న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'డ్రింక్స్ సరిగా అందించలేదా, జట్టులోకి తీసుకోలేదేం'

India vs Australia series: Not fair on Mayank Agarwal to be dropped from Indian Test side, says Zaheer Khan

హైదరాబాద్: టీమిండియాలో ఎంపిక పట్ల సెలక్టర్లు వ్యవహరిస్తోన్న తీరుపై క్రికెటర్లతో పాటు మాజీలు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యువ క్రికెటర్లకు జట్టులో చోటు దక్కకపోవడంతో వారికి మద్ధతుగా నిలిచి ప్రతిభ చాటుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే భారత యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌‌కి అవకాశాలివ్వడంలో సెలక్టర్లు అలక్ష్యం వహిస్తున్నారని మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డాడు.

మురళీ విజయ్ పునరాగమనానికి

మురళీ విజయ్ పునరాగమనానికి

కొద్ది రోజుల ముందు ఆస్ట్రేలియా ప్రకటనకు విడుదల చేసిన జట్టులో మయాంక్‌కు చోటు లభించని విషయం తెలిసిందే. గతంలో మురళీ విజయ్ సైతం అతనికి జట్టులో స్థానం కల్పించలేదని సెలక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో భారత టెస్టు జట్టులో సీనియర్ ఓపెనర్ మురళీ విజయ్‌కి ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో పునరాగమనానికి అవకాశమిచ్చారు సెలక్టర్లు.

మమ్మల్ని విమర్శించిన వారందరికిదే మా జవాబు

సెలక్టర్ల వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని

సెలక్టర్ల వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని

ఇప్పుడు ఇదే తరహాలో అగర్వాల్‌ని పట్టించుకోవాలని కోరుతున్నాడు జహీర్. 'మయాంక్‌ను జట్టులోకి తీసుకోవాల్సింది. ఏడాదికాలంగా దేశవాళీ క్రికెట్‌లో అద్భుత రికార్డులు నమోదు చేసిన యువ ఓపెనర్‌పై సెలక్టర్ల వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని' జహీర్ నిరాశ వ్యక్తం చేశాడు.

ప్రతిభని నిరూపించుకునే అవకాశమేది..

ప్రతిభని నిరూపించుకునే అవకాశమేది..

‘మయాంక్ అగర్వాల్‌‌కి టెస్టు జట్టులో చోటివ్వకపోవడం నాకు సమంజసంగా అనిపించలేదు. ఫామ్‌లో ఉన్న ఆటగాడు కనీసం జట్టులో ఉండాలి. ఇక తుది జట్టులోకి తీసుకుంటారా..? లేదా..? అనేది రెండో విషయం. అలాకాకుండా.. అసలు జట్టులోకే ఎంపిక చేయకపోతే.. ఇక ప్రతిభని నిరూపించుకునే అవకాశమేది..?

ఆటగాళ్లకి సరిగా డ్రింక్స్‌ని అందించలేదా

ఆటగాళ్లకి సరిగా డ్రింక్స్‌ని అందించలేదా

వెస్టిండీస్‌తో రెండు టెస్టులకి ఎంపికైన మయాంక్ అగర్వాల్.. రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. తాజాగా ఆస్ట్రేలియాతో సిరీస్‌కి ఎంపిక కాకపోవడంతో.. ఇప్పుడు అతను ‘నేను మైదానంలోని ఆటగాళ్లకి సరిగా డ్రింక్స్‌ని అందించలేదా..?' అని మదనపడుతుంటాడు. అని జహీర్ వ్యంగ్యంగా వెల్లడించాడు.

Story first published: Monday, October 29, 2018, 10:43 [IST]
Other articles published on Oct 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X