ఈ సారి కమిన్స్‌తో స్లెడ్జింగ్‌కు పాల్పడిన పంత్(వీడియో)

న్యూ ఢిల్లీ: అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్లెడ్జింగ్‌తో ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను కవ్విస్తున్నాడు. గురువారం ఆరంభమైన తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజైన శుక్రవారం తొలిసారిగా డిఫెన్స్‌కు పాల్పడిన ఉస్మాన్ ఖవాజా అతిగా డిఫెన్స్ చేస్తుండటంతో 'ఇక్కడ అందరూ పుజారాలు కాలేరు' అంటూ అతడిపై కవ్వింపులకి దిగాడు రిషబ్ పంత్. ఇక ఆఖరిరోజు సోమవారం పాట్ కమిన్స్‌పై మరోసారి స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. అతని మాటలన్నీ స్టంప్ మైక్‌లో రికార్డు అవడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి.

వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేయాలని పాట్ కమిన్స్
323 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా ఆటలో చివరి రోజైన సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 104/4తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు తొలి సెషన్‌లో వరుసగా వికెట్లు చేజార్చుకుని 161/6తో నిలిచింది. ఈ దశలో వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేయాలని ఆశించిన పాట్ కమిన్స్ తాను ఎదుర్కొన్న తొలి 13 బంతుల్లోనూ కనీసం ఒక పరుగు కూడా చేయకుండా పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమై పాతుకుపోయాడు.
కమాన్.. కమాన్ పాటీ (పాట్ కమిన్స్)..
పాట్ కమిన్స్ ఆటతీరుపై వికెట్ల వెనుక నుంచి వరుసగా కామెంట్లు గుప్పించిన రిషబ్ పంత్.. ‘కమాన్.. కమాన్ పాట్ (పాట్ కమిన్స్).. కొన్ని సిక్సర్లు కొట్టేందుకు ప్రయత్నించు. ఇక్కడ ఆడటం అంత సులువు కాదు' అంటూ పదే పదే స్లెడ్జింగ్‌కి దిగాడు. అయితే.. వాటిని పట్టించుకోని పాట్ కమిన్స్ (28: 121 బంతుల్లో 3ఫోర్లు) భారత్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ.. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో అత్యధిక బంతులు ఆడిన ఆడిగా కొనసాగాడు.

టెస్టు మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో
ఆసీస్ గడ్డపై టీమిండియా టెస్టుల్లో శుభారంభాన్ని నమోదు చేసింది. అడిలైడ్ వేదికగా గురువారం టాస్ గెలిచి బ్యాటింగ్‌తో మ్యాచ్ ఆరంభించిన టీమిండియా సోమవారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో గెలుపొందింది. 4 టెస్టుల సిరీస్‌లో ఘనమైన బోణి అందుకుంది.

చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం
జస్ప్రీత్ బుమ్రా (3/60), మహ్మద్ షమీ (3/65) ధాటికి 323 పరుగుల లక్ష్య ఛేదనకి దిగిన ఆతిథ్య ఆస్ట్రేలియా 291 పరుగులకే చేతులెత్తేసింది. ఆ జట్టులో షాన్ మార్ష్ (60: 166 బంతుల్లో 5ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌లో తొలి టెస్టు మ్యాచ్ భారత్ జట్టు గెలుపొందడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications