అందుకే మాథ్యూ వేడ్ స్లెడ్జింగ్‌కు బదులివ్వలేదు: రిషభ్ పంత్

మెల్‌బోర్న్: గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూవేడ్ తనను హేళన చేశాడని, అందుకే తాను స్పందించలేదని టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ తెలిపాడు. ఆస్ట్రేలియా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ మూడో రోజు ఆటలో పంత్, మాథ్యూవేడ్ మధ్య సరదా స్లెడ్జింగ్ నడిచిన విషయం తెలిసిందే. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా మాథ్యూ వేడ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వికెట్ల వెనుకాల పంత్ ఏదో ఒకటి అరుస్తూ బౌలర్లను ఉత్సాహ పరిచాడు. ఇక పంత్ మాటలకు చిర్రెత్తుకుపోయిన మాథ్యూ వేడ్ అతనికి ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేశాడు.

పంత్.. నువ్వు కొవ్వుపట్టి ఉన్నావ్

పంత్.. నువ్వు కొవ్వుపట్టి ఉన్నావ్

రిషభ్ పంత్ అధిక బరువును ప్రస్తావిస్తూ మాథ్యూవేడ్ కామెంట్ చేశాడు. ‘పంత్ నువ్వు 25 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నావు. ఖచ్చితంగా 20 నుంచి 25 లేక 30 కిలోలు అయినా అధిక బరువు ఉంటావు. ఎప్పుడైన నిన్ను నీవు బిగ్ స్క్రీన్‌పై చూసుకున్నావా? నిన్ను స్క్రీన్‌‌లో చూస్తే ఫన్నీగా కనిపిస్తావ్'అని ఘాటుగా కామెంట్ చేశాడు. ఇవి స్టంప్స్ మైక్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఆసీస్ ఇన్నింగ్స్ 25 ఓవర్లో వీరి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణకు సంబంధించిన వీడియోను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ట్వీట్ చేయడంతో నెట్టింట వైరల్ అయింది.

నవ్వుతూ ఉండటంతోనే..

నవ్వుతూ ఉండటంతోనే..

ఇక మూడో రోజు ఆట ముగిసిన అనంతరం అధికారిక బ్రాడ్ కాస్టర్ ఫాక్స్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఈ సరదా సంభాషణపై మాథ్యూ వేడ్ క్లారిటీ ఇచ్చాడు. తాను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పంత్ నవ్వుతూనే ఉన్నాడని, అసలు అతను ఎందుకు నవ్వుతున్నాడో తనకు అర్థం కాలేదన్నాడు. అతని నవ్వును చూసి నా బ్యాటింగ్ ఏమైనా ఫన్నీగా ఉందా? అనిపించిందని తెలిపాడు. ‘పంత్ నవ్వుతూనే ఉన్నాడు. అతనేం మాట్లాడలేదు కానీ.. నన్ను చూసి నవ్వుతూ ఉన్నాడు. అసలు నవ్వొచ్చే విషయం ఏం ఉందో నాకు అర్థం కాలేదు. నా బ్యాటింగ్ చూసి నవ్వుతున్నాడా? అనే సందేహం కలిగింది'అని వేడ్ చెప్పుకొచ్చాడు.

వ్యూహంలో భాగంగానే..

వ్యూహంలో భాగంగానే..

నాలుగో రోజు ఆటకు ముందు ఈ స్లెడ్జింగ్ వ్యవహారంపై స్పందించిన పంత్.. తాను నిశబ్దంగా ఉండటానికి గల కారణాన్ని తెలియజేశాడు. మాథ్యూ వేడ్ కావాలనే తనను రెచ్చగొడుతున్నాడనే విషయం తనకు అర్థమైందని, అందుకే అతనికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే బదులివ్వలేదని స్పష్టం చేశాడు. ‘మాథ్యూవేడ్‌తో జరిగిన పరిహాసాన్ని నేను పూర్తి ఆస్వాదించాను. కానీ మాథ్యూవేడ్ కావాలనే గొడవకు ఉసిగొల్పుతున్నాడనే విషయం నాకు అర్థమైంది. దాంతో అతను ఆటపై మరింత దృష్టి సారించాలనుకున్నాడు. కానీ నేను ఆ అవకాశం ఇవ్వదల్చుకోలేదు. ఆ కారణంతో అతను ఎన్ని మాటలన్నా స్పందించలేదు.'అని పంత్ చెప్పుకొచ్చాడు.

మెరుగవుతున్నా..

మెరుగవుతున్నా..

గత ఏడాదిన్నరంగా కాలంగా విఫలమవుతున్న పంత్.. బ్యాట్స్‌మెన్‌గా, కీపర్‌గా మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపాడు. ‘నేను బాగా ట్రైనింగ్ తీసుకుంటునున్నాను. ప్రాక్టీస్ చేస్తున్నాను. కానీ ఫస్ట్ టెస్ట్‌లో నాకు అవకాశం రాలేదు. ఇది ఆటలో సహజమే. రెండో టెస్ట్‌‌లో అవకాశం రావడం బాగుంది. జట్టు విజయం కోసం నా వంతు కృషి చేస్తున్నా. ఆస్ట్రేలియాలో కీపింగ్ చేయడం బాగుంటుంది. ఇక ఇక్కడి బౌన్స్ పిచ్‌లకు తగ్గట్లు నా ఫుట్‌వర్క్‌ను మెరుగుపరుచుకుంటున్నా. 'అని పంత్ చెప్పుకొచ్చాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, December 29, 2020, 15:10 [IST]
Other articles published on Dec 29, 2020

Latest Videos

  + More
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Yes No
  Settings X