న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Gabba Test: వారెవ్వా వాటే బ్యాటింగ్.. శార్దుల్, సుందర్ హాఫ్ సెంచరీ!

India vs Australia: Shardul Thakur and Washington Sundar hits maiden Test half-century

బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో టీమిండియా యువ ఆటగాళ్లు శార్దుల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ దుమ్ములేపుతున్నారు. తమ నిలకడైన బ్యాటింగ్‌తో వరల్డ్ క్లాస్ బౌలింగ్‌ను వణికిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఇద్దరు తమ టెస్ట్ కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీలు అందుకున్నారు. ముందుగా లయన్ బౌలింగ్‌లో షార్ధుల్ ఠాకూర్ సూపర్ సిక్స్‌తో అర్థ శతకం సాధించగా.. ఆ మరుసటి ఓవర్‌లోనే సుంధర్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతేకాకుంగా ఈ ఇద్దరు ఇప్పటికే ఏడో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు.

నిర్లక్ష్యపు ఆటతీరుతో టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైనా.. సుంధర్, శార్దుల్ అద్భుత బ్యాటింగ్‌తో ఆదుకున్నారు. ఓ దశలో 200 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ ఈ యువ జోడీ సూపర్ బ్యాటింగ్‌తో భారత్‌ను కష్టాల నుంచి గట్టెక్కించింది. ముఖ్యంగా ఈ ఇద్దరు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌లా ఆసీస్ బౌలర్లను ఎదుర్కోవడం చూడ ముచ్చటగా ఉంది.

వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలిస్తూ.. మంచి బాల్స్‌ను గౌరవించడం ఆకట్టుకుంటుంది. టెంప్ట్ చేస్తూ ఆసీస్ బౌలర్లు షాట్ బాల్స్ సంధించినా.. వాటిని వదిలేస్తూ పరిపక్వత ప్రదర్శించారు. ఈ జోడీని విడదీయడానికి ఆసీక్ కెప్టెన్ టిమ్ పైన్ చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. ముఖ్యంగా శార్దుల్- స్టార్క్ మధ్య పోరు ఆకట్టుకుంది. దాంతో ప్రస్తుతం 98 ఓవర్లలో భారత్ 6 వికెట్లకు 295 పరుగులు చేసింది. ఆసీస్ కన్నా ఇంకా 72 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది.

Story first published: Sunday, January 17, 2021, 11:27 [IST]
Other articles published on Jan 17, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X