అతడు లేకపోయినా జట్టు బలంగానే ఉంది.. 20 వికెట్లు తీయగలం: రహానె

అడిలైడ్: టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ గాయంతో జట్టుకు దూరమయినా.. జట్టు బలంగానే ఉందని భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానె తెలిపాడు. ఇషాంత్ లేకపోయినా 20 వికెట్లు తీయగలం అని ధీమా వ్యక్తం చేశాడు. తొలి టెస్టు తుది జట్టుపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, మరో ప్రాక్టీస్ సెషన్ అనంతరం జట్టుకూర్పు గురించి ఆలోచిస్తామని రహానె చెప్పుకొచ్చాడు. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ డిసెంబర్ 17 నుంచి ప్రారంభంకానుంది. తొలి టెస్టు (డే/నైట్)కు మరో రెండు రోజులే మిగిలి ఉంది.

ఇషాంత్ లేకపోయినప్పటికీ:
అజింక్య రహానె వర్చువల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 'మా వద్ద బలమైన పేస్ దళం ఉంది. అయితే సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ జట్టుకు దూరమవ్వడం కచ్చితంగా లోటే. అయినా ఉమేశ్ యాదవ్, నవదీప్ సైనీ, మొహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీతో జట్టు సమతూకంగా ఉంది. వాళ్లు గొప్పగా బౌలింగ్ చేస్తారు. కొందరికి ఇక్కడ ఆడిన అనుభవం కూడా ఉంది. ఇక్కడ పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా బంతులు వేయాలో వారికి తెలుసు. మేం 20 వికెట్లు సాధిస్తామనే నమ్మకం ఉంది' అని అన్నాడు.

తుది జట్టుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు:
స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ దూరమవడంతో భారత తుది జట్టుపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఓపెనర్ల స్థానాల్లో గిల్, పృథ్వీ షా, మయాంక్‌తో పాటు కేఎల్ రాహుల్ కూడా పోటీపడుతున్నాడు. అలాగే వికెట్‌కీపర్ స్థానం కోసం వృద్ధిమాన్ సాహా, రిషబ్ పంత్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే తుది జట్టుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అజింక్య రహానె తెలిపాడు. 'తుది జట్టు విషయానికొస్తే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మరో ప్రాక్టీస్ సెషన్ అనంతరం ముగిసిన తర్వాత కూర్చొని ఓ నిర్ణయానికి వస్తాం. ఎవరు జట్టులోకి వచ్చినా.. మ్యాచ్‌ను గెలిపించగలరు. మా ఆటగాళ్లందరికీ ఎంతో ప్రతిభ ఉంది' అని అన్నాడు.

ఆ 40-50 నిమిషాలు ఏకాగ్రతతో ఆడాలి:
'జట్టులో సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక పాత్ర పోషిస్తాడు. బౌలింగ్‌లో వైవిధ్యం చూపించడంతో పాటు బ్యాటుతోనూ రాణిస్తాడు. అయితే కొత్త గులాబి బంతి స్వింగ్ అయినా బ్యాటింగ్ చేయగలం. కానీ సంధ్య కాలంలో పింక్ బాల్‌తో కఠిన సవాలుగా ఉంటుంది. ఆ 40-50 నిమిషాలు ఎంతో ఏకాగ్రతతో ఆడాలి. అప్పుడు బంతి వేగం కూడా పెరుగుతుంది. అదే ఎర్ర బంతి అయితే పేస్‌లో అనూహ్య మార్పులేమి ఉండవు' అని జింక్స్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా-ఎ జట్టులో జరిగిన రెండు వార్మప్ మ్యాచ్‌లతో మంచి ప్రాక్టీస్ దక్కిందని, అలాగే క్వారంటైన్‌లోనూ మంచి సాధన లభించిందని రహానె పేర్కొన్నాడు.
రెండో స్థానానికి దూసుకెళ్లిన కోహ్లీ.. టాప్-10లో పుజారా, రహానె!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications