న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మమ్మల్ని విమర్శించిన వారందరికిదే మా జవాబు

We have proved our doubters wrong, says Nurse

హైదరాబాద్: భారత్‌పై మూడో వన్డేలో విజయం సాధించిన వెస్టిండీస్ ఆటగాళ్ల మీడియా ముందు రెచ్చిపోతున్నారు. గత మ్యాచ్‌లలా కాదంటూ.. ఇప్పుడు రెండు వన్డేలలోనూ గెలిచితీరతామనే విధంగా చెప్పుకొస్తున్నారు. భారత్ గడ్డపై వెస్టిండీస్ ప్రదర్శన గురించి అనుమానం వ్యక్తం చేసిన వారికి ఇటీవల ముగిసిన మూడు వన్డేల్లో మా జట్టు కనబర్చిన ప్రదర్శనే సమాధానమని ఆ జట్టు ఆల్‌రౌండర్ నర్స్ అభిప్రాయపడ్డాడు.

మేం విమర్శల్ని పట్టించుకోలేదు

మేం విమర్శల్ని పట్టించుకోలేదు

‘విమర్శల్ని మేము పట్టించుకోలేదు. సిరీస్‌లో బాగా ఆడాము కాబట్టే.. 1-1తో నిలవగలిగాం. మైదానంలో నాకు అప్పగించిన బాధ్యతని పూర్తిచేయడమే నా విధి. మా జట్టు ప్రదర్శనపై అనుమానం వ్యక్తం చేసిన వారి అంచనాలు తప్పు అని నిరూపించాం' అని నర్స్ వెల్లడించాడు.

 సమష్టిగా ఆడుతున్నామంటోన్న శామ్యూల్స్..

సమష్టిగా ఆడుతున్నామంటోన్న శామ్యూల్స్..

'మేమంతా సమష్టిగా ఆడుతున్నామని చెప్పిన శామ్యూల్స్.. తర్వాతి రెండు మ్యాచ్‌లను కోల్పోవడానికి ఇష్టపడటం లేదన్నాడు. మిగతా మ్యాచ్‌లను గెలవాలని చూస్తున్నాం. మేం పోటీ మాత్రమే ఇవ్వాలని అనుకోవడం లేదు. గెలవాలని చూస్తున్నాం. తదుపరి మ్యాచ్‌ను మేం మరింత సీరియస్‌గా తీసుకుంటాం' అని శామ్యూల్స్ తెలిపాడు.

నర్స్‌కి మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్

నర్స్‌కి మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్

పుణె వేదికగా శనివారం రాత్రి ముగిసిన మూడో వన్డేలో బ్యాట్‌తో 22 బంతుల్లోనే 4ఫోర్లు, 2సిక్సుల సాయంతో 40 పరుగులు చేసిన నర్స్.. బంతితోనూ శిఖర్ ధావన్ (35), రిషబ్ పంత్ (24) వికెట్లను పడగొట్టాడు. దీంతో.. భారత్‌పై 43 పరుగుల తేడాతో వెస్టిండీస్ జట్టు గెలుపొందగా.. కీలక ప్రదర్శన చేసిన నర్స్‌కి ‘మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.

బ్రబౌర్న్ స్టేడియంలో నాలుగో వన్డే

బ్రబౌర్న్ స్టేడియంలో నాలుగో వన్డే

పర్యటన ఆరంభంలో టెస్టులు ఆడిన వెస్టిండీస్ జట్టు భారత్ చేతిలో చిత్తుగా ఓడటంతో అందరూ విమర్శలు గుప్పించారు. కానీ.. వన్డేల్లోకి వచ్చేసరికి ఆ జట్టు ఆటతీరు పూర్తిగా మారిపోయింది. గౌహతి వన్డేలో 322 పరుగులు చేసి ఓడిన ఆ జట్టు.. విశాఖపట్నం వన్డేలో 321 పరుగులతో మ్యాచ్‌ని డ్రాగా ముగించింది. తాజాగా పుణె వన్డేలోనూ 283 పరుగులు చేసి.. 43 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో.. ఐదు వన్డేల సిరీస్‌ 1-1తో సమమవగా.. నాలుగో వన్డే బ్రబౌర్న్ స్టేడియంలో సోమవారం జరగనుంది.

Story first published: Sunday, October 28, 2018, 16:45 [IST]
Other articles published on Oct 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X