Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: ఆర్‌సీబీకి బిగ్ షాక్.. మ్యాచ్ విన్నర్ ఔట్!

ఐపీఎల్-2026 సీజన్ ప్రారంభానికి ముందే డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కి బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, జోష్ హజెల్ వుడ్ ఈ సీజన్‌లో పాల్గొనడంపై సందేహాలు నెలకొన్నాయి.

కుడి కాలి తొడ కండరాల గాయంతో పాటు అకిలెస్ టెండన్ అనే సమస్యతో బాధపడుతున్న హజెల్ వుడ్ ఇప్పటికే యాషెస్ సిరీస్‌తో పాటు టీ20 ప్రపంచకప్ 2026 ఆడలేదు.అతని గైర్హాజరీలో ఆస్ట్రేలియా పేలవ ప్రదర్శనతో లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. గాయం ననుంచి పూర్తిగా కోలుకోవడానికి హజెల్‌వుడ్ ఇంకాస్త టైమ్ పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

Major Setback for RCB Josh Hazlewood Doubtful for IPL 2026 Opener Amid Injury Recovery

ప్రస్తుతం హజెల్ వుడ్ క్రికెట్ ఆస్ట్రేలియా మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నారు. ఇప్పటివరకు అతనికి మెడికల్ క్లియరెన్స్ లభించలేదు. ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆర్‌సీబీ తలపడనుంది. ఈ మ్యాచ్‌తో పాటు ఫస్ట్ ఫేజ్ టోర్నీకి హజెల్ వుడ్ పూర్తిగా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.

క్రికెట్ ఆస్ట్రేలియా మెడికల్ టీమ్ ఇచ్చే నివేదికపైనే హజెల్ వుడ్ ఐపీఎల్ భవితవ్యం ఆధారపడి ఉంది. కనీసం టోర్నీ చివర్లోనైనా హజెల్ వుడ్ అందుబాటులో ఉంటాడనే గ్యారెంటీ లేదు. గత సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన హజెల్ వుడ్ 22 వికెట్లు తీసి ఆర్‌సీబీ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా పవర్ ప్లే, డెత్ ఓవర్లలో బ్యాటర్లను కట్టడి చేశాడు. హజెల్ వుడ్ దూరమైతే ఆర్‌సీబీ బౌలింగ్ విభాగం బలహీనంగా మారనుంది. మరోవైపు లీగల్ సమస్యల కారణంగా ఆర్‌సీబీ లెఫ్టార్మ్ పేసర్ యశ్ దయాల్ పాల్గొనడంపైనా సందిగ్ధం నెలకొంది.

Take a Poll

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:

వెంకటేష్ అయ్యర్ (రూ. 7 కోట్లు), జాకబ్ డఫీ (రూ. 2 కోట్లు), సాత్విక్ దేశ్వాల్ (రూ. 30 లక్షలు), మంగేష్ యాదవ్ (రూ. 5.2 కోట్లు), జోర్డాన్ కాక్స్ (రూ. 75 లక్షలు), విక్కీ ఓస్ట్వాల్ (రూ. 30 లక్షలు), విహాన్ మల్హోత్రా (రూ. 30 లక్షలు), కనిష్క్ చౌహాన్ (రూ. 30 లక్షలు).

రిటైన్ లిస్ట్:

రజత్ పటీదార్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేశ్ శర్మ, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టీమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, జాకోబ్ బెతెల్, జోష్ హజెల్ వుడ్, యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషార, రసిక్ సలామ్, అభినందన్ సింగ్, సుయాశ్ శర్మ.

Story first published: Friday, March 13, 2026, 10:45 [IST]
Other articles published on Mar 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+