For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Kavya Maran SRH: కావ్యా పాపకు బిగ్ జలక్..!!

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి మరికొన్ని రోజులే సమయం ఉన్న వేళ, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) యజమాని కావ్య మారన్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంగ్లాండ్‌లో జరిగే 'ది హండ్రెడ్' (The Hundred 2026) లీగ్ ప్లేయర్ల వేలంలో ఒక పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడం ద్వారా ఆమె వార్తల్లో నిలిచారు. అయితే, ఈ నిర్ణయం తీసుకున్న కొద్ది గంటల్లోనే ఆమెకు ఊహించని షాక్ తగిలింది.

పాక్ ప్లేయర్‌ను కొన్న ఏకైక భారత యజమాని!

గురువారం జరిగిన 'ది హండ్రెడ్' ప్లేయర్ల వేలంలో కావ్య మారన్‌కు చెందిన సన్‌రైజర్స్ లీడ్స్ పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను భారీ ధరకు దక్కించుకుంది. అతడి కోసం ఏకంగా ₹2.34 కోట్లు (190,000 పౌండ్లు) వెచ్చించింది. ఈ వేలంలో హారిస్ రవూఫ్, షాదాబ్ ఖాన్ వంటి అగ్రశ్రేణి పాక్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ, వారిని కొనడానికి ఏ భారతీయ యజమాని సాహసించలేదు. కానీ, కావ్య మారన్ మాత్రం ధైర్యంగా అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసి, ఈ సీజన్‌లో పాక్ ప్లేయర్‌ను కొన్న ఏకైక భారతీయ ఫ్రాంచైజీ యజమానిగా నిలిచారు.

Kavya Maran Faces Backlash SRH Leeds X Account Suspended After Buying Pakistan Cricketer Abrar Ahmed

కావ్య మారన్‌కు తగిలిన భారీ షాక్!

అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసిన వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో భారత క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.పాకిస్థాన్ ఆటగాడిని ఎలా కొంటారంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విమర్శలు ఎంతలా పెరిగాయంటే.. అబ్రార్‌ను కొన్న కొద్ది గంటల్లోనే సన్‌రైజర్స్ లీడ్స్ అధికారిక 'X' (గతంలో ట్విట్టర్) ఖాతాను సంస్థ నిలిపివేసింది .భారీగా వస్తున్న ట్రోలింగ్ మరియు దుర్భాషల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిబంధనలను ఉల్లంఘించినందువల్ల ఖాతాను నిలిపివేస్తున్నట్లు 'X' పాపప్ మెసేజ్‌ను చూపించింది.

కోచ్ వివరణ ఏంటంటే?

ఈ వివాదంపై సన్‌రైజర్స్ లీడ్స్ హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరీ స్పందించారు. "పాకిస్థాన్ ప్లేయర్లను తీసుకోవాలా వద్దా అనే చర్చ అసలు జరగలేదు. మాకు ఒక నాణ్యమైన స్పిన్నర్ కావాలి, అందుబాటులో ఉన్న వారిలో అబ్రార్ అహ్మద్ అత్యుత్తమ ఆప్షన్‌గా కనిపించాడు. ఆదిల్ రషీద్‌ను మిస్ అయిన తర్వాత మా ప్రాధాన్యత అంతా విదేశీ స్పిన్నర్‌పైనే ఉంది. అబ్రార్ జట్టులో చేరడం చాలా సంతోషంగా ఉంది" అని వెట్టోరీ వివరణ ఇచ్చారు.

Kavya Maran Faces Backlash SRH Leeds X Account Suspended After Buying Pakistan Cricketer Abrar Ahmed

IPL 2026పై దీని ప్రభావం ఉంటుందా?

గత ఏడాది నార్తర్న్ సూపర్ ఛార్జర్స్ ఫ్రాంచైజీని రూ.1100 కోట్లకు పైగా వెచ్చించి కావ్య మారన్ దక్కించుకున్నారు. జూలై 21 నుండి ఆగస్టు 16 వరకు ఈ లీగ్ జరగనుంది. అయితే, ఐపీఎల్ 2026 సీజన్ సరిగ్గా మార్చి 28న సన్‌రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ప్రారంభం కానుంది.ఈ తరుణంలో కావ్య మారన్ తీసుకున్న ఈ 'పాకిస్థాన్ ప్లేయర్' నిర్ణయం,ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పాపులారిటీపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

క్రీడల్లో ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వడం ఒక ఎత్తు అయితే, దేశాల మధ్య ఉన్న సున్నితమైన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మరో ఎత్తు. కావ్య మారన్ తీసుకున్న ఈ ధైర్యవంతమైన నిర్ణయం ఆమెకు 'ది హండ్రెడ్'లో మంచి ఫలితాలు ఇస్తుందేమో కానీ, ప్రస్తుతానికి మాత్రం సోషల్ మీడియాలో భారీ వ్యతిరేకతతో పాటు తన జట్టు ఖాతా కోల్పోయేలా చేసింది. ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Story first published: Friday, March 13, 2026, 9:36 [IST]
Other articles published on Mar 13, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+