుగుల భారీ స్కోరు సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 8 ఓవర్లే ఆడే అవకాశం దక్కగా.. మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

19 ఏళ్లలో సచిన్‌ సెంచరీ:

19 ఏళ్లలో సచిన్‌ సెంచరీ:

1991-92 సిరీస్.. పెర్త్‌లో ఐదో టెస్టు. మ్యాచ్‌లో భారత్‌కు భారీ పరాజయం ఎదురైనా.. సచిన్‌ టెండూల్కర్ ప్రదర్శన మాత్రం అద్భుతం. ఆ తర్వాత సచిన్ ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా మారడానికి కావాల్సిన పునాదిని వేసింది. 19 ఏళ్ల సచిన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 161 బంతుల్లో 16 ఫోర్లతో 114 పరుగులు చేశాడు. బూన్‌ (107) సెంచరీతో ఆస్ట్రేలియా 346 పరుగులు చేయగా.. భారత్‌ 272 పరుగులకు పరిమితమైంది. అనంతరం డీన్‌ జోన్స్‌ (150 నాటౌట్‌), టామ్ మూడీ (101) శతకాలతో ఆసీస్‌ 367 పరుగులకు డిక్లేర్‌ చేసి సవాల్‌ విసిరింది. అయితే భారత్‌ 141 పరుగులకే ఆలౌట్ అయింది.

అతడు లేకపోయినా జట్టు బలంగానే ఉంది.. 20 వికెట్లు తీయగలం: రహానె

Story first published: Tuesday, December 15, 2020, 21:28 [IST]
Other articles published on Dec 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X