న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి టెస్టులో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న పంత్

India vs Australia: Rishabh Pant equals world record for most catches in a Test

అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న 4 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. 31 పరుగుల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. ఆసీస్ గడ్డపై సుమారు పదేళ్ల తర్వాత భారత్ టెస్ట్ మ్యాచ్ గెలవడం ఇదే తొలిసారి. దీంతో భారత అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషత్ పంత్ ప్రపంచ రికార్డును సమం చేసి ఆనందాన్ని రెట్టింపు చేశాడు.

డివిలియర్స్‌ పేరిట రికార్డును సమంచేసి

డివిలియర్స్‌ పేరిట రికార్డును సమంచేసి

ధోనీ స్థానంలో టీమిండియా భావి వికెట్ కీపర్‌గా బరిలోకి దిగిన రిషబ్ పంత్ అంచనాలకు మించి రాణిస్తున్నాడు. ఆసీస్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో పంత్ ఏకంగా 11 క్యాచ్‌లు అందుకున్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన జాక్ రస్సెల్స్, దక్షిణాఫ్రికాకు చెందిన డివిలియర్స్‌ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు.

ఈ సారి కమిన్స్‌తో స్లెడ్జింగ్‌కు పాల్పడిన పంత్(వీడియో)

సాహా పేరిట ఉన్న రికార్డు

సాహా పేరిట ఉన్న రికార్డు

గతంలో భారత్ తరపున వృద్ధిమాన్ సాహా(10 క్యాచ్‌లు) పేరిట ఈ రికార్డు ఉండేది. మొహమ్మద్ షమీ బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్ ఇచ్చిన క్యాచ్ అందుకోవడం ద్వారా పంత్ ఈ ఘనత సాధించాడు. రస్సెల్స్ 1995లో సౌతాఫ్రికాపై, డివిలియర్స్ 2013లో పాకిస్థాన్‌పై ఈ రికార్డు నెలకొల్పారు. దీంతో పాటుగా పంత్ రెండు ఇన్నింగ్స్‌లోనూ రెండు సార్లు స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు.

31 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా

31 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా

అడిలైడ్ వేదికగా గురువారం టాస్ గెలిచి బ్యాటింగ్‌తో మ్యాచ్ ఆరంభించిన టీమిండియా సోమవారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో గెలుపొందింది. 4 టెస్టుల సిరీస్‌లో ఘనమైన బోణి అందుకుంది. జస్ప్రీత్ బుమ్రా (3/60), మహ్మద్ షమీ (3/65) ధాటికి 323 పరుగుల లక్ష్య ఛేదనకి దిగిన ఆతిథ్య ఆస్ట్రేలియా 291 పరుగులకే చేతులెత్తేసింది.

ఆసీస్ గడ్డపై చరిత్రలో తొలిసారి

ఆసీస్ గడ్డపై చరిత్రలో తొలిసారి

ఆసీస్ జట్టులో షాన్ మార్ష్ (60: 166 బంతుల్లో 5ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌లో తొలి టెస్టు మ్యాచ్‌ భారత్ జట్టు గెలుపొందడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. టీమిండియా తన తర్వాతి టెస్టును శుక్రవారం పెర్త్ వేదికగా ఆడింది.

1
43623
Story first published: Monday, December 10, 2018, 13:26 [IST]
Other articles published on Dec 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X